Friday, December 31, 2010

శుభోదయమే సువర్ణాల సూర్యోదయం

శుభోదయమే సువర్ణాల సూర్యోదయం
సువర్ణాల సూర్యోదయాన్ని మేఘాలలో దర్శించు
నీ నేత్రములో కలిగే ఆనందంలో ఓ విజ్ఞాన వార్త కలుగుతుంది
విజ్ఞాన వార్తను విశ్వమంతా తెలిసేలా నీ సందేశాన్ని తెలుపు
నీ జీవితం విశ్వ విజ్ఞానంతో ఆత్మ యోగంలో సాగుతుంది

నాతో జత కలిసే విశ్వ రూపం

నాతో జత కలిసే విశ్వ రూపం ఎక్కడున్నది
ప్రతి రోజు ఏ దిక్కున ఎలా ఉదయిస్తున్నది
ఏ దివ్యత్వ ఆలోచన భావాలతో మేల్కొంటుంది
ఏ ఆత్మ యోగ స్వభావాలతో జీవిస్తున్నది
ఎలాంటి విశ్వ విజ్ఞానం ఆ రూపంలో ఉన్నది
నా రూపంలో నా మేధస్సులో ఉన్న రూపమే విశ్వం

నా మేధస్సులో మెరిసే మెరుపు

నా మేధస్సులో మెరిసే మెరుపు విశ్వమున కనిపించదు
మెరుపులో మేధస్సు కణాలు విశ్వ తత్వాలతో ప్రకాశిస్తాయి
ప్రకాశించుటలో దివ్య విచక్షణ భావాలు విశ్వాన్ని కాంక్షిస్తాయి
విశ్వాన్ని కాంక్షించుటలో విశ్వ విజ్ఞాననం మేధస్సులో చేరుతుంది
క్షణమున సూక్ష్మ క్షణ భావాలు విశ్వమున కలిగినట్లే నా మేధస్సులో
విశ్వ మేధస్సుతో విజ్ఞానంగా ప్రకాశించుట మెరిసే మెరుపుకు తన్మయమే

అన్ని ఆలోచనలు ఒకే సారి ఎవరి

అన్ని ఆలోచనలు ఒకే సారి ఎవరి మేధస్సులో కలుగుతాయి
ఒక వేళ కలిగితే అతనిలో విశ్వ విజ్ఞాన భావాలు అనంతమే
యోగత్వ ఆత్మ భావాలతో జీవించే వారిలోనే విశ్వ విజ్ఞానము
నిత్యం విశ్వ అన్వేషణ పర లోక ధ్యాసలో చేసే వారికే విజ్ఞానం
విశ్వ విజ్ఞానాన్నే జీవిత లక్ష్యంగా ఆత్మను జయించడమే చైతన్యం

విశ్వ మిత్రమా విశ్వ జ్ఞానమా

విశ్వ మిత్రమా విశ్వ జ్ఞానమా విశ్వ లోకాలను చూపించు
విశ్వ భావ స్వభావాలను నా మేధస్సులో దాచుకుంటా
విశ్వ రూపాలను నా మేధస్సు కణాలు కాంక్షిస్తున్నాయి
నా అన్వేషణను నా మేధస్సులోనే విశ్వ రూపాలతో సాగిస్తాను

అందరూ వ్యాపార పరంగానే

అందరూ వ్యాపార పరంగానే ఆలోచిస్తున్నారు గాని ఆ తర్వాత జరిగే కార్యాలు ఏవి
తర్వాత జరిగే కార్యాలకు విశ్వమున ఎలాంటి ప్రభావాలు ఏర్పడుతూ వస్తున్నాయి
ఎటువంటి సమస్యలతో ఏ విధంగా కాలం ఎలా వెళ్ళుతుందో కాల ప్రభావాలకే తెలుసు
వ్యాపార పరిశ్రమల ద్వారా విశ్వం ఏ విధమైన మార్పులతో వెళ్ళుతుందో గమనించారా
వాతావరణ కాలుష్యం అశుభ్రత సమాజం ఆర్ధిక ఆహార విద్యా సమస్యల ఇబ్బందులెన్నో
ప్రతి పని ద్వారా కలిగే ప్రభావం ఏమిటి వాటి నుండి కలిగే సమస్యలను ఎలా తొలగించుకోవాలి
ప్రతి పని తర్వాత దాని ప్రభావాలను చివరి దాకా ఆలోచిస్తే ఆరోగ్య పరమైనా జీవితం లభిస్తుంది
విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోండి విశ్వ ప్రభావాలను గుర్తించండి విశ్వ సమాజాన్ని మార్చుకోండి

దిక్కులు తోచని విధంగా విశ్వమున

దిక్కులు తోచని విధంగా విశ్వమున ఒక్కడినే ప్రయాణిస్తున్నా
ఏ దిక్కున వెళ్ళుతున్నానో ఏ విశ్వ రూపం కనిపించుట లేదు
అంతా చీకటే అణువంతైనా కాంతి నేత్రానికి కనిపించడం లేదు
నేత్రాలు ఉన్నా మేధస్సులో కాంతి భావన కలగని స్థాన భ్రంశం
నేను ప్రయాణించుటలో అక్కడే ఉన్నానేమోనని నా భావన
నా శ్వాసను గమనించడానికి నాలో శ్వాస కూడా తెలియుటలేదు
మరణం లేకుండా ఏ దిక్కు లేక నాలో నేను ప్రయాణించుట శూన్యార్థమే
శూన్యములో జీవిస్తున్నానని విశ్వం నాలో కేంద్రమై స్థాన భ్రంశం చెందుతున్నది

ఓ నక్షత్రాన్ని చూసి విశ్వమున

ఓ నక్షత్రాన్ని చూసి విశ్వమున ఆగిపోయా
ఆ దివ్య నక్షత్రమే నాకు దిక్కని భావించా
నక్షత్రమే నాకు విజ్ఞాన జీవితమని గమనించా
నక్షత్ర కాంతిలోనే విశ్వ విజ్ఞానాన్ని గ్రహించా
నా మేధస్సు నక్షత్రమై విశ్వ విజ్ఞానంగా ప్రకాశిస్తున్నది

మేధస్సున మదం ఉంటే ఆవేదన

మేధస్సున మదం ఉంటే ఆవేదన భావాలకు ఉగ్ర వాదిలా మనిషి ప్రవర్తన మారుతుంది
మనిషిలో ఉన్న అరిషడ్ వర్గాల ప్రభావాలు మేధస్సును అదో స్థితిలో కలచి వేస్తుంటాయి
మేధస్సులో కలిగే ప్రాశాంతమైన ఆలోచనలతోనే అరిషడ్ వర్గాలను అదుపు చేసుకోవాలి
ఎప్పుడూ ఓ ఆలోచన ఎరుకగా మన మేధస్సు స్థితిని పరిశీలిస్తూ ప్రశాంతతను కలిగించాలి
ప్రశాంతమైన ఆలోచనలకై ధ్యాన సాధనతో శ్వాసను గమనిస్తూ ఆలోచనల స్థితిని గ్రహించాలి
ఆలోచనల స్థితిలోని భావ స్వభావాల అర్థాలను గమనించినట్లైతే నీలో విశ్వ ప్రశాంతతయే

మనిషిగా జన్మనిచ్చారు మనిషిగా

మనిషిగా జన్మనిచ్చారు మనిషిగా జీవితాన్నిచ్చారు మనిషిగా విజ్ఞానాన్నిచ్చారు
మేధస్సుగా విశ్వ విజ్ఞానాన్ని ఎవరు ఇవ్వగలరు ఎవరికి ఎంతవరకు తెలుపగలరు
ప్రకృతిలోనే విశ్వ విజ్ఞాన భావన కల్గుతున్నట్లు ఎవరు విశ్వాన్ని వివరించగలరు
విశ్వ రూప భావ స్వభావాల ఆత్మ దివ్య తత్వాలు ఎవరి మేధస్సులో ఉన్నాయి
నీకు నీవుగా నీవే నీ మేధస్సు భావాలతో విశ్వమున అన్వేషించి విజ్ఞానాన్ని తెలుసుకో

ఓ కార్యాన్ని నీవు ఎలా చేశావో నాకు

ఓ కార్యాన్ని నీవు ఎలా చేశావో నాకు తెలుస్తున్నది
నీకు తెలుపక పోయినా నీ గుణ విధానాన్ని గ్రహించా
నీవు పైపై మాటలతో మెరుగులు దిద్దేలా నీ కార్యాన్ని తెలుపగలవు
నీ కార్య లోపమేమిటో నాకు ఏనాడో నీ అనుభవం తోనే తెలిసింది
ఒకరు అప్పగించిన కార్యాన్ని సద్వినయోగం చేసుకునేలా చేయండి
పై పై మాటలతో వీలైనట్లు చేసి లాభాన్ని ఆర్జించడం సమం కాదు

నా స్వభావాలకు నీ మేధస్సులో

నా స్వభావాలకు నీ మేధస్సులో ఓ దివ్యాలోచన ఏనాడైనా కలగవచ్చు
నీ కేలిగే ఆలోచనలను వివిధ విచక్షణ భావాల అర్థాలతో గమనిస్తూ గ్రహించు
ఏ భావన ఏ అర్థాన్ని తెలుపుతుందో ఆ ఆలోచననే జ్ఞాపకంగా చేసుకో
జ్ఞాపకమైన దివ్యాలోచనతో విశ్వ భావ స్వభావాల విజ్ఞానాన్ని గ్రహించు

నేను నిద్రిస్తున్న స్థానముననే మహా

నేను నిద్రిస్తున్న స్థానముననే మహా చతుర్భుజ కోణ కేంద్రాన్ని నిర్మించారు
నా ఆత్మకు రక్షణగా నా మేధస్సుకు అద్భుతంగా శరీరానికి ధ్యాసగా నిర్మించారు
విశ్వ శక్తి నాలో కేంద్రమై నా శరీరం నిర్జీవంతో ఉండాలనే మేధస్సు నశించకూడదనే
ఆత్మలో యోగత్వ భావాలు తొలగిపోరాదనే ఆనాడు మహా ఆలోచనతో నిర్మించారు
విశ్వమున నేను నిద్రిస్తున్నట్లు నా మేధస్సున ఆనాటి విశ్వ విజ్ఞాన ధ్యాన భావన

కాలం ఇంకా జీవమై సాగుతున్నది

కాలం ఇంకా జీవమై సాగుతున్నది
విశ్వ కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి
ఎవరిలో ఏ విజ్ఞాన కార్యాలు సాగుతాయో కాలానికే ఎరుక
నాలో ఉన్న విజ్ఞాన కార్యాలకు కాలం ఎప్పుడో తెలియదే

మీలో విశ్వ విజ్ఞాన కార్యాలు సాగితే

మీలో విశ్వ విజ్ఞాన కార్యాలు సాగితే ఆకలి నిద్ర భావాలు ఆగిపోతాయి
విశ్వమున ఓ విజ్ఞాన శక్తితో విశ్వ కార్యాలతో సాగుతూ ప్రయాణిస్తారు
మీలో అలసట భావాలు కలిగితే ఉత్తేజ శక్తికై ప్రశాంతంగా ధ్యానిస్తారు
మహా విజ్ఞాన శక్తితో విశ్వ కార్యాన్ని ఇంకా ప్రజ్ఞానంగా కొనసాగిస్తారు

నీ విశ్వ భావాలు జగతికి ఎప్పుడు

నీ విశ్వ భావాలు జగతికి ఎప్పుడు తెలుస్తాయి
నీ విజ్ఞాన భావాలను ఏ ఏ లోకాలు గ్రహిస్తాయి
విశ్వ విజ్ఞాన భావ స్వభావాలతో సాగడం ప్రశ్నార్థమే
విశ్వమే జీవమై మేధస్సులో విజ్ఞానమై చేరితేనే
ఆలోచనలో విచక్షణ భావమై శ్వాసలో స్వభావమై
జీవ కణాలలో ఆత్మ మేల్కొని దివ్యంగా ప్రకాశిస్తుంది
ఆత్మ భావ ప్రకాశమే విశ్వ లోకాలకు చేరుతాయి

నా నుండి తొలగిపోయే వ్యర్థం

నా నుండి తొలగిపోయే వ్యర్థం పంచభూతాలో చేరి శూన్యమై పోవాలని నా విశ్వ భావన
వీలైనంత త్వరగా శూన్యమైపోతే ఎటువంటి అజ్ఞాన భావాలు లేక ఏ అనారోగ్యం కలగదు
విశ్వమున సూర్య చంద్రులు గాలి చెట్లు వర్షం ప్రకృతి వివిధ రకాలుగా ఎన్నో భావాలతో
వ్యర్థపు మలినాన్ని శుభ్రం చేస్తూ మరో చోట నుండి విజ్ఞాన భావాలు కలిగేలా చేస్తాయి
ఆరోగ్య భావాల కోసం విశ్వ ప్రకృతి సూర్య రశ్మిని చంద్ర కాంతిని గాలిని వర్షాన్ని
స్వచ్ఛమైన ప్రాణ వాయువును వివిధ స్వభావాలతో కలిపిస్తూనే ఉంటుంది
మనం మహా గొప్పగా ఆలోచిస్తూ వివిధ గొప్ప కార్యాలతో సాగుతున్నామంటే
విశ్వ తత్వాల భావ స్వభావాల అనూహ్య పర్యావరణం సూక్ష్మంగా ఎన్నెన్నో
అశుభ్రతను వీలైనంత త్వరగా హాని లేకుండా శూన్యం చేసే మార్గాన్ని పాటించండి

కర్మ సిద్ధాంతము నా మేధస్సులోనే

కర్మ సిద్ధాంతము నా మేధస్సులోనే ఉన్నది
కర్మ ప్రభావాలు నా జీవితంలోనే కలుగుతున్నాయి
నా కార్యాలు కర్మతోనే ముడిపడి ఉన్నాయి
నాలో ఆలోచనలు కర్మను నశింప జేస్తాయనే
విశ్వ విజ్ఞానాన్ని ఆత్మ ధ్యాన ధ్యాసతో అన్వేషిస్తున్నా

మీకేవరికి కర్మలు లేవా అనుభవించే

మీకేవరికి కర్మలు లేవా అనుభవించే ఆత్మ యోగ తత్వము లేదా
విశ్వ కర్మణగా అన్ని కర్మలను నా ఆత్మ మేధస్సులోనే దాచుకున్నా
మీలో కలిగే అజ్ఞాన కార్యాల ప్రమాదాలకు మీలోని ఆలోచన లోపమే
ఆలోచన లోపాలతో సాగే కార్యాలలో విశ్వ కాలం కర్మతో తాండవిస్తుంది
కర్మను విజ్ఞాన కార్యాలతో తొలగించుకుంటూ దివ్య భావాలతో సాగాలి
ప్రతి క్షణాన ప్రతి కార్యం అజ్ఞాన కర్మ ప్రభావంతో సాగేలా కాల భావన
ఎరుకతో మన కార్యాలను దివ్య ధ్యాసతో కార్య కారణ క్రమ ప్రణాళికతో సాగించాలి

కర్మను దాచుకోవద్దు వీలైనంత త్వరగా

కర్మను దాచుకోవద్దు వీలైనంత త్వరగా తొలగించుకో
నీవు సాధించే మహా విజయాలు ఎన్నో ఉన్నాయి
నీకు సమయము చాలని విధంగా ఎన్నో కార్యాలు నీకై ఉన్నాయి
కర్మ తొలగిపోతేగాని మహా విశ్వ కార్యాలు సాఫీగా జరగలేవు
రోగామైనా దుఃఖమైనా అజ్ఞానమైనా త్వరగా వదిలించుకో

మరణమే శుభ కార్యమైతే ఎవరికి

మరణమే శుభ కార్యమైతే ఎవరికి కన్నీరు రావా
మరణం ఆత్మ బంధాల దుఃఖ కార్య సమావేశమా
ఆత్మ జ్ఞానం తెలిస్తే బంధాలు తెలిసినా దుఃఖం వీడదేమో
కన్నీరు లేని బంధం మరణం కాదా ఆత్మీయ బంధం కాదా
కన్నీరు లేకున్నా దుఃఖాన్ని లేకుండా మరణ కార్యాన్ని చేసుకోలేము
మరణం శుభ కార్యం కావాలంటే పాపాలు చేసేవారిదే అవుతుంది

విశ్వ మిత్రమా విశ్వ లోకాన్ని

విశ్వ మిత్రమా విశ్వ లోకాన్ని చూపించవా విశ్వ రూపాల దిక్కులను తెలుపవా
నాకు కావలసిన విశ్వ విజ్ఞానం విశ్వంలో ఏ లోకాన ఏ దిక్కున కలుగును
నా అన్వేషణను ఏ లోకంలో సాగిస్తే నా మేధస్సుకు విశ్వ విజ్ఞానం చేరును
విశ్వ రూపాల విజ్ఞానం కూడా నా మేధస్సులో అద్భుతంగా నిలిచిపోవాలి

ఎన్నో వేల రకాల పక్షుల స్వరాల

ఎన్నో వేల రకాల పక్షుల స్వరాల భావాలను విశ్వ భాషలో తెలుసుకున్నా
ఎన్నో వేల రకాల జంతువుల స్వరాల భావాలను విశ్వ భాషలోనే గమనించా
ఎన్నో వేల రకాల క్రిమి కీటకాల స్వరాల భావాలను విశ్వ భాషలోనే గుర్తించా
ఎన్నో వేల రకాల సూక్ష్మ జీవుల స్వరాల భావాలను విశ్వ భాషలోనే గ్రహించా
ఎన్నో వేల రకాల జల జీవుల స్వరాల భావాలను విశ్వ భాషలోనే ఏకీభవించా
ప్రతి జీవి భావ స్వభావాలను విశ్వ భాషతోనే తమ స్వరాలలోనే పలికించుకున్నా
జగతిలో ప్రతి రూప భావ స్వభావాల తత్వాలలోనే విశ్వ భాషతో జీవిస్తున్నా

విశ్వమున ఏకమై విశ్వ

విశ్వమున ఏకమై విశ్వ చైతన్యంతో జీవించు నేస్తమా
విశ్వ చైతన్యమే జీవిత పరిజ్ఞాన ఆత్మ మోక్ష ప్రాప్తము
ఆత్మ జ్ఞానంచే విశ్వ విజ్ఞాన భావాలను తెలుసుకో
విశ్వ భావాల స్వభావాలలో నిమగ్నమై ఆత్మ జ్ఞానంతో చైతన్యమైపో

విశ్వాన్ని ఇంకా ఎలా మార్చుదాం

విశ్వాన్ని ఇంకా ఎలా మార్చుదాం ఎలా మార్చుకుందాం
ప్రస్తుతం ఉన్న విధానాలలో ఏ ఏ మార్పులు జరగాలి
అజ్ఞానంగా అశుభ్రత గా ఉన్న వాటిని తొలగించుకుందాం
బలహీనత్వాన్ని అనారోగ్యాన్ని సామర్థ్యంతో ఎదుర్కొందాం
ప్రస్తుతం ఉన్న జ్ఞానం కన్నా విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకుందాం
విశ్వ విజ్ఞానంతో చైతన్యవంతంగా జీవించేందుకు శ్రమిద్దాం
వివిధ సమస్యలకు తగిన కారణ పరిష్కారాలను ఆలోచిద్దాం
విశ్వాన్ని మార్చుకుందాం అందరూ మారేందుకు వీలు కల్పిద్దాం
సమాజాన్ని గొప్పగా మార్చి మన శక్తి సామర్థ్యాలను చాటుకుందాం
విశ్వానికి మానవులే మహా విజ్ఞానులని తెలుపుకుందాం

ఆత్మ జ్ఞానంతో జీవించాలని ఆత్మ

ఆత్మ జ్ఞానంతో జీవించాలని ఆత్మ శ్వాసతో జన్మించా
శ్వాసతోనే ధ్యాస కలుగుతుందని ధ్యాసలోనే భావన ఉదయిస్తుంది
ధ్యాసలో ఉన్న భావనయే మనస్సుతో అన్వేషిస్తుందని తెలుసుకున్నా
మనస్సును ధ్యాసతో ఎన్నో భావాలను గమనిస్తూ అర్థాలను గమనిస్తున్నా
గమనార్థంలో ఎకాగ్రతకై శ్వాసపై ధ్యాస ఉంచి శూన్యార్థాన్ని గ్రహించా
శూన్యార్థంతో ఆత్మ జ్ఞానం కలిగి భావనగా విశ్వ భావాలతో అన్వేషిస్తున్నా
విశ్వ భావ స్వభావాలతో విశ్వ స్థితిని ఆత్మ స్థితిలో శ్వాసతో పొందుతున్నా

ఓ విశ్వ విజ్ఞాని నీ విశ్వ కార్యాలను

ఓ విశ్వ విజ్ఞాని నీ విశ్వ కార్యాలను ఈ లోకంలోనే తెలుసుకో
మరో లోకంలో తెలుసుకున్నవి ఈ లోకంలో గుర్తుండవేమో
ఈ లోకంలోనే నీ విశ్వ కార్యాలను తెలుసుకొని ఇక సాగించు
నీకు ఏ విశ్వ కార్యాలు తెలియకపోతే ఆత్మ జ్ఞానాన్ని అన్వేషించు
ఆత్మ జ్ఞానంతో నీ విశ్వ కార్యాలు ఏవో నీకు తెలుస్తాయి
నీ విశ్వ కార్యాలకు సమయం చాలకపోవచ్చు నేడే సాగించు

స్వర్గంలో కూడా ఆహార నిద్రలే ఐతే

స్వర్గంలో కూడా ఆహార నిద్రలే ఐతే జీవితం విచారకరమేమో
ఆహార నిద్రలకే సమయం చాలక సమయాన్ని వెచ్చించి జీవిస్తున్నారు
స్వర్గంలో కూడా సమయం చాలకపోతే విజ్ఞానాన్ని ఎప్పుడు ఎలా తెలుసుకునేది
స్వర్గం విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకునే దీవిగా దివ్య భావాలతో జీవించేలా ఉండాలి

మరణించి ఏ లోకాన్ని చేరుతావో

మరణించి ఏ లోకాన్ని చేరుతావో తెలుసుకున్నావా
నీ మరణం కర్మ విముక్తి కాకపోతే మరలా ఈ లోకంలోనే జన్మిస్తావులే
కర్మ నశించి శూన్యమైతేగాని మరో దివ్య జ్ఞాన లోకానికి వెళ్ళలేవులే
కర్మను తొలగించుకునేందుకు కావాలి మహా విజ్ఞాన ఆత్మ జ్ఞాన సాధన
నీ శ్వాస గమనంలోనే ఉన్నది ఆత్మ జ్ఞాన విజ్ఞాన కర్మ విముక్తి ప్రాప్త మోక్షం

ఆనాడే తెలిపాను ఆనాటి భావన

ఆనాడే తెలిపాను ఆనాటి భావన విజ్ఞానాన్ని గమనించి గుర్తు చేసుకో ఓ సారి
ప్రస్తుతం నేడు తెలుపుతున్నది ఆనాడే నీవు జీవించిన విధానంలోనే ఉన్నది
గత జన్మలో భావన విజ్ఞానమే నేడు అదే భావన ప్రస్తుతం ఆలోచనగా మారినది
ఆలోచన విజ్ఞానంతో భావాల అర్థాలు సంపూర్ణంగా తెలియక ఎన్నో సమస్యలు
ఆత్మ భావాలను గుర్తించలేని విధంగా నేటి ఆలోచనలు తారుమారవుతున్నాయి
నీ భావాలను నీవు గమనిస్తే అన్నీ నీకే గుర్తుగా తెలిసినట్లుగా తోస్తాయి
తెలిసిన వాటినే నేడు తెలియనట్లుగా ఆలోచిస్తూ ఎన్నో పొరపాట్లు చేస్తున్నాము

కరుణించు కరుణ మూర్తివై కరుణతో

కరుణించు కరుణ మూర్తివై కరుణతో జీవించు విశ్వ భావమై
విశ్వ భావాలు లేక జీవులలో కరుణ గుణాలు తరిగిపోతున్నాయి
మహాత్ములు లేక మహర్షులు లేక దయా కరుణ తత్వాలు తెలియుట లేదు
విశ్వ భావాలు లేని ఆత్మ జీవులలో కరుణ ప్రభావాలు కలిగేలా కాలమే తెలపాలి
ప్రతి ఆత్మ తత్వాలలో కరుణ భావాలు ఉద్భవిస్తే విశ్వమంతా కరుణామృతమే
నీవు ఒక మహాత్ముడిలా కరుణా మూర్తిలా ఆత్మగా విశ్వ భావాలతో జీవించు

ఎన్ని విధాలైనా ఎన్ని రకాలైనా

ఎన్ని విధాలైనా ఎన్ని రకాలైనా నా మేధస్సులోని భావ స్వభావాలే
మనిషిలో కలిగే ఎన్నో ఆలోచనలలో ఎన్నో భావ స్వభావాలుంటాయి
ఒక ఆలోచనలో కూడా ఎన్నో భావ స్వభావ అర్థాలు దాగి ఉంటాయి
ఒక ఆలోచన ఒక్కొక్క మేధస్సులో ఒక్కొక్క అర్థాన్ని ఇవ్వగలదు
ఏ ఆలోచన ఏ అర్థాన్ని కలిగించినా విజ్ఞాన భావనతో స్వీకరించండి
ప్రతి ఆలోచన ఓ విజ్ఞాన కార్యానికే ఉపయోగపడాలని నా స్వభావం
నా మేధస్సులో ఉన్న భావాలు దాదాపుగా విజ్ఞాన అర్థాన్ని కలిగించేవే
అనంతమైన భావ స్వభావాలను ఎన్నో విధాల విశ్వ విజ్ఞానంగానే గ్రహిస్తున్నా

నా భావాలతో విశ్వమే చలిస్తుందని

నా భావాలతో విశ్వమే చలిస్తుందని సూర్య చంద్ర నక్షత్రాలే ఆకాశంలో
విశ్వం చలించే భావ స్వభావాలు నా ఆత్మ స్థితిలో అనేకమై ఉన్నాయి
విశ్వ స్థితి కూడా నా ఆత్మ తత్వాలలో ప్రకృతి భావమై శ్వాసగా జీవిస్తున్నది
ప్రతి క్షణం నాలో విశ్వ రూపాలు వివిధ తత్వాల భ్రమణంతో అన్వేషిస్తూ ఉన్నాయి
విశ్వ ప్రదేశపు అంతరిక్షమున విశ్వ రూపాల భ్రమణం నా మేధస్సులో ఉన్నట్లుగానే
నేను తిలకించే ఆకాశం నా మేధస్సులో నిక్షిప్తమై ప్రతి విశ్వ రూపం నాలో చేరింది
నేను విశ్వమై నాలోనే విశ్వం ఉన్నట్లు సూర్య చంద్ర నక్షత్రాలు నా భావ స్వభావాలే

మరువకు నా విశ్వ విజ్ఞాన ఆలోచన

మరువకు నా విశ్వ విజ్ఞాన ఆలోచన భావాన్ని
నీకు సద్గుణ తత్వాన్ని కలిగించేది నా విశ్వ భావాలోచనయే
నీ శ్వాసనే నీవు గమనించావా నిన్ను నీవే తెలుసుకోలేవా
నీ చలనంలోనే ఉన్నాయి విశ్వ విజ్ఞాన ఆత్మ తత్వాలు
నీ తత్వాలను నీవే గమనిస్తూ నీ ఆలోచనలను మార్చుకోవా
విశ్వ విజ్ఞానం నీకోసమే నీ మేధస్సులో ఆత్మ జ్ఞానం కోసమే
మరువకు నా ఆలోచనను విశ్వ విజ్ఞాన భావనగా నీలోనే

కలగాలి నీలో ఓ భావన అది విశ్వ

కలగాలి నీలో ఓ భావన అది విశ్వ విజ్ఞాన ఆలోచనతోనే సాగాలి
నీలో ఏకాగ్రత ఆలోచనలు సాగుతున్నప్పుడు ఓ దివ్య భావన కలుగుతుంది
ఆ దివ్య భావనతోనే నీవు జీవించాలని నీ ఆత్మ తత్వం తెలుపుతుంది
ఆత్మ తత్వాలు నిన్ను ఆత్మ జ్ఞానంగా మార్చ గలిగితే నీలో శ్వాస గమనమే
నీ శ్వాసను గమనించుటలో నీ ఆలోచనలలో విశ్వ విజ్ఞానం తెలుస్తుంది

జీవించు ఓ సారి విశ్వ విజ్ఞానిగా మరల

జీవించు ఓ సారి విశ్వ విజ్ఞానిగా మరల రాదు ఏ జన్మకు ఈ ఆలోచన భావము
మహర్షులకే తెలిసిన విజ్ఞాన భావాలు మానవ మేధస్సుకు అర్థం కాలేకపోతాయా
నేటి సాంకేతిక విజ్ఞానం కన్నా మహర్షుల ఆత్మ తత్వాల విశ్వ విజ్ఞానం కష్టమైనదా
ఓ సారి తెలుసుకుంటే విశ్వ విజ్ఞానంతో అంతా తెలిసినట్లే ఉంటుంది కదా జీవితం
మరల రాదేమో ఈ ఆలోచన ఏ జన్మకు నేడే సాగించాలి ఈ విశ్వ విజ్ఞాన అన్వేషణ
విశ్వ విజ్ఞాన అన్వేషణకై నా శ్వాసను గమనిస్తున్నా ఓ మహాత్ముని దివ్య భావనతో

విశ్వమై ఆలోచించు విశ్వ భావమే నీలో

విశ్వమై ఆలోచించు విశ్వ భావమే నీలో కలుగును
విశ్వమే నీవు కావాలని ఆలోచిస్తే విశ్వ భావన నీలో కలుగుతుంది
విశ్వమే నీవు కావాలంటే విశ్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి
విశ్వాన్ని ఆత్మ భావాలతో తిలకిస్తూ స్వభావ తత్వాలను తెలుసుకోవాలి
ఆత్మ భావాలలో విశ్వ స్వభావాలు ఆలోచనాలుగా వస్తూనే ఉంటాయి
ఆలోచనలను గమనించుటలో విశ్వ స్వభావాలు నీలో ఏర్పడితే
నీవే విశ్వమై విశ్వ భావాలతో జీవిస్తావు నీలోనే విశ్వం ఉండిపోతుంది

విశ్వానికి ఆలోచన నేనే విశ్వ జీవుల

విశ్వానికి ఆలోచన నేనే విశ్వ జీవుల మేధస్సులలో చలన భావాన్ని నేనే
నాలోనూ విశ్వ స్వభావాలు ఉన్నాయి నా ఆత్మలో విశ్వ తత్వాలున్నాయి
నేను విశ్వంలా ఆలోచిస్తాను విశ్వం లాగే భావ స్వభావాలతో జీవిస్తాను
నేను ప్రతి జీవి ఆత్మ తత్వాలను భావ స్వభావాలను గమనిస్తాను
అంతరిక్షపు విశ్వ రూపాల అణువుల చలనాన్ని గమనిస్తూ గ్రహిస్తున్నాను
నా మేధస్సు అన్వేషణ విశ్వపు అంచుల దాక ఆలోచనలుగా సాగుతుంటాయి
ప్రతి కదలికను గుర్తిస్తూ ప్రతి కదలిక గమన స్థితిని మేధస్సున గ్రహిస్తూ ఉంటాను
మీరు కూడా విశ్వ స్థితిని తెలుసుకుంటే విశ్వ జీవుల చలనం మీలో కలుగుతుంది

నేను తాకిన నేలపై ఎన్నో విశ్వ కార్యాలు

నేను తాకిన నేలపై ఎన్నో విశ్వ కార్యాలు సాగుతున్నాయి
ఆనాటి నుండి ప్రస్తుతం వరకు ఇలాగే భవిష్యత్ కు సాగుతాయి
విశ్వ కార్యాలలో ఎన్నో విధాల ఎన్నో ప్రభావాలు కలుగుతున్నాయి
విజ్ఞాన కార్యాలు అద్భుతాలు ఉన్నా మరో వైపు అజ్ఞాన ప్రమాదాలెన్నో
ఏ కార్యమైనా జీవుల జీవితాల తపనలో మంచి చెడులు సాగుతున్నాయి

విశ్వమై జీవించు విశ్వ భావాలే

విశ్వమై జీవించు విశ్వ భావాలే మేధస్సులో దివ్య స్వభావాలై జీవిస్తాయి
మేధస్సులో కలిగే భావాలను విశ్వ తత్వాలతో గమనిస్తే భావాల స్వభావాలు తెలుస్తాయి
భావాల స్వభావాలలోనే విశ్వార్థము ఉన్నదని విశ్వ రూపాలను గమనించుటలో తోచును
విశ్వ భావాలతో విశ్వాన్ని గమనిస్తూ ఉంటే విశ్వం లాగే మనం జీవిస్తామని విశ్వ భావన
విశ్వ భావాలతో విశ్వమై జీవించు విశ్వ స్వభావాలతో మేధస్సు జీవిస్తుంది

విశ్వ భావాలకు స్పూర్తి మేధస్సులోని

విశ్వ భావాలకు స్పూర్తి మేధస్సులోని విశ్వ ప్రకృతి విచక్షణ కణ గుణాలే
నీలో దివ్య గుణాలు ఉంటే మేధస్సులో విశ్వ తత్వ భావాలు ఉద్భవిస్తాయి
నీవు ధ్యానించుటలోనే మహా విచక్షణ కణాలు విశ్వ భావాలను గ్రహిస్తాయి
విశ్వ భావాలకై మేధస్సు తపిస్తూ విశ్వాన్ని విజ్ఞానంగా అన్వేషించుటలో
విశ్వ ప్రకృతి స్వభావాలు మేధస్సులోని విచక్షణ కణాలలో చేరిపోతాయి

ఏ కార్యాన్నైనా ముందస్తు ఆలోచనతో

ఏ కార్యాన్నైనా ముందస్తు ఆలోచనతో విశ్వ విజ్ఞానంగా ప్రారంభించు
కాలం ఎప్పుడూ ఏదో ఒక దానిని మరచిపోయేలా చేస్తుంటుంది
కొన్ని సందర్భాలలో పొరపాట్లు కలిగేలా కాలం వెంటాడుతూ ఉంటుంది
మరచిపోయినదే ముఖ్య ఆవశ్యకమై కార్యం ఆలస్యమవుతుంది
కార్య ప్రణాళికను ముందుగానే వ్రాసుకొని అలాగే జరిగేలా క్షుణ్ణంగా ఆలోచించండి
ఏ సమయానికి అది జరిగేలా కార్యం పైననే ఏకాగ్రత వహించాలి
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏం మరచిపోతామో గమనించలేము
అన్నింటిని అన్ని వేళలో జ్ఞాపకంగా గుర్తు చూసుకుంటూ సాగండి
చేసిన పని లేదా పూర్తైన పనిని మళ్ళీ గమనించండి మరచినవి తెలుస్తాయి
పూర్తైన పనిని మళ్ళీ గమనించక పోవడం మేధస్సుకున్న అలవాటు
మహా కార్యాలను ముందస్తు ఆలోచనలతో క్రమ కార్య క్రమముగా చేయండి
అనుభవంతో కార్యాన్ని సాగిస్తూ కాల పరిస్థితులను గమనించడం అవసరమే

ఏ యుగానికి ఆ యుగంలోనే

ఏ యుగానికి ఆ యుగంలోనే అవతరించాను భావన మూర్తిగా
ఇంకా నాలో చేరే భావాలు ఎన్నో మిగిలిపోయినందుకే జన్మిస్తున్నా
ఎన్నో యుగాలుగా ఎన్నో జీవ రకాలుగా జన్మిస్తున్నా భావాలు మిగేలేను
ప్రతి భావన నాలో చేరేందుకు ప్రతి యుగంలో అవతరిస్తాను ఒక జీవిగా
వీలయితే భావనకై ప్రతి జీవిలో నేనే ఆత్మగా ప్రవేశించి జన్మిస్తాను

ఆనాటి యుగానికి తెలిపాను ఓ భావన

ఆనాటి యుగానికి తెలిపాను ఓ భావన
మరో యుగానికి తెలిపాను మరో భావన
ప్రతి యుగానికి ఓ భావనను తెలుపుతూనే ఉన్నా
ఒక యుగానికి ఓ భావన చాలు యుగమంతా సాగుతుంది
నా జీవితానికి ఓ భావన ఓ యుగంతో సమానమే
నా భావన విశ్వ భావ స్వభావ తత్వాలలో ఒకటిగా ఉంటుంది

విశ్వ భావన కోసమే విశ్వ విజ్ఞాన

విశ్వ భావన కోసమే విశ్వ విజ్ఞాన ఆలోచనలు కలుగుతాయి
విశ్వ భావన ఉన్నపుడు ఆలోచనలు కొత్త దానిని అన్వేషిస్తాయి
అంతా తెలిసినప్పుడు మేధస్సు ఆకాశ ప్రకృతిని గమనిస్తుంది
ప్రకృతిని గమనించుటలో దివ్య స్వభావాలు కలుగుతాయి
స్వభావాలతో విశ్వ గమనం మహా అన్వేషణగా మారుతుంది
అన్వేషణ ధృడ మైనప్పుడు విశ్వ విజ్ఞాన ఆలోచనలు కలుగుతాయి
విశ్వ విజ్ఞాన ఆలోచనలతో విశ్వ తత్వాలను కూడా గ్రహించవచ్చు
విశ్వ తత్వాలతో ఆత్మ యోగ స్థితిని విశ్వ స్థితిగా మార్చుకోవచ్చు

సూర్య తేజస్సును దర్శించాలనే

సూర్య తేజస్సును దర్శించాలనే నా మేధస్సులో ఓ దివ్యమైన ఆలోచన మేల్కొన్నది
సూర్యోదయానికి ముందే నా మేధస్సులో దివ్య భావనతో మహా ఆలోచన మేల్కొంటుంది
సూర్య తేజస్సుతో కలిగే ఆలోచన మహా విశ్వ విజ్ఞానముతో దివ్య స్వభావాలను కలిగి ఉంటుంది
సూర్య తేజస్సు మేధస్సును ఉత్తేజ పరిచి మహా విజ్ఞాన ఆలోచనలను కలుగజేస్తుంది
సూర్యునిలో నిమగ్నమైన వారికి అజ్ఞానం అంటని రీతిగా మేధస్సులో విజ్ఞానమే చేరుతుంది

సర్వ జనులు సుఖ సంతోషాలతో

సర్వ జనులు సుఖ సంతోషాలతో జీవించాలనే విశ్వ విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నా
మీ సుఖ సంతోషాల కోసమే విశ్వ తత్వ భావ స్వభావాలను గమనిస్తూనే ఉన్నా
ప్రతి జీవిలో ఆత్మ యోగత్వ జీవ చైతన్యం ఉన్నా సంతోష భావాలు కలుగుట లేదు
ప్రతి ఒక్కరిలో అజ్ఞాన విజ్ఞాన అన్వేషణ భావాలు ఉన్నందున విశ్వ విజ్ఞానం తెలియుట లేదు
విశ్వ విజ్ఞానం అందరిలో కలిగినప్పుడే విశ్వ చైతన్యం సుఖ సంతోషాలతో సాగుతుంది

కలం ఉంటేనే కొన్ని కార్యాలు

కలం ఉంటేనే కొన్ని కార్యాలు సాగుతాయి కలం లేకపోతే కొన్ని కార్యాలు నిలిచిపోతాయి
కలం లేకుండా సాగిన కొన్ని కార్యాలు సంపూర్ణంగా సాగలేక ఎక్కువ కాలంతో గడిచాయి
అనుకున్న సమయానికి అనుకున్నవన్నీ జరగాలంటే అన్నీ వ్రాసుకొని చూసుకోవలసిందే
వ్రాసుకోలేదంటే ఏవో కొన్ని మరచిపోయి మరలా కొన్ని పనులకై ప్రయాణించవలసి వస్తుంది
కొన్ని సమయాలలో చేసిన పనులనే మళ్ళీ మళ్ళీ చేయవలసి కాలం వృధా అవుతుంది
కార్యం ముగిసిన తర్వాత బయలు దేరేముందు వ్రాసిన కార్యాలను చూసుకోవాలి లేదంటే
ఏ కార్యాలను మరచిపోయామో తెలియక మళ్ళీ వాటికై కాలాన్ని వృధా చేస్తూ అదే పనిలో

నా మేధస్సులో విశ్వ రూపాలను

నా మేధస్సులో విశ్వ రూపాలను దాచుకున్నా మరల ఓ రూపాన్ని మళ్ళీ మళ్ళీ దర్శించాలనే
దర్శించుటలో సూర్య కిరణ తేజస్సు రూపంలో నక్షత్ర కాంతి స్వభావంలో అమృత దివ్యత్వము
వర్ణములో సువర్ణము భావనలో అభ్యుదయం కాలంతో చైతన్యము జీవనం జీవిత సౌభాగ్యము
కాల భావాలకు స్పూర్తి నిచ్చే మహా ఉత్తేజ తేజస్సుతో మేధస్సును సాగించే రూప తత్వమదే

నూతన సంవత్సరం మొదలైనా

నూతన సంవత్సరం మొదలైనా కాలం ఒక్కటే తేది మాత్రమే మారుతున్నది
విశ్వ విధానం అలాగే ఆనాటి సూర్య చంద్రులతో సాగే జీవన భావ స్వభావమే
రోజులు ఒకేలా ఒకే కాల వ్యవధి సమయంతో విశ్వ గమన భ్రమణం సాగుతున్నది
చంద్రునిలో మార్పు ఉన్నదేమో గాని సూర్యునిలో మార్పు లేదు అలాగే జీవితం
మనలో మార్పు ఉంటుందేమో గాని విశ్వ విజ్ఞానంలో ఏనాడు మార్పు ఉండదు
మన జీవితం హాయిగా ఉండాలనే మనం ఇతరత్ర భావ స్వభావాలతో సాగిపోతాం
కాలం ఒక్కటే మన జీవిత కార్య క్రమాల భోగ భాగ్యాలు ఎన్నో విధాల సాగుతాయి
కాలానికి కొత్త దనం సూర్యోదయమే ప్రతి రోజు కొత్త భావాలతో విశ్వం సాగిపోవాలనే
జీవితంలో ఎన్నో సాధించాలనే వారికే ఎన్నో కొత్త భావాలు ఎల్లప్పుడూ కలుగుతాయి
కాలం వృధా చేయని వారికి ఏ రోజైనా ఏ సమయమైనా ఎక్కడైనా ఒకేలా ఉంటుంది

కర్మ తత్వాలను మరచిపోయేందుకే

కర్మ తత్వాలను మరచిపోయేందుకే విజ్ఞానంగా ఆలోచించాలి
అజ్ఞానాన్ని మరచిపోతే కర్మ తత్వాలు వాటికవే తొలగిపోతాయి
విశ్వ విజ్ఞానాన్ని ఆలోచిస్తే కర్మ శాస్వితంగా నశించిపోతుంది
యోగత్వ ఆత్మ భావాలతో జీవిస్తే కర్మ శూన్యమవుతుంది
విజ్ఞానంలోనే ఉన్నాయి సద్గుణ దివ్య భావ విశ్వ తత్వాలు

మరో యుగం మొదలయ్యే వరకు

మరో యుగం మొదలయ్యే వరకు నా భావాలు సాగుతూనే ఉంటాయి
నా భావాలు ఎవరికీ తెలియకుండా పోవాలంటే మరో యుగం ఆరంభమే
విశ్వ స్వభావాలతో విశ్వ తత్వాలతో సాగే నా భావాలు యుగాల వరకు
ఎన్ని యుగాలు సాగినా నా భావాలు సాగుతూ ఉంటాయనే నా విశ్వాసం
విజ్ఞానులు సాగే వరకు నా భావాలు సాగుతూ యుగాలు గడిచి పోతాయి
ఎవరికీ తెలియని నా భావాలు సాగుతున్నప్పుడే మరో యుగం ఆరంభం

నా భావాలకు మంచి కాలం వచ్చిందిలే

నా భావాలకు మంచి కాలం వచ్చిందిలే
నా భావాలతో ఎందరో జీవిస్తున్నారులే
ఎవరిని చూసినా నా భావాలే గుర్తుకొస్తున్నాయి
ఎక్కడికి వెళ్ళినా నా భావ స్వభావాలే కనిపిస్తున్నాయి
ఎవరు తెలిపినా నా భావాలే నా విజ్ఞానమే తెలుస్తున్నది
నా విజ్ఞాన భావాలే సాగుతుంటే మంచి కాలం వచ్చిందనే

భావన స్వభావాన్ని మేధస్సున

భావన స్వభావాన్ని మేధస్సున అన్వేషించగా తెలిసిందే ఆనాటి శూన్యము
క్షణముతో ఆనాటి గతమున ప్రయాణించగా యుగాలతో విశ్వాన్ని దాటివెళ్లాను
విశ్వాన్ని కన్నా ముందుగా ఏదో మర్మమని అన్వేషించగా తెలిసిందే శూన్యం
నా మేధస్సులో దశాబ్ధాల అన్వేషణ సాగినందుకే తెలిసిందే ఆనాటి శూన్య మర్మం

ఇది మేధస్సులో కలిగే ఆలోచన కానే

ఇది మేధస్సులో కలిగే ఆలోచన కానే కాదు
విశ్వ మర్మములో దాగిన రహస్య భావనయే
భావనాలోచనయే విశ్వ విజ్ఞాన రహస్య మర్మం
మర్మములో కలిగిన ఆలోచనగా నా మేధస్సులో ఈ భావన

2010 లో ఏమి జరిగింది 2011 లో

2010 లో ఏమి జరిగింది 2011 లో ఏమి జరగబోతుంది
ఏ సంవత్సరం ఏమి జరగబోతుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలియని భావం
జ్యోతిష్యం ఎలా ఉంటుందోనని కొందరికి ఉబలాటం తెలిసిన తర్వాత నిజ జీవితం
ఏ సంవత్సరమైనా ఏ జీవి ఐనా శ్రమించడం ఆలోచిస్తూ సాగడం ఖచ్చితమే
కొన్ని అవకాశాలు లాభంగా కొన్ని అవకాశాలు నష్టంగా ఆరోగ్య అనారోగ్యాలుగానే
కాలం ఎలా సాగుతున్నా ముందస్తు ఆలోచనతో చాల జాగ్రత్తగా జీవించాలి
ఆతృత అధిక ఆశలు ఉంటే ఎక్కడో ఎన్నో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి
ఏ సంవత్సరంలో ప్రకృతి ప్రభావాలు కాల ప్రభావాలు ఎలా ఉన్నాయో గమనించండి
మన జీవితాన్ని విశ్వ విజ్ఞానంగా సాగిద్దాం ప్రకృతి కాల ప్రభావాలను శాంతి పరుచుదాం
గత సంవత్సరాలను అనుభవ విజ్ఞానంగా తీసుకొని వచ్చే సంవత్సరంలో ఏ చేయాలో
మహా గొప్ప ప్రణాళికతో భవిష్యాన్ని సుఖ సంతోషాలతో సాగించేందుకు ప్రయత్నిద్దాం

Thursday, December 30, 2010

నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు

నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు
ప్రతి సంవత్సరం నూతన భావాలతో సాగిపోవాలనే ప్రతి ఒక్కరిలో కలిగే ఆశలెన్నో
సూర్యుడు ఉదయిస్తున్నట్లు మానవుడు ఉదయించాలని ఎన్నో సార్లు అనుకోవడమే
జీవితం విఫలం కావడంతో నిరాశ చెందుతూ జీవిస్తున్నప్పుడు మళ్ళీ కొత్త భావాలు కలగాలి
సూర్యోదయంతో కలగక పోయినా నూతన సంవత్సరంతో కొత్త భావాలు కలగాలనే చిన్న ఆశ
నూతన భావాలే మహా గొప్ప విజయాలకు స్పూర్తినిస్తాయి అలాగే మేధస్సును స్పందిస్తాయి
జీవితం ఎలా సాగుతున్నా మీ భావాలు సూర్యునిలా ఎల్లప్పుడూ సాగాలని నా సూర్య తేజస్సులు

తల్లి శ్వాసలో గమనమై నిత్యం జీవమై

తల్లి శ్వాసలో గమనమై నిత్యం జీవమై నా ఆయుస్సుతో జీవించాలని
దేహంలో దైవమే శ్వాసగా ప్రతి నిత్యం పరమాత్మయే ఆత్మానంద జీవిగా
మేధస్సులో ఓ దివ్య ఆలోచన మహా గంగా ప్రవాహంగా శ్వాసే విశ్వంగా
విశ్వంలో జీవించే శ్వాసే జీవంగా జీవికి రూపాన్నిచ్చే నా తల్లే నాకు సజీవంగా

సదా శివ కైలాస వాసా శివ రుద్రాయ

సదా శివ కైలాస వాసా శివ రుద్రాయ వ్యాసా
స్వరములో విష వాసా శిరస్సులో విశ్వ వ్యాసా
దేహంలో ద్వేష వాసా నేత్రాన భాష్మాసుర వ్యాసా
విశ్వానికే ధ్యాన వాసా మౌనంలో నమో శివ వ్యాసా

కోటి యుగాలైనా కోట్ల భావాలైనా

కోటి యుగాలైనా కోట్ల భావాలైనా నా విశ్వ భాషలో ఉన్నాయి
విశ్వ భావాలైనా రూప స్వభావాలైనా నా విశ్వ మేధస్సులోనే
అమృతమైనా హాలాహలమైనా త్రాగే స్వర నాళ భావన ఒక్కటే
మంచి చెడులైనా అజ్ఞాన విజ్ఞాన భావాలు కలిగేది మేధస్సుననే

కర్మతో శరీరాన్ని కాల్చుకున్నా

కర్మతో శరీరాన్ని కాల్చుకున్నా స్మశానంలో చోటు లేదే
కర్మతో బయలు దేరినా విశ్వంలో మహా కార్యాలు సాగవే
కర్మ భావనను మెచ్చే గుణం లోకాన ఏ మేధస్సుకు లేదే
కర్మను తొలగించే రాత సృష్టిలో ఏ మహాత్మకు లేనే లేదే

కర్మతో ఓడిపోతేనేమి కర్మ సిద్ధాంతము

కర్మతో ఓడిపోతేనేమి కర్మ సిద్ధాంతము నాదే
ప్రతి కార్యం విఫలమైనా విశ్వ కర్మ నా భావమే
దుఃఖంలో జీవించినా కర్మ విజ్ఞానం నాదే
మేధస్సే కర్మ తత్వమైతే కాలిపోయినా నేనే

ఏమని వర్ణించెదను నా విశ్వ

ఏమని వర్ణించెదను నా విశ్వ విజ్ఞానాన్ని ఏమని సత్కరించెదను
మేధస్సుకే ఎలా అనిపించే భావనలు విశ్వానికి ఏమని తెలియును
విజ్ఞానాన్ని సత్కరించేందుకు విశ్వ రూపాన్ని ఏమని వర్ణించెదను
విశ్వ భాషలో తెలిసే వర్ణ భావాలను మేధస్సుకే విజ్ఞానపరిచెదను

విశ్వ భీజం మాతృ పరిపూర్ణం

విశ్వ భీజం మాతృ పరిపూర్ణం
విశ్వ కణం జీవ పరి పక్వతం
లింగత్వం విశ్వ కణ సంయోగం
జీవితం జీవన సమ్మేళనం

Wednesday, December 29, 2010

యదా తత్వ అమృతాయచా

యదా తత్వ అమృతాయచా
విశ్వ మాతా కరుణాయచా
జీవ స్వభావ లోకాయచా
విజ్ఞాన భావ పరిపూర్ణాయచా
దైవత్వం తల్లి రూపేనాయచా

కొన్ని దశాబ్ధాలు వెనుక వున్నా

కొన్ని దశాబ్ధాలు వెనుక వున్నా కొన్ని దశాబ్ధాలకు ముందస్తుగా ఉన్నా
ఆలోచనలు ఆనాటివైనా కార్యాలు ఈనాటి ముందస్తుకు సాగుతున్నాయి
విజ్ఞానం ఎంతటిదైనా విశ్వ భావాలు ఆనాటివే ప్రస్తుత కార్యాలు భవిష్యత్ కే
యుగాలుగా కాలం గడిచినా ఆనాటి నుండే నేను విజ్ఞానాన్ని తరలిస్తున్నా

నీలో వివేకానంద ఉన్నాడా పరమహంస

నీలో వివేకానంద ఉన్నాడా పరమ హంస ఉన్నాడా ఠాగూర్ ఉన్నాడా
గాంధి మదర్ తెరెసాల భావాలు నీలో ఉన్నాయా ఏనాడైనా కలిగాయా
ఎవరి విజ్ఞానం నీలో ఉంది ఎవరి విజ్ఞానంతో నీవు గొప్పగా జీవిస్తున్నావు
ఏ కార్యాలను సాగిస్తున్నావు నీవు ఏ విజ్ఞానంతో ఎవరిలా అవతరిస్తున్నావు
విశ్వమున నీకు స్పూర్తి ఎవరు ఏ విజ్ఞానం నీ మేధస్సును మెప్పించినది

నేను ఆలోచించుటలో విశ్వ విజ్ఞాన

నేను ఆలోచించుటలో విశ్వ విజ్ఞాన భావాలు కలుగుట నాకు సమ్మతం కాదా
నా విజ్ఞాన మేధస్సు రీతి సూక్ష్మ ప్రజ్ఞాన భావ స్వభావాలతో ఆలోచించుట లేదా
విశ్వ భాషతో అన్వేషించుట మేధస్సుకు మహా పాపమా ఆలోచనకు మహా కర్మమా
నాకు సమ్మతం లేని విశ్వ విజ్ఞాన జీవితం విశ్వమున లేక నాలోనే శూన్యమై పోవాలని

నా మేధస్సులో మీకు కావలసినవి

నా మేధస్సులో మీకు కావలసినవి ఏవైనా ఎంతటివైనా లభిస్తే తీసుకోండి
విశ్వంలో లభించేవి ఏవైనా సూర్యచంద్ర నక్షత్ర భావ స్వభావాలైన తీసుకోండి
సువర్ణ వజ్ర వైడూర్య నవ రత్నములైనా ఎంతైనా మొహమాటం లేకుండా తీసుకోండి
విశ్వ విజ్ఞాన మర్మ రహస్యాలైనా విశ్వ భాష సందేశాలైనా అన్వేషించి తీసుకోండి
విశ్వ రూపములలో ఏ రూపమైనా ఎక్కడున్నా నా మేధస్సు నుండే లభిస్తుంది
మీకు కావలసినవన్నీ ఆనాడు నేను మేధస్సులో దాచుకున్నందుకే లభిస్తున్నాయి

ఇంకొకరికి మంచి భావాలు కలగాలనే

ఇంకొకరికి మంచి భావాలు కలగాలనే మనం శుభ్రతతో జీవిస్తున్నాము
ఎవరైనా శుభ్రతతో లేకపోతే మనం వారి దగ్గరకు వెళ్లేందుకే ఇష్టపడము
ప్రతిరోజు ఎందరినో కలుసుకునే మానవ జీవితంలో శుభ్రత లేకపోతే అజ్ఞానమే
శుభ్రతగా ఉంటేనే ఒకరితో చర్చించేందుకు వీలుగా ఎన్నో కార్యాలు చేయగలం
శుభ్రత లేని జీవితాలు మేధస్సును కలచి వేస్తాయి రూప భావాలను అణిగిస్తాయి

విశ్వ విజ్ఞాన పరిషత్ లో ఎన్నో మహా

విశ్వ విజ్ఞాన పరిషత్ లో ఎన్నో మహా సమావేశాలు జరుగుతున్నాయి
సూక్ష్మ ప్రజ్ఞాన పరిశోధనల పరిశీలనాత్మక చర్చలు జరుగుతూనే ఉన్నాయి
మేధస్సును కలచి వేసే ఆలోచనలతో సమావేశాల ఉపోద్గాతాలు ఎన్నెన్నో
మేధస్సులో సరైన పరిశీలన లేకపోతే సమావేశ చర్చలు సాగుతూనే ఉంటాయి
విశ్వ విజ్ఞాన ఆలోచనలు గల భావ స్వభావాలు నా మేధస్సులో ఏవేవో ఎన్నెన్నో

నేను నిద్రించుటలో కూడా విశ్వ విజ్ఞాన

నేను నిద్రించుటలో కూడా విశ్వ విజ్ఞాన ఆత్మ అన్వేషణ చేస్తున్నా
నా ఆత్మ భావ స్వభావాలు నన్ను ఆలోచించుటలో అర్థమేమిటో
నాలో కలిగే ఆలోచనలలో విజ్ఞానం ఉందనే నేను భావిస్తున్నాను
నా ఆలోచనలలో విజ్ఞానం లేకపోతే నా మేధస్సులో శూన్యాక్షరమే

నీవు చేసే కార్యాలను ప్రతి రోజూ ఉదయం

నీవు చేసే కార్యాలను ప్రతి రోజూ ఉదయం మరియు రాత్రి విజ్ఞానంగా గమనించు
నీ కార్యాలలో అజ్ఞానం కలుగుతుంటే వాటిని ఆరోజు లేదా మరుసటి రోజు ఆలోచించు
అజ్ఞానం కలుగుతున్నప్పుడు నీ మేధస్సులో ఆలోచనల ప్రభావాలలో మరుపు ఏర్పడుతుంది
మరుపు కలిగే సమయాన్ని నీవు గుర్తించ గలిగితే నీ కార్యాలను విజ్ఞానంగా సాగించవచ్చు
కాల ప్రభావాలకు మేధస్సు ప్రభావం ఎలా ఉంటుందో విశ్వానికే ఎరుక నీ ఆలోచనలకే పరీక్ష
ప్రతి రోజు నీవు గమనించుటలో నీలో మహా ఎరుక ఏర్పడాలని కార్యాలు విజ్ఞానంగా సాగాలనే

ఎవరు ఎలా జీవిస్తేనేమి నీవు విజ్ఞానంగా

ఎవరు ఎలా జీవిస్తేనేమి నీవు విజ్ఞానంగా జీవిస్తున్నావో లేదో తెలుసుకో
నీ జీవన విధానం ప్రతి రోజు ప్రతి కార్యం ఎలా సాగుతున్నదో గమనించు
అజ్ఞాన కార్యాలు సాగుతుంటే నీకు నీవుగా నీ జీవితాన్ని విజ్ఞానపరుచు
అజ్ఞాన కార్యాలను విశ్వ విజ్ఞాన కార్యాలుగా ఎలా సాగించాలో తెలుసుకో

నా మేధస్సులో సూర్యచంద్ర నక్షత్రాలు

నా మేధస్సులో సూర్యచంద్ర నక్షత్రాలు అణువంత చీకటి లేకుండా ప్రకాశిస్తున్నాయి
అజ్ఞాన భావాలు లేక విశ్వ విజ్ఞాన భావ స్వభావాలతో విశ్వ భాషతో మెరుస్తున్నాయి
మేధస్సులో కణాలు కాంతులై మేధస్సు మహా నక్షత్రమై నా రూపం విశ్వమై మెరుస్తున్నది
నేను నేనుగా శూన్యమైతే నా రూపం విశ్వమై సూర్య చంద్ర నక్షత్రాల స్వభావాలతో జీవిస్తుంది

నా మేధస్సులో విశ్వ ప్రకృతి

నా మేధస్సులో విశ్వ ప్రకృతి జీవిస్తున్నది
నా శ్వాసలో విశ్వ ఆయుర్వేదాలు జీవిస్తున్నాయి
నా తల్లి ఆరోగ్యానికి నాలోని ప్రకృతి శ్వాస తనలో చేరుతున్నది
నా శ్వాస గమనమే నా తల్లికి ఆయుస్సుగా విశ్వ ప్రకృతితో జీవిస్తుంది

సూర్యుని నుదిటి రాతను మేఘాల

సూర్యుని నుదిటి రాతను మేఘాల భావాలతో నేను దర్శించాను
సూర్యుని జీవిత జాతక భావాలు నా మేధస్సులో చేరిపోయాయి
సూర్యునితో నేను ఏకీభవించి సూర్యునివలే మేఘాలతో జీవిస్తున్నాను
నా నుదుటి రాతను సూర్యుని రాతగా భావిస్తూ విశ్వమున ఉదయిస్తున్నా

వర్ణములో సువర్ణము లేక గుణములో

వర్ణములో సువర్ణము లేక గుణములో సుగుణము లేక గంధములో సుగంధము లేక
ఆలోచనలో సులోచన లేక జ్ఞానంలో సువిజ్ఞానం లేక మిత్రులలో సుమిత్రుడు లేక
జాతకంలో సుజాతకం లేక కుమార్తె కుమారులలో సుకుమార సుకుమారి లేక
ఉన్న జ్ఞానాన్నే విజ్ఞానంగా భావిస్తూ సువర్ణము లేని గుణ వర్ణాలతోనే జీవిస్తున్నాము

నేడు ఆకాశంలో సువర్ణ మేఘాల

నేడు ఆకాశంలో సువర్ణ మేఘాల అస్థికములను చూసి మెరిసిపోయాను
ఆనాడు చేపల అస్థికములను మానవ అస్థికములను ఎన్నో చూసాను
ఆకాశాన ఎన్నో అపూర్వ మైన మానవ జంతు కళేభరాలను దర్శించాను
ఆకాశ చర్మ రూపాన్ని మేఘాలుగా చూసి తరించిపోయాను ఏనాడో

నేడు సూర్య తిలకాన్ని చూసి ప్రతి రోజు

నేడు సూర్య తిలకాన్ని చూసి ప్రతి రోజు సూర్యోదయ సూర్యాస్తాములను మేధస్సులో దర్శిస్తున్నా
ఎర్రదనంతో అత్యంత వ్యాసార్ధంతో కనిపించే సూర్య భగవానుడు నా నేత్రాలకు విశ్వ తిలకముగానే
ప్రతి రోజు సూర్యున్ని దర్శించుటచే సూర్యో దయ కిరణాలు నా నుదిటిపై తిలకాన్ని పెడుతున్నాయి
విశ్వ తిలకాన్ని నేను దర్శించిన తర్వాతనే సూర్య కిరణాలు విశ్వ రూపాలను తాకుతూ పోతాయి

విశ్వమున ఏ రూపాన్ని చూసినా

విశ్వమున ఏ రూపాన్ని చూసినా విజ్ఞానం కలగాలనే విజయాలు చేకూరాలనే
సమాజాన్ని సద్వినియోగ పరచాలనే విశ్వ జీవులను ఆత్మ సంతోష పరచాలనే
విజ్ఞానాన్ని కలిగించే విశ్వ రూపాలను మహా దివ్య ఆలోచనలతో అన్వేషిస్తున్నా
కరుణ భావాలను కలిగించే రూపాలున్నా నాలో విశ్వ కర్మలు అపజయాలతోనే

నేను జీవించుటలో ఎదుగుటలేదు

నేను జీవించుటలో ఎదుగుటలేదు కాలంతో కరిగిపోతున్నా
నా విజ్ఞాన కార్యాలు నన్ను సాగనివ్వటం లేదు కఠినంగా నిలిచిపోతున్నాయి
ధృఢ సంకల్పంతో విజ్ఞాన కార్యాలు ఆగిపోయి నష్టాన్ని కలిగిస్తూనే ఉన్నాయి
ప్రతి కార్యంలో అపజయాల కష్ట నష్టాల దుఃఖ భావాలేగాని చిగురించే ఆశ లేదు
విజయాలు లేక కాలంతో నా విశ్వ విజ్ఞానం ఆలోచనలు కరిగిపోతూనే ఉన్నాయి

ఎప్పుడో జరగబోయే తప్పులకు

ఎప్పుడో జరగబోయే తప్పులకు నష్టాలకు నేడు ఆలోచనలలో మరుపు కలుగుతున్నది
విజ్ఞాన ఆలోచనలను తారుమారు చేసేలా కార్యాలు అపజయాలతో కఠినంగా సాగుతున్నాయి
అపజయాలకు కాల ప్రభావాలు ఎప్పుడూ ఆశతో ఎదురుచూస్తున్నట్లు మేధస్సులో ఆలోచనలు
భవిష్యత్లో ఇంకా ఎన్నో అపజయాల నష్టాల కార్యాలే సాగాలని నేడు ఆలోచనలలో మహా మరుపు

కర్మ కర్మేణ కర్మాయచా

కర్మ కర్మేణ కర్మాయచా
కర్మ భూతాయా విశ్వ కర్మేచ
విశ్వ భూతాయ పంచ భూతేనా
పంచ భూతాయ విశ్వ కర్మేచ
జీవ భూతేనా మహా కర్మేయచా
కర్మే కారణ జీవన క్రియాయచా

నేను మహా కర్మ జీవిని కర్మను

నేను మహా కర్మ జీవిని కర్మను ఎదుర్కొనుటలో నిత్యం ఘోరంగా విఫలమవుతున్నా
విజ్ఞానంగా ఆలోచించినా నాలో ఆలోచనలు నష్టాలను కఠినత్వాన్ని స్వీకరిస్తున్నాయి
ఘోర అపజయాలకు కాల ప్రభావాలకు మానవ ప్రమేయాలకు నేనే బంధీనవుతున్నా
జీవితంలో చిగురించే ఆశలు కోరికలు ఎన్నో నశించి మేధస్సు కర్మ స్థితితో జీవిస్తున్నది

నేను నిద్రించుటలో రేపటి కార్యాలు

నేను నిద్రించుటలో రేపటి కార్యాలు విజ్ఞానంగా విజయాలు కావాలనే ఆలోచిస్తాను
ఎంత విజ్ఞానంగా ఆలోచించినా కార్యాలు నష్టాలతో ఘోర కఠినంగా సాగుతున్నాయి
నా నిద్రకు అర్థం లేకుండా కేవలం మానసిక విశ్రాంతి కోసమే నిద్రిస్తున్నట్లున్నది
విజయాలు లేని జీవితాలు ఆహార నిద్ర కార్యాలు ఎందుకో మేధస్సుకే తెలియదేమో

ఏ తండ్రి కుమారినికి సుఖాన్ని

ఏ తండ్రి కుమారినికి సుఖాన్ని ఇవ్వలేడు ఇది కర్మ సిద్ధాంత జీవన విధానం
కర్మతో జీవనం శ్రమతో జీవితం సాగే విశ్వ కార్యాల అనుభవ విజ్ఞాన కాల సాగరం
కుమార్తె ఐనా కుమారుడైనా శ్రమించుటతోనే ఆహార ఆర్థిక కార్య కలాపాలు
ఏ కార్యాన్ని చెయ్యొద్దని కుమార్తె కుమారులను ఏ తల్లి తండ్రులు చెప్పలేరు
శ్రమతో విజ్ఞానం అనుభవం కష్టం నష్టం దుఃఖం సుంహం ఆనందం ఇలా ఎన్నో

Tuesday, December 28, 2010

సముద్రపు అలలు ఆకాశాన

సముద్రపు అలలు ఆకాశాన మేఘాలుగా ప్రవహిస్తున్నాయి
మేఘాల అంచులు మెరుస్తూ ఆకాశం కిరణాలతో ప్రకాశిస్తున్నది
ఆకాశంలో మేఘాల రూప భావాల ప్రయాణాలు సాగుతున్నాయి
కొత్త కొత్త మేఘాలు వివిధ రూప పరిణామాలతో వస్తూనే ఉన్నాయి

నీ రూపం ఎంతటి భయంకరమైనా

నీ రూపం ఎంతటి భయంకరమైనా వికారమైనా నీ ప్రవర్తన సరైనదైతే
ఎవరి ప్రక్కన కూర్చున్నా ఎవరికి అప భావ అభ్యంతరం కలగదు
విజ్ఞాన వినయ విధేయత ప్రవర్తన సమాజంలో ఏ రూపానికైన ఒకే గౌరవం
సమాజానికి కావలసినది విశ్వ విజ్ఞాన విధేయత గల ప్రవర్తన భావమే

నీవు ఎలా వ్రాయగలవు విశ్వవిజ్ఞానాన్ని

నీవు ఎలా వ్రాయగలవు విశ్వ విజ్ఞానాన్ని నీకు ఎవరు తెలుపుతున్నారు
ఏ గ్రంధంలో లిఖించారు ఎలా ఎప్పుడు చదువుతూ అర్థం చేసుకుంటున్నారు
ఎవరికి తెలియని పర భాష ప్రజ్ఞాన విశ్వ భావ స్వభావ ఆత్మ తత్వ విజ్ఞానం
నీవు తెలిపే భావ స్వభావాలకు నా మేధస్సు శూన్యమై ఆలోచనలు నిలిచిపోయాయి

పద్మ శ్రీ పద్మ నాభం పద్మ భూషణం

పద్మ శ్రీ పద్మ నాభం పద్మ భూషణం పద్మావతీయం పర జ్ఞాన విజ్ఞానం
విజ్ఞాన విధానంలో పద్మ తత్వాల భావాలచే సుగుణ కార్యాలను సాగించడం
సమాజానికి కావలసిన సేవలు అందిస్తూ విషయ పరిజ్ఞాన్ని కలిగి ఉండడం
అనుభవాలతో సమాజాన్ని ఓ గొప్ప బాటలో నడిపిస్తూ ఎందరినో ఆదుకోవడం

నిన్నటి నిద్రలో నేటి కార్య క్రమ

నిన్నటి నిద్రలో నేటి కార్య క్రమ విధానాలు ఏవీ తెలియలేదే
నేను నిద్రించిన స్థితిలో నేటి కార్య భావాల అన్వేషణ సాగలేదే
నేడు నేను సాగించే కార్యాలు జరగకుండా ఆగిపోతాయేమో
కార్య ఫలితాలు లేక నా మేధస్సులో ఎన్నో ఆలోచనల అలజడి
నేటి కార్య స్థితి విధానం నిన్నటి నిద్రలో కలుగుతాయని నా విశ్వాసం

విశ్వ జనులకు స్వాగతం మానవ

విశ్వ జనులకు స్వాగతం మానవ విజ్ఞానమునకు నా వందనం
విశ్వ జీవుల జీవితం బహు విధాల శాస్త్రీయ కార్య క్రియ విశేషణం
జీవ పర జ్ఞాన పరమావధీయ విశ్వ కార్య ఆత్మ స్థాన స్థితి భ్రమణం
పర ధ్యాన జ్ఞాన కార్యం విశ్వ విజ్ఞాన లోకచర కార్య క్రియా పరమార్థం

నాకు విశ్వాన్ని పరిచయం చేయండి

నాకు విశ్వాన్ని పరిచయం చేయండి ఎలా జీవించాలో తెలియుట లేదు
విశ్వ విజ్ఞానం ఉంటేనే సమాజంలో జీవనాన్ని సాగిస్తూ జీవించగలం
ఎన్నో కార్యాలు ఎన్నో సమస్యలు ఎన్నో పరిష్కారాలను తెలుసుకోవాలి
ప్రతీది విశ్వ విజ్ఞానంగా ఉంటేనే కార్యార్థ భావనగా ఉంటుందని నా ఆలోచన

మహా కార్యాలను చేయుటకు నీలో శక్తి

మహా కార్యాలను చేయుటకు నీలో శక్తి లేకపోతే
కార్యాన్ని మొదట చిన్నగా ప్రారంభించి సాగిపో
కార్యం సాగిపోవుటలో నీకెవరైనా ఒకరు తోడైతే
కార్యం మహా కార్యంగా మరొకరితో సాగిపోతుంది
మహా గొప్ప కార్యాలకు మరెందరో కదలి వస్తారు
ఆలోచన సరైనదైతే మహా కార్యాలు సాగిపోతాయి

ప్రతి రోజు శూన్యం నుండే ప్రయాణిస్తాను

ప్రతి రోజు శూన్యం నుండే ప్రయాణిస్తాను
ప్రతి రోజు శూన్యం నుండే కాల ఆరంభం
ప్రతి భావనను శూన్యం నుండే స్వీకరిస్తాను
ప్రతి కార్యాన్ని శూన్యం నుండే ఆరంభిస్తాను

విశ్వ కల్పన రూప భావన తల్లి తత్వమే

విశ్వ కల్పన రూప భావన తల్లి తత్వమే
భావన స్వభావం జీవన జీవితం తల్లిదే
గుణ విచక్షణ అణు కణ పరిణామం తల్లిదే
జీవ కణ ఎదుగుదల రూప ఆకారం తల్లిదే
తల్లి తండ్రుల దైవమే విశ్వానికి మూలార్థం

నీ జీవితం నీ తల్లికే అంకితం నీ విజ్ఞానం

నీ జీవితం నీ తల్లికే అంకితం నీ విజ్ఞానం నీ తల్లి కోసమే
తల్లి తండ్రుల క్షేమానికై నీవు శ్రమించే విజ్ఞానమే ఆధారం
నీకు కలిగే సమస్యలు ఏవైనా ఎంతటివైనా నీవే తొలగించుకోవాలి
సమస్యల నుండి నీవు విజ్ఞానంగా జీవించుటయే మహా విజయం

తల్లి కన్నా గొప్పది విశ్వమున

తల్లి కన్నా గొప్పది విశ్వమున ఏమున్నది తల్లి లేకుండా ఏది తెలియును
జన్మ లేనిదే మనకు ఏమి లేదు కనుకనే తల్లే విశ్వానికి మూల కేంద్రము
తల్లి ద్వారానే తర తరాల విలువలు విజ్ఞానం భావ స్వభావాలు ఇంకెన్నో
మనం దేనిని సృష్టించినా దాని గొప్పదనం తల్లిదే తర్వాతే మన విజయం
విశ్వంలో మనం ఏమి చేసినా దేనిని తిలకించినా అద్భుతమైనా తల్లిదే
బ్రంహా విష్ణు మహేశ్వరుల కన్నా గొప్పది తల్లియేనని జగమెరిగిన సత్యం
సృష్టికి మూలం దైవం తల్లియేనని విశ్వమున మర్మమైనా తల్లి తత్వమే
ఎప్పటికి తోడుగా విడిపోని బంధంతో నీతో జీవించే దైవమే తల్లి తండ్రులు

నా శ్వాసను నేను గమనించుటలో

నా శ్వాసను నేను గమనించుటలో నా తల్లి ఆరోగ్యంగా ఉండాలి
నా తల్లి అనారోగ్యం నా శ్వాసలో చేరిపోయి తను సంతోషంగా ఉండాలి
నా తల్లిదండ్రలు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను
నా శ్వాసలో నా వారు సంతోషంగా ఉండాలనే నేను ధ్యానిస్తున్నాను
కాల ప్రభావాలు కూడా నా శ్వాసలో సంతోషంగా ఉండాలనే గమనిస్తున్నా
విశ్వం నా శ్వాసలో ఉన్నట్లు నా ధ్యాస నా శ్వాసపైననే నా తల్లి కోసమే

రేపటి కార్యాలకై వస్తా మరో కార్యాలతో

రేపటి కార్యాలకై వస్తా మరో కార్యాలతో వెళ్తా
పాత కార్యాలు చేస్తూ పొతే కొత్త కార్యాలు వస్తుంటాయి
పాత కార్యాలతో ఈ రోజు ముగిస్తే కొత్త కార్యాలు రేపటికి ఆరంభం
కొత్త కొత్త కార్యాలే రోజులను అనుభవంగా సాగిస్తూ కాలంతో నడిపిస్తాయి

ప్రయాణాన్ని మహా గొప్పగా ఆనాటి

ప్రయాణాన్ని మహా గొప్పగా ఆనాటి నుండి ఎన్నో విధాల సాగిస్తున్నా
సముద్రంలో ప్రతి చేపపై తాబేలు సర్పంపై వివిధ జల జీవులతో ప్రయాణిస్తున్నా
ఆకాశంలో ప్రతి పక్షిపై ప్రత్యేకంగా గ్రద్దపై వివిధ రకాలుగా ప్రయాణిస్తున్నా
గాలిలో అణువులతో వివిధ రకాల ధూళి కణాలతో ప్రయాణిస్తూనే ఉన్నా
భూమిపై ఎన్నో రకాలుగా ఎన్నో జంతువులతో మహా ఆనందంగా ప్రయాణిస్తున్నా
ఒంటెలపై ఏనుగులపై గుఱ్ఱాలపై వివిధ జంతువులపై ఆనాటి నుండి ప్రయాణిస్తూనే ఉన్నా
ఇంకా విశ్వమున సాంకేతిక యంత్రాల ద్వారా వాహనాల ద్వారా ప్రయాణిస్తున్నా
ఎక్కడెక్కడో ఎన్నో విధాల ఎన్నో రకాల ప్రతి క్షణం విశ్వాన్ని తిలకించుటకు ప్రయాణిస్తూనే ఉన్నా

నా మేధస్సులో విశ్వ కాల ఆది విష్ణు

నా మేధస్సులో విశ్వ కాల ఆది విష్ణు చక్రం మాయమైనది
విశ్వ చక్రం లేక నా మేధస్సు కాల ప్రభావాలతో సాగుతున్నది
నా జీవితాన్ని నా మేధస్సు నిర్ణయించలేని విధంగా ఉన్నది
కాల ప్రయాణమో జీవిత ప్రయాణమో దిక్కులకే నా మేధస్సు

గతం కాల ప్రభావమైనా విశ్వ

గతం కాల ప్రభావమైనా విశ్వ ప్రభావమైనా అజ్ఞాన విజ్ఞానమైనా నేటి జీవితాన్ని తెలుసుకో
నేడు ఎలా జీవించాలో సమాజంలో ఎలా మెలగాలో నేటి విజ్ఞాన విధానమేదో తెలుసుకో
సాంకేతిక రంగాలు కృత్రిమ పద్ధతులు వైద్య శాస్త్రీయములు విజ్ఞాన విశ్వాలయ విధానాలెన్నో
ప్రకృతిలో జీవించడం నేటి సమాజ స్థితిలో అరుదై కృత్రిమ జీవన ఆలోచనలతో జీవించగలగాలి

Monday, December 27, 2010

నరకం అనుభవించడమంటే ఆర్ధిక విజ్ఞాన

నరకం అనుభవించడమంటే ఆర్ధిక విజ్ఞాన సామర్థ్యాలున్నా చిన్న సమస్యలు తీరకపోవడం
కాల ప్రభావాలు వెంటాడినట్లు చేసే పనివారు చేయక లోపాలతో నష్టాలకు గురి చేయడం
నైపుణ్యమున్నా జాగ్రత్త లేక గౌరవ భావాలు లేక సోమరితనంతో మనిషిని వేధించడం
మరో పనులతో మరొకరికి సహకరించి కొందరితో ప్రతిఫలాన్ని స్వీకరించి నరకాన్ని చూపిస్తారు

దరిద్రం దుర్భాగ్యం దురదృష్టకరం

దరిద్రం దుర్భాగ్యం దురదృష్టకరం మనిషిని అణచి వేసే కాల ప్రభావాలు
తీరని సమస్యలతో పాటు మరో కొత్త సమస్యలు జీవితంలో కలుగుతాయి
మనకు అవసరమనుకుంటేనే తీరని సమస్యలుగా లేవంటే సాధారణంగా
మన ఆశయ సమస్యలుగా అనుకోవటం వలన కలిగే కష్టాలలోనే కాల ప్రభావాలు
కాల ప్రభావాలతో సమస్యలను ఆలోచిస్తూ ఉంటే దరిద్రం దుర్భాగ్యమని అనుకుంటాం
సమస్యలు తీరక పోవటాన్ని దురదృష్టకరం అనుకుంటే జీవితమే కర్మ కాండం

ఓ రూపాన్ని ఓ కోణంలో చూస్తే

ఓ రూపాన్ని ఓ కోణంలో చూస్తే ఓ విజ్ఞానం మరో కోణంలో చూస్తే మరో విజ్ఞానం
అలా అన్ని కోణాలలో చూస్తే సంపూర్ణ విజ్ఞానంగా ఎన్నో రంగాలలో తెలుస్తాయి
ఏ సమస్య ఏ కోణంలో నుండి వస్తుందో ఎలాంటి అనుభవాన్ని తెలుపుతుందో
ప్రతి సమస్యలో కలిగే పరష్కార మార్గమే సంపూర్ణ విజ్ఞానంగా తెలుసుకోవడం

తర తరాల చరిత్రలో తల రాతలు

తర తరాల చరిత్రలో తల రాతలు ఎలాంటివో తల క్రిందులుగా మారుతున్నాయి
తర తరాలకు మారని తల రాతలతో సమస్యలు తలక్రిందులై కఠినమౌతున్నాయి
ఎవరికి ఎవరో సమస్యగా ఎంతవరకైనా తీరని సమస్యగా తరతరాల తీరని చరిత్రలే
చరిత్రలే తలక్రిందులై తర తరాలుగా సాగుతూ సమస్యల వలయాలతో జీవితాలు

ఓ విశ్వమా! నా జీవితాన్ని కఠినం చేసి

ఓ విశ్వమా! నా జీవితాన్ని కఠినం చేసి నా వారి జీవితాలను మహా సంతోష పరుచు
నేను నా కోసం జీవిస్తున్నానని నా వారి వేదన అందుకే నా జీవితాన్ని కఠిన పరుచు
కాల ప్రభావాలు ఎలాగో నా మహా ఆశయాలను తీరకుండానే ఆకాశానికి చేర్చాయి
నాకంటూ ఏదీ లేదూ కనీసం నా వారి జీవితాలైనా నక్షత్రాలవలే సంతోష పరుచు

తర తరాలుగా వంశ పరం పరలు

తర తరాలుగా వంశ పరం పరలు సాగుటలో నా జన్మ ఆది స్థానమున లేదే
నేటి స్థానమున ఒక విధముగా జీవిస్తున్నా ప్రళయాంతమున నా జన్మ లేదే
మధ్యస్థ జీవితంలో భావ స్వభావాలు కాల ప్రభావాలు అమానుష తత్వంగానే
ఆనాటి ఆది భావన నేనైనా నాటి విజ్ఞానమునకు వైకుంఠ పాళీ జీవితమే

జత లేని జీవితం జీవితం కాదా

జత లేని జీవితం జీవితం కాదా జీవించలేమా జీవితానికి అర్థం లేదా
జత లేక ఇప్పటి వరకు ఎవరు జీవించ లేదా అసాధ్యమా జరగ రాదా
వయసును దాటి వెళ్ళే లోపు జత జీవన జీవితాన్ని ప్రారంభించాలా
తరతరాలుగా జత జీవితాలే సాగిపోవాలా రాతలు మారినా జతగా సాగిపోవాలా

ఓ కొత్త భావనతో కొన్ని పాత భావాలను

ఓ కొత్త భావనతో కొన్ని పాత భావాలను మరచిపోయా
కొత్త భావనలో ఉన్న స్వభావం నా మేధస్సును అణిచి వేస్తున్నది
అణిచి పోవుటలో పాత భావాలు జ్ఞాపకాలు లేక కొత్త ఆలోచనలతో
భావాలను ఆలోచించుటలో ప్రస్తుత స్వభావాలు దిగ్భ్రాంతియే

ఎవరికి ఎవరని జతలేక ఎన్నాళ్ళుగా

ఎవరికి ఎవరని జతలేక ఎన్నాళ్ళుగా భావాలు కలగలేక
వయసు వెళ్ళుతున్నా భావాలు లేక ఎందరికో చూడాలని వేడుక
మనస్సు మేధస్సు స్థితి విజ్ఞానమైన భావాలు ఆశగా లేకపోవుట
ఆశయాలు సాగలేక కాల భావాలతో జత లేక ఎందరికో ఎదురు చూపే

నా విజ్ఞాన మేధస్సుకు అజ్ఞాన కాల

నా విజ్ఞాన మేధస్సుకు అజ్ఞాన కాల మేధస్సు తోడైనది
కాల ప్రభావాలతో కొన్ని గడియలు అమానుషమౌతున్నాయి
నా భావ స్వభావాలను అణచి వేస్తూ విజ్ఞానాన్ని వెంటాడుతున్నాయి
కుటుంబమే భాద్యతగా కాల ప్రయాణంలో విజ్ఞాన ఆలోచనలు ఎన్నో విధాల

నాలో ఉన్న స్థితి ఏది నా మేధస్సుకు

నాలో ఉన్న స్థితి ఏది నా మేధస్సుకు తెలిసిన తత్వమేది
నా ఆత్మ స్థితి భావాల యోగ తత్వ స్వభావార్థం ఏమిటి
నా వాళ్లకు నా స్థితి నచ్చటం లేదు కాలం విధి తత్వమే
నాకున్న భావాలకు నేనే భాధ్యుడని నా స్థితి తెలుపుతున్నది

చతుర్బుజ కోణ కేంద్రంలో ఉన్న స్థితి

చతుర్బుజ కోణ కేంద్రంలో ఉన్న స్థితి విశ్వ స్థితియే
ఈజిప్టులో నిర్మించిన చతుర్భుజ కోణ కేంద్రాలలో అద్భుత స్థితులే
చతుర్భుజ మధ్య స్థానాన్ని చేరుకునే స్థితి గాలి నీరు వేడికి లేవేమో
ఎక్కడో మొదలై మరెక్కడో వదిలిపోయే స్థితులు మధ్య స్థానాన్ని చేరుకోలేవేమో
రాళ్ళను పేర్చిన విధాన శైలి పరిణామం స్థానం మహా నైపుణ్య చతుర్విజ్ఞానం
అద్భుతాలలో మహా అద్భుతమైన నిర్మాణం చతుర్భుజ కోణ కేంద్రమే
చతుర్భుజ కోణ కేంద్రంలో ఉన్న స్థితులు విశ్వ భావాల స్థితులను తెలుపుతాయి
విశ్వంలో కలిగే అద్భుత స్థితులలో చతుర్భుజ కోణ కేంద్రంలో కలిగే స్థితి మరో అద్భుతం
మేధస్సును ధ్యానింపజేయాలన్నా చతుర్భుజ కోణ కేంద్రం మహా ఏకాగ్రత స్థితిని కలిగిస్తుంది

మహాశయ నక్షత్రమా! అష్ట దిక్కులలో

మహాశయ నక్షత్రమా! అష్ట దిక్కులలో ప్రకాశించే మీ కాంతులు దివ్య విజ్ఞాన స్వభావాలే
ఆకాశాన అష్ట దిక్కులలో నక్షత్రాలుగా ఎలా ఉన్నారో నా మేధస్సున అలాగే మెరుస్తున్నారు
మీ దివ్య కాంతుల ప్రకాశ తేజస్సులు నా మేధస్సు కణాలలో చేరి మెరుస్తున్నాయి
మీ భావ స్వభావ తత్వాలు ఆకాశానవలే నా మేధస్సులో వివిధ కక్ష్యలుగా ప్రకాశిస్తున్నాయి
మీ ప్రకాశముచే నా మేధస్సులో విశ్వ విజ్ఞాన భావాలు దివ్య తేజస్సుతో కలుగుతున్నాయి

Sunday, December 26, 2010

నీ ఆరోగ్య విధానాన్ని గమనించి నీకు

నీ ఆరోగ్య విధానాన్ని గమనించి నీకు కావలసిన ఆహారాన్ని తీసుకో
గత రెండు రోజులలో నీవు తీసుకున్న ఆహారాన్ని ఆరోగ్య స్థితిని
శరీర ప్రస్తుత స్థితిని గమనించి ఏ ఆహారమైతే అవసరమో దానినే తీసుకో
శరీర స్థితి తత్వాన్ని తెలుసుకోకుండా ఏ ఆహారాన్ని తీసుకున్నా
అనారోగ్యం కలగవచ్చని నాకు కలిగిన ఓ అనుభవ కాల భావన
తీసుకునే ఆహార పదార్థాల పైననే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది
ఆహారాల పరిణామాలు కూడా శరీర తత్వాన్ని స్థితిని తెలుపుతాయి
సరైన ఆహారాన్ని సమపాలలో సరైన సమయానికి తింటేనే ఆరోగ్యం

మేధస్సే నీ శరీరాన్ని నడిపిస్తున్నది

మేధస్సే నీ శరీరాన్ని నడిపిస్తున్నది
శరీరంలోని ప్రతి కదలికను పరిశీలిస్తున్నది
ఏ అవయవాలకు ఏ సమస్య కలిగినా తెలుసుకుంటుంది
ప్రతి కణ భావ స్వభావ స్పర్శను గమనిస్తూ గ్రహిస్తుంది
ఆకలైనా దాహం వేసినా రోగం వచ్చినా ప్రమాదం జరిగినా
శరీరంలో కలిగే ప్రతి అవస్థను మేధస్సు గ్రహిస్తూనే ఉంటుంది
మేధస్సు ఎంత ఉత్తెజమైతే శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది
శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే మేధస్సు అంత ఉత్తేజంగా ఉంటుంది
సరైన సమయానికి సరైన ఆహారం తీసుకుంటే శరీరాన్ని గొప్పగా నడిపిస్తుంది

ప్రతి జీవి మేధస్సులో ఆలోచనవై

ప్రతి జీవి మేధస్సులో ఆలోచనవై భావాన్ని గ్రహించుటలో తెలిసిన అర్థమేమిటి
భావాల అర్థాలను గ్రహించుటలో విశ్వ విజ్ఞానమున్నదా స్వభావార్థమున్నదా
విశ్వ తత్వాలు తెలియుటకు జీవులలో ఆలోచనవై ఆత్మ భావాలను గ్రహిస్తున్నావు
భావ స్వభావార్థాల జ్ఞానం విశ్వ విజ్ఞాన యోగ పరంపర పర ధ్యాన ఆత్మ అన్వేషణయే

సూర్యాస్తము వలే నీవు నిద్రించే వేళ

సూర్యాస్తము వలే నీవు నిద్రించే వేళ నీ శరీరంలో చీకటి ఏర్పడుతుంది
ఆకాశాన చంద్ర నక్షత్రాలవలే నీ శరీరంలో ఏ అవయవాలు ప్రకాశిస్తాయి
ఏ ప్రకాశం లేని శరీరం అమావాస్య చీకటిలా అవయవాల స్థితి తెలియక
కనిపించని అవయవాలకు శరీరంలో నేత్ర భావన లేకపోవడం లోపమే
నీకు నేత్ర భావనను కలిగించే ప్రకాశ తత్వ తేజస్సు శరీరంలో ఏర్పడేలా
సూర్య తేజస్సును చూస్తూ కిరణాల కాంతి భావాన్ని మేధస్సులో దాచుకో
సూర్య తేజస్సుతో నీ అవయవాలు మెరుస్తూ ఆరోగ్యంగా నక్షత్రాలవలే ప్రకాశిస్తాయి
సూర్య తేజస్సుతో ధ్యానిస్తే నీ శరీరం విశ్వానికే ఓ కాంతి కేంద్రమై జీవిస్తుంది

చీకటినే చూస్తూ జీవించే వారికి గమనమే

చీకటినే చూస్తూ జీవించే వారికి గమనమే నాలుగు దిక్కులుగా
వస్తువుల స్పర్శలతో రూపాన్ని తెలుసుకునే విచక్షణ భావన
వస్తువుల పని తీరును తెలుసుకొని సాగించే సాధనలో స్వర భావాలే
తమ పనులు తాము చేసుకొనుటలో నిత్య గమన జ్ఞాన ఎరుక
అజ్ఞానమే కనిపించని దివ్య భావన ఉన్నా విశ్వ వర్ణాలు మేధస్సులోనే
ప్రతి స్పర్శలో ఓ విజ్ఞాన భావనతో నేత్ర భావన లేని జ్ఞానేంద్రియ తత్వం

ఎన్నో కార్యాలను జ్ఞాపకంగా

ఎన్నో కార్యాలను జ్ఞాపకంగా చేసుకుంటూ పోతున్నా మేధస్సులో మరుపే
మనలో ఉన్న కొన్ని కార్యాల వలన మరో కొన్ని కార్యాలను మరచిపోతాం
మరచిన కార్యాలు మరో సమయాన గుర్తుకు వస్తే తెలుస్తాయి మరచినట్లు
కొత్త కొత్త కార్యాలు మేధస్సులో చేరుతూ పాత కార్యాలను మరచిపోతున్నాం
పాత కార్యాలను వ్రాసుకొని ఓ ప్రణాళికను చేసుకొని సమయాన్ని కేటాయించాలి
పాత వాటిని ముగించుకుంటూ కొత్త వాటితో సాగిపోతూ ఉంటే మరుపు తగ్గును
వ్రాసుకోక పోయినా కొన్ని గుర్తులను పెట్టుకుంటే మనకు తోస్తాయి మరవనట్లు
అన్నీ కార్యాలను మేధస్సులోనే తలచుకుంటే కొన్ని మరచిపోవడం ఖచ్చితమే

జీవితాలు మారేందుకు కాల ప్రభావాలు

జీవితాలు మారేందుకు కాల ప్రభావాలు ఎన్నో విధాల సంభవిస్తాయి
సమస్యలే కలగవచ్చు అవకాశాలే రావచ్చు ఏవైనా మారిపోవచ్చు
ఎవరెవరో ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడికో ఎన్నో విధాల వివిధ మార్పులతో
కాలం ఆలోచనను కలిగించవచ్చు లేదా తెలిసిన దానిని మరిపించవచ్చు
ఎవరికి ఎప్పుడు ఏ ఆలోచనతో ఏ అవకాశం వస్తుందో కాల జ్ఞానమే

ఆత్మ యోగి భావాలున్నా నేటి మనిషి

ఆత్మ యోగి భావాలున్నా నేటి మనిషివలే జీవిస్తున్నా
విశ్వ తత్వాలు మేధస్సులో ఉన్నా శరీరంతో జీవిస్తున్నా
పంచ భూతాలూ ఏకమైనా కాల ప్రభావాలు విభిన్నమే
శరీరాన్ని ఆత్మ యోగిలా విశ్వ భావాలతో జీవింపజేయడం
మేధస్సులో కలిగే ఆలోచనలా త్వరగా జరిగే ప్రభావం కాదు
యుగాలుగా పర ధ్యాస ఆత్మ స్థితిలో కాల తత్వం కలగాలి

శరీరం నాదైనా లక్షణాలు విశ్వానివే

శరీరం నాదైనా లక్షణాలు విశ్వానివే మేధస్సు నాదైనా ఆలోచనలు కాలానివే
కాలం కలిగించే ఆలోచనలతో శరీరాన్ని రక్షిస్తూ విశ్వ భావాలతో జీవిస్తున్నా
విశ్వ తత్వాలు శరీరానికి కలిగేలా మేధస్సున విశ్వ విజ్ఞానాన్ని ఆలోచిస్తున్నా
విశ్వ భావ స్వభావాలతో జీవించాలని మేధస్సునే విచక్షణతో పరిశోధిస్తున్నా

నేను ఎలా జీవిస్తున్నానో మేధస్సుకు

నేను ఎలా జీవిస్తున్నానో మేధస్సుకు తెలిసినా శరీరానికి అర్థం కావటం లేదే
మేధస్సు తెలిపే ఆత్మ భావాలకు శరీరంలో విశ్వ స్వభావత్వం కలుగుట లేదే
జీవితాన్ని ఎలా సాగించాలో శరీర గుణాలు సహకరించక సామాన్య జీవనమే
జీవనమే మేధస్సుకు కార్యాలోచనల కాల ప్రయాణ శరీర గుణ తత్వ జీవితం

ఏ యుగాన ఎక్కడ జన్మించానో

ఏ యుగాన ఎక్కడ జన్మించానో ఏ లోకాన ఎక్కడ జీవించానో ఆకాశమే గుర్తుగా
ఆనాటి ప్రదేశాలు మారిపోయినా ఆకాశం అలాగే మేఘాలతోనే కనిపిస్తున్నది
ఆకాశంలో చూసినవే నేర్చినవే గుర్తుగా ఆనాటి జ్ఞాపకాలు తెలుస్తున్నాయి
ఆకాశంలో కలిగే భావాలే ప్రతి జన్మకు నిదర్శనాలతో నేటికి మేధస్సులో ఉన్నాయి

మీరు గ్రహించే విజ్ఞానం కన్నా నేను

మీరు గ్రహించే విజ్ఞానం కన్నా నేను గ్రహించే విజ్ఞానం మరోలా తెలుస్తున్నది
విజ్ఞాన భావాలతో మీరు ఆలోచిస్తుంటే నాలో ఆత్మ భావాలు తెలుస్తున్నాయి
ఓ వైపు సమాజ జీవితం అనుకున్నా మరో వైపు నుండి నాలో మరో విజ్ఞానం
విశ్వ విజ్ఞాన భావాలతో కొత్త జీవిత ఆలోచనలు నాలో కలిగి సాగుతున్నాయి

నాకు కనిపించే రూపాలు

నాకు కనిపించే రూపాలు భావ స్వభావాలకు నిదర్శనం
అనుభవాలకు సరి కొత్త కాల విజ్ఞాన సమయాలోచనలు
ప్రతి క్షణం ఓ రూప అన్వేషణ నేత్రానికి ఆత్మ పరిశోధన
ఆత్మలో విజ్ఞాన భావన స్వభావాలకు విశ్వ ప్రజ్ఞానత్వం

నక్షత్రంలోనే నా నేత్ర రూపమున్నదా

నక్షత్రంలోనే నా నేత్ర రూపమున్నదా నా నేత్రంలోనే నక్షత్రమున్నదా
నా నేత్రాన్ని నక్షత్ర కాంతులు సంపూర్ణ విశ్వంతో ఆవరించి ఉన్నాయి
నక్షత్ర కాంతిలోనే విశ్వ రూపాలు విశ్వ భావ స్వభావ కదలికలు ఎన్నో
నేత్రములోనే విశ్వమున్నట్లు మహా వర్ణ నక్షత్ర ప్రకాశం దాగి ఉన్నది

మరలా రాని సమయం మరలా

మరలా రాని సమయం మరలా తెలుపలేని విశ్వ విజ్ఞానం
మరెవరికి గుర్తురాని జ్ఞానం ఆత్మలోనే దాగే భావ స్వబావం
కావాలనుకుంటే ఆలోచించవద్దని తెలుస్తుంటే ఇక చాలని
మేధస్సులో నిత్య అన్వేషణ సాగే వరకు ఆత్మకు అతకదు
ఆత్మకు అతికినా విశ్వ భావన ఎరుక లేకపోతే మరచిపోవడమే
విశ్వ విజ్ఞాన ప్రాముఖ్యత పరమాత్మ భావనకే ఎరుకతో తెలియును

ఆత్మలో ఏకత్వం లేదంటే

ఆత్మలో ఏకత్వం లేదంటే పంచ భూతాలలో విభిన్న స్వభావాలే
విభిన్న స్వభావాలతో విజ్ఞాన ఆధ్యాత్మ జీవితాన్ని సాగించలేవు
ఆధ్యాత్మ జీవితం కాల విధుల ప్రభావాలకు ప్రాపాంచిక స్వభావం
విభిన్న స్వభావాలు మేధస్సును వివిధ రకాలుగా ప్రభావితం చేస్తాయి
ఆత్మలో ఏకత్వ ధ్యాస ఉన్నంతవరకు ఆధ్యాత్మ జీవితం ప్రశాంతమే

విశ్వంలో ఏకీ భవిస్తేనే విశ్వ రూపాల

విశ్వంలో ఏకీ భవిస్తేనే విశ్వ రూపాల ఆధ్యాత్మ స్వభావాలు నిన్ను ఆకర్షిస్తాయి
నీలో కలిగే ప్రకంపనాలలో విశ్వ రూపాల స్వభావ తత్వాలు నీ ఆత్మలో చేరుతాయి
విశ్వ తత్వాలతో విశ్వాత్మగా పరమాత్మవలే జీవిస్తావని విశ్వ విధాత వాణి
కాల ప్రభావాలకు నిలిచే పరమాత్మ భావన విశ్వమున అవతరించి యుగాలే గడిచాయి
ఎంతటి ఆత్మ సంకల్పం ఉంటే అంతటి కాల ప్రభావాలకు ఏకత్వాన్ని జయించగలగాలి
విశ్వమున మర్మము తెలిసినా కాల ప్రభావాలతో జీవించుట మేధస్సుకు తక్షణ మర్మమే
తక్షణ మర్మాన్ని రహస్యంతో తక్షణంలో తెలుసుకుంటూ సాగాలంటే ఆత్మలో ఏకత్వమే

ఓ వైపు దైవ నిర్ణయం ఇంకో వైపు

ఓ వైపు దైవ నిర్ణయం ఇంకో వైపు కాల నిర్ణయం మరో వైపు విశ్వ నిర్ణయం
ఓ వైపు ఆత్మ నిర్ణయం ఇంకో వైపు విజ్ఞాన నిర్ణయం మరో వైపు నా వారి నిర్ణయం
ఎన్నో నిర్ణయాలు నా మేధస్సులో పంచభూతాల తత్వంతో అన్వేషిస్తూనే ఉన్నాయి
అనుభవమేదో గత జన్మ ప్రభావాల ఆత్మ నిర్ణయమేదో విశ్వ కాల ప్రభావాలు ఏవో
కాలంతో ఓ ఆధ్యాత్మ భావనతో భావాలుగా ప్రస్తుతం ఎరుకతో సాగుతూనే ఉన్నా
ఎరుక నాలో ఉన్నంత వరకు పరమాత్మ మార్గం నా అన్వేషణలో ఉన్నట్లయితే దైవమే

ప్రతి సమయం కొన్ని భావాలను

ప్రతి సమయం కొన్ని భావాలను తెలుపుతూ కార్యాలను కొన సాగిస్తుంది
ఏ కార్యం ఏ భావాలతో ఎంత సమయం ఉన్నా నీలో ఏ విజ్ఞానం ఉన్నదో గ్రహించు
అలా ప్రతి కార్యాన్ని గ్రహిస్తూ పొతే నీలో విశ్వ భాష అన్వేషణ సాగుతూ వెళ్ళుతుంది
విశ్వ భాష అన్వేషణలో సూక్ష్మ విచక్షణ భావ స్వభావాలు ఆత్మ తత్వాన్ని కలిగిస్తాయి
ఆత్మ తత్వంతో విశ్వ విజ్ఞానిగా విశ్వ రూపాలలోనే భావన జీవిగా జీవిస్తూనే ఉంటావు

ఎక్కడికి వెళ్ళినా నా మేధస్సులో

ఎక్కడికి వెళ్ళినా నా మేధస్సులో అజ్ఞానాన్ని కలిగించని మంత్ర తంత్రమున్నదా
ఒక వేళ ఉంటే అందరికి అదే మంత్ర తంత్రాన్ని కలిగిస్తే విశ్వంలో అజ్ఞానమే ఉండదేమో
అజ్ఞానంలేని విశ్వం సూర్య ప్రకాశం వలే ఆధ్యాత్మ భావాలతో ప్రకాశిస్తూ ఉంటుంది
సూర్య ప్రకాశం మేధస్సులో ఉన్నంతవరకు అజ్ఞానం కలగదని నా మంత్ర భావన

నీకు కనిపించే విశ్వ రూపాలు చాలా

నీకు కనిపించే విశ్వ రూపాలు చాలా చిన్నవి అందులో కొన్నింటినే చూడగలుగుతున్నావు
మహా రూపాలు కనిపిస్తున్నా నీ నేత్ర దృష్టి కన్నా చాలా విశాలమైనవిగా ఉంటాయి
రూపాలను రూప భావాలుగా చూడుటలోనే సమానత్వ పరిణామం తెలుస్తుంది
కనిపించని రూపాలు ఎన్నో అందులోని విశ్వ భావ స్వభావాల వర్ణాల ఆకృతులు మరెన్నో

సూర్య కిరణంలో ఉన్న స్వచ్ఛమైన

సూర్య కిరణంలో ఉన్న స్వచ్ఛమైన తెలుపు తేజస్సు వర్ణ ప్రకాశంతో
ఆత్మ జ్ఞానికి అజ్ఞానం క్షీణించి శూన్యమై విశ్వ విజ్ఞానం కలుగుతుంది
విశ్వమున సూర్యుడి వలే తన భావ ప్రభావాలు ఆకర్షిస్తూ ఉంటాయి
మేధస్సును విజ్ఞాన పరిచే గుణ విచక్షణ భావాలు విశ్వానికి ప్రజ్ఞానమే

Saturday, December 25, 2010

విశ్వస్థితితో జీవించడం తల్లి స్వభావాల

విశ్వ స్థితితో జీవించడం తల్లి స్వభావాలలో ఉన్న గుణమే
తన పిల్లలకు స్వతహా జీవితం కలిగే వరకు ప్రాణ రక్షణ
ప్రాణ రక్షణకై ప్రతి క్షణం ప్రతి భావన జ్ఞాపకంగా ఎరుకతోనే
పిల్లలకు తల్లి లేదా తండ్రి భావన స్థితి కలిగే వరకు తోడుగా
అవసరమైతే తాను జీవించే వరకు కుమార్తె కుమారులతోనే
తల్లి ఆయుస్సు కూడా పిల్లల పిల్లలు తల్లి తత్వం పొందేవరకు
తమ భావాలు తరతరాలుగా అలా ప్రేమతో సాగాలనే భావన
తల్లి భావనకు అమృతం విశ్వమున దేహ స్థానమేనని విశ్వ స్థితి

కాల ప్రభావాలకు విశ్వం చలించకపోతే

కాల ప్రభావాలకు విశ్వం చలించకపోతే మేధస్సులో కలిగే భావాలోచనలకే చలించాలి
విశ్వమున జీవులకు తప్ప వేటికి స్వతహా చలన భావం లేనందుకే కాల ప్రభావాలు
కాల ప్రభావాలకు విశ్వ రూపాలలో స్థాన భ్రంశం రూప పరిణామాలు మారుతుంటాయి
మేధస్సులతోనే కలిగే విశ్వ మార్పులకు శక్తి సామర్థ్యాలు విశ్వ కాల భావాల స్వభావాలే

జీవితంలో కాలం వృధా

జీవితంలో కాలం వృధా అవుతుందనుకుంటే
నీలో శక్తి సామర్థ్యాలు ఇంకా ఉన్నాయనుకుంటే
సమాజానికి సహకారాలు అందించాలనుకుంటే
ఓ మహా గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసుకోండి
ప్రణాళికను క్రమ కార్యాలతో సాగేలా చూసుకోండి
లేనిపోని సమస్యలకు అవకాశం కల్పించకండి
సమస్యలను అప్పటికే పరిష్కారించి తొలగించండి
నీ ప్రణాళిక ఇంకా తర తరాలుగా సాగాలంటే
మహా వ్యక్తిని నిర్ణయించుకొని మీ అనుభవాలను తెలుపండి
ఎప్పటికి సాగే దీర్ఘ కాల ప్రణాళికలను నవ సమాజం కోసం ఎన్నుకోండి
మీలో శక్తి సామర్థ్యాలు లేకపోతే విశ్వ విజ్ఞానం కోసం ధ్యానించండి
మీకు కలిగే విశ్వ భావాల విజ్ఞానాన్ని సమాజానికి అందించండి
వృధా జీవితాన్ని దివ్యమైన జీవితంగా మార్చుకోండి

విశ్వమున కాల గుణాలకు ప్రాణాలు

విశ్వమున కాల గుణాలకు ప్రాణాలు కూడా పోతున్నాయి
కాల గుణాలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం మనకు కావాలి
కాలానికి తగ్గట్లుగా ఆరోగ్య భావాలను తెలుసుకోవాలి
మనిషికి నిత్యవసర వసతులు లేకపోవడమే అనారోగ్యం
రోగానికి దూరంగా శుభ్రతకు దగ్గరగా నిత్యవసరాలకే శ్రమిస్తూ
దేహాన్ని ఆరోగ్యంగా శక్తి సామర్థ్యాలతో జీవించేలా చూసుకోండి
దురలవాట్లకు ప్రాముఖ్యత నివ్వకుండా ఆర్ధిక ప్రాముఖ్యతను తెలుసుకోండి
కాల గుణాలు మనకు అప్పటికి విరోధమనిపిస్తే మరొక ప్రాంతానికి వెళ్ళిపొండి
జీవించడం తెలుసుకొని కాల ప్రభావాలను గమనించి ప్రాణాలను రక్షించుకోండి
నేటి వయస్సులో మీకు తెలియకపోయినా వృద్దాప్యంలో కాస్త ఆనాటి ఆలోచనగా

ఓ వృద్దులారా! చలికి ప్రాణం పోతుందని

ఓ వృద్దులారా! చలికి ప్రాణం పోతుందని మీరు అనుకుంటే
కాస్త శాఖ ఆహారాన్ని భుజించి కాస్త వేడి నీటిని సేవించి
విశ్వ స్థితితో జగతిని మెప్పించేలా విశ్వ భావాలతో ధ్యానించండి
శ్వాసలో ఉన్న జీవాన్ని దైవ స్వభావ ఆత్మ ధ్యానంతో వెలిగించండి
విశ్వ స్థితి నీ మేధస్సుకు తెలియని పర ధ్యాస ధ్యాన ప్రభావమే

చలి కాలంలో పొగ మంచులకు చలి

చలి కాలంలో పొగ మంచులకు చలి కాచుకోవడం వీలు కాకపోతే
మేధస్సులో సూర్య కిరణ భావాన్ని దివ్య తేజస్సుతో వెలిగించుకోండి
మేధస్సులో ఉత్తేజాన్ని శరీరంలో కదలికను శ్వాసలో సూర్య భావాన్ని
ఆహారంలో అగ్నిని తలచి దేహాన్ని విశ్వ జ్యోతిగా ధ్యానింపజేయండి
విశ్వ శక్తిలో కాల ప్రభావాలకు నీవు ఓ మాత్ముడిలా నా విశ్వ భావన

సూర్యునిలో నీవు ఓ కిరణాన్నే

సూర్యునిలో నీవు ఓ కిరణాన్నే చూడగలిగితే నీ నేత్రం దివ్యమైనది
చంద్రుని కాంతిలో ఓ వలయమే చూడగలిగితే నీ నేత్రం పవిత్రమైనది
నక్షత్ర తేజస్సులో ఓ కోణ ప్రకాశాన్నే చూడగలిగితే నీ నేత్రం విశిష్టమైనది
నా భావాలలో ఓ భావన గుణాన్ని చూడగలిగితే నీ నేత్ర మేధస్సు విజ్ఞానమైనది

ఏ భావనను మరచిపోవద్దు ఏనాటికి

ఏ భావనను మరచిపోవద్దు ఏనాటికి విశ్వాన్ని విడిచిపోవద్దు
ప్రతి భావనలో విశ్వ స్థితిని గమనిస్తూ విశ్వ స్వభావాన్ని గ్రహించు
కొన్ని దివ్య భావనలలో మహా విశ్వ తత్వాలు నిన్ను మార్చేస్తాయి
నీ మేధస్సులో దాగిన అజ్ఞాన మలినాన్ని తొలగించి విధాతగా మార్చేస్తాయి
నీకు విధాత భావన కలగాలంటే నీవు చూడలేని కిరణాన్ని వెంబడించు

జీవుల సంఖ్యలో జన సంఖ్య అధికమైతే

జీవుల సంఖ్యలో జన సంఖ్య అధికమైతే విశ్వం వివిధ కాల ప్రభావాలతో
కొన్ని జీవుల రూపాలు ఆనాటికి ఈనాటికి ఎన్నో కనుమరుగైపోయాయి
మరి కొన్ని జీవులు విస్తృతమై అధిక సంఖ్యలో రక రకాలుగా జీవిస్తున్నాయి
జన సంఖ్యలో సమస్యలు ఇంట్లో సమాజంలో తీరనివైతే జీవితం విషాదమే

ఇంటికి వాస్తు ఉన్నదో లేదో

ఇంటికి వాస్తు ఉన్నదో లేదో ఆలోచిస్తున్నాము
కొత్త ఇంటికైతే అన్ని విధాల వాస్తును గమనిస్తున్నాము
మన కార్యాలు ఏవి ఫలించకపోతే ఇంటి వాస్తు సరిగ్గా లేదేమోనని అనుకుంటాము
వాస్తు లేనందున కాలం కూడా కలిసి రావటం లేదోమోనని ఆలోచిస్తూనే ఉన్నాము
వాస్తు బాగుందంటే ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాము ఏ స్థాయికి ఎదుగుతున్నాము
వాస్తు బాగున్నా ఆలోచనలలో సరైన విధానం లేకపోతే కాలం కలిసి రాదు కదా
ఓ కార్యానికి కావలసిన ఆలోచనల సామర్థ్యం మనలో లేకపోతే వాస్తు ప్రభావమేమిటి
మేధస్సుకు ఏ వాస్తు ఉన్నది ఏ ఆలోచనలలో వాస్తులు ఉన్నవి తెలుపగలరా
మేధస్సుకు వాస్తు అవసరమైతే మనిషి ఇక చలించడేమోనని అనిపిస్తుంది
వాస్తు అవసరమైతే ఆ విధంగా ఇంటిని నిర్మించుకోండి లేకపోతే గొప్పగా ఆలోచించండి
ప్రతి ఒక్కరు గొప్పగా మహా భావాలతో ఆలోచిస్తే జీవిస్తే జీవితం ప్రశాంతంగా సాగుతుంది
వాస్తు ఉండడం లేకపోవడం కాల నిర్ణయమే కావచ్చు ఆలోచనల ప్రభావం ఉండవచ్చు
విశ్వానికి వాస్తు ఉన్నదా ప్రకృతి ప్రదేశాలకు వాస్తు లేకపోతే సరి చేయడం వీలవుతుందా
వాస్తు వున్నా లేకున్నా సూర్య చంద్రులు మహా శక్తి భావాలతో విశ్వాన్ని జీవింపజేస్తున్నారు

సూర్యోదయ కిరణాల లోనే పరమాత్మ

సూర్యోదయ కిరణాల లోనే పరమాత్మ భావాలు దివ్యమైనవి
పరమాత్మను ప్రతి రూపంగా దర్శించడం ప్రకృతి ప్రదేశాలలోనే
చంద్రోదయ నక్షత్రాలను తిలకించడంలోనూ పరమాత్మ భావమే
ఆకాశాన్ని ఏ సమయాన ఎలా మేఘ వర్ణాలతో తిలకించినా దివ్యత్వమే
ఆకాశంలో కనిపించే దివ్య వర్ణ భావాలు ఎందరికో తెలియలేకపోతున్నాయి

కావలసిన వారికి కోరినవి అందక కోరిన

కావలసిన వారికి కోరినవి అందక కోరిన వారికి కావలసినవి అందక
కోరుకోలేకున్నా కొందరికి కావలసినవి కోరుకోక ముందే వచ్చేస్తున్నాయి
కోరినవి అందని వారు చాలా తక్కువ స్థాయికి సంభంధించినవి కోరుకుంటారు
కావలసినవి ఉన్న వారు మరెన్నో కొత్త కోరికలతో కోరుకుంటూనే ఉన్నారు
కోరిక లేకపోతే జీవితం లేదేమో కోరుకోవడమే మేధస్సులో ఆలోచనగా
అప్పుడప్పుడే తీరేవి కొన్నైతే దీర్ఘ కాలంగా తీరేవి తీరక పోయేవి మరెన్నో
మేధస్సులో అన్వేషణ ఆశతో మొదలైనా అతిశయోక్తిగా ప్రయాణిస్తుంటుంది

మహా వర్ణాలుగల జీవి మరణించినదంటే

మహా వర్ణాలు గల జీవి మరణించినదంటే తన దివ్య భావాలు విశ్వమున ఇక లేవనే
దివ్య భావాలు లేకపోతే విశ్వమున మహా గుణాలు ఎవరికి తెలియకుండా పోతాయేమో
ఎవరికి తెలియని దివ్య భావాలు మహా స్వభావాలతో నా మేధస్సుననే దాచుకుంటున్నా
అత్యంత మహా వర్ణాలు గల జీవుల భావాలు నా మేధస్సులో దివ్యత్వంతో విజ్ఞానమైనవి

Thursday, December 23, 2010

ఎన్నో మేధస్సులోనే చేరుతున్నాయి

ఎన్నో మేధస్సులోనే చేరుతున్నాయి
ఏవేవో ఇష్టం లేనివి ఇష్టమైనవి ఎన్నెన్నో మేధస్సులో
అర్థమైనవి అర్థం కానివి గ్రహించినవి గ్రహించ లేనివి
అజ్ఞానమైనవి విజ్ఞానమైనవి తెలిసినవి తెలియనివి
ఏవి ఎప్పుడు ఎలా ఉపయోగపడుతాయో మేధస్సుకు తోచునా
ఎవరికి ఉపయోగపడునో నేను ఎవరికి దేనిని అందించగలనో
అన్నీ కాల నిర్ణయమే లేదా నా మేధస్సు ప్రభావమే
మీకు కావలసిన భావాలు నాలో ఉంటే తెలుసుకోండి ఎలాగైనా

అలసటతో ఆలోచిస్తూ మేధస్సులో

అలసటతో ఆలోచిస్తూ మేధస్సులో ఉత్తేజం లేక కార్యాలు సాఫీగా సాగలేకపోతున్నాయి
ఉత్తేజం లేని మేధస్సుతో శక్తి సామర్థ్యాలు తగ్గి కార్యాలలో లోపాలు కనిపిస్తున్నాయి
ఆకలి కాదు దాహం కాదు మానసిక ఆలోచనలతో అలసట చెంది ఉత్తేజం తగ్గుతున్నది
మేధస్సులో ఉత్తేజం ఉన్నంత వరకే కార్యాలలో నైపుణ్యం అనుభవాలు కనిపిస్తాయి
మేధస్సులో ఉత్తేజం లేకపోతే కాస్త విశ్రాంతి లేదా కొంత ఆహార శక్తిని తీసుకోండి
శక్తితో ఉత్తేజంగా ఆలోచిస్తూ మానసిక సమస్యలను మరచి కార్యాలతో సాఫీగా సాగండి

Wednesday, December 22, 2010

విశ్వం ఏకీభవిస్తేనే మహా గొప్ప కార్యాలు

విశ్వం ఏకీభవిస్తేనే మహా గొప్ప కార్యాలు త్వరగా సాఫీగా సాగుతాయి
కాలం ఎన్నో సమస్యలను దాటుకుంటూ దివ్య కాలాన్ని అన్వేషిస్తుంది
మనం అనుకున్న సమయాన్ని దాటేస్తూ మరో సమయాన్ని సూచిస్తుంది
ఆలోచనగా అనుకుంటూ ఉంటేనే కార్యాలపై పట్టు వస్తుంది లేదంటే ఆగిపోతాయి

సూర్యోదయ కిరణాలకు మేధస్సులో

సూర్యోదయ కిరణాలకు మేధస్సులో విశ్వ కణ భీజములు చిగురిస్తున్నాయి
విశ్వ కణ భీజములు విశ్వ భావ స్వభావాల విచక్షణత్వాన్ని తెలుపుతున్నాయి
విశ్వ కణాలలో దాగిన విజ్ఞాన భాష ఆత్మ తత్వాలకే నని నా భావ సందేశము
సూర్య కిరణాలు విశ్వ తత్వాలు ఆత్మకు జీవ స్వభావాలు నా మేధస్సుకు తేజములు

నేను జీవించే జీవితం ఇది కాదేమో

నేను జీవించే జీవితం ఇది కాదేమో మరోలా జీవించాలేమో
ఏ కార్యాలతో ఏ భావాలతో ఎక్కడ ఎలా ఎవరితో జీవించాలో
మరో జీవితంలో నేను జీవించే విధానం ఎలా ఉంటుందో
జీవితం ఎలా ఉన్నా నా మేధస్సు విశ్వ విజ్ఞానమే ఉండాలని

Tuesday, December 21, 2010

మనిషి సృష్టించే వాటిలోనే విశ్వ

మనిషి సృష్టించే వాటిలోనే విశ్వ భావాలున్నాయి
భావాలలోనే విశ్వ స్వభావ గుణ తత్వాలున్నాయి
విశ్వ సృష్టిలో విశ్వ భావాలతో జీవులుగా అవతరించాము
విశ్వ జీవులుగా విశ్వ భావాలతో ఎన్నో సృస్టిస్తున్నాము
విశ్వం సృస్టించేవన్నీ సహజమైన ప్రకృతి తత్వ రూపాలు
మనం సృస్టించేవన్నీ కృత్రిమమైన గుణ భావ రూపాలు

విశ్వ భాషలో పదాలు లేవా భావ

విశ్వ భాషలో పదాలు లేవా భావ స్వభావాలు మాత్రమేనా
విశ్వ భావ స్వభావాలు ఎవరికి తెలియును విశ్వ భాష ఎవరికి అర్థమగును
పదాలు లేని భాష పరమాత్మ తత్వ భావ స్వభావాలే నని నా మేధస్సులో
జగతిలో పదాలు లేని భాష విశ్వ భాషగా నా మేధస్సులో భావ స్వభావాలు

కాలం కలిగించే భావాలకు నా ఆత్మ

కాలం కలిగించే భావాలకు నా ఆత్మ రూప స్వభావాలేవో
స్వభావాలలో రూప భావాలకు అర్థాలు ఎవరు గ్రహించెదరో
అర్థాలు గ్రహించే భావాలు ఎవరి మేధస్సుకు తెలియును
నా రూప స్వభావాలను విశ్వ తత్వాలు స్వీకరిస్తున్నాయి

ఎక్కడ విశ్వ విజ్ఞానం ఎలా లోపిస్తున్నదో

ఎక్కడ విశ్వ విజ్ఞానం ఎలా లోపిస్తున్నదో గ్రహించండి
లోపాలను తెలుసుకొని వాటి మరమత్తులను వెంటనే చేపట్టండి
మేధస్సులో అజ్ఞానం ఉంటే చేసే పనులలో లోపాలు ఏర్పడుతాయి
తెలియక పోవటమే అజ్ఞానం తెలుసుకోలేక చేయటమే లోపం
తెలుసుకుంటూ చేయటమే అనుభవం అనుభవమే విజ్ఞానం
విజ్ఞాన అనుభవాన్ని మరో కోణంలో ఆలోచించటమే విశ్వ విజ్ఞానం
విశ్వ విజ్ఞానాన్ని ప్రాపాంచికంగా ఆధ్యాత్మకంగా విశదీకరించవచ్చు
ప్రాపాంచికంగా ఆలోచిస్తే లోక జ్ఞానం ఆధ్యాత్మకంగా ఐతే విశ్వ విజ్ఞానం
విశ్వ విజ్ఞానంగా ఆలోచించి సాగితే అజ్ఞాన లోపాలు తగ్గి పోతాయనే నా భావన

విశ్వ విజ్ఞానం ఎవరి మేధస్సులో ఉందో

విశ్వ విజ్ఞానం ఎవరి మేధస్సులో ఉందో అన్వేషించండి
ఏ మేధస్సులో ఎలాంటి విజ్ఞానం ఉందో తెలుసుకోండి
ఎలాంటి విశ్వ భావాలతో విశ్వ విజ్ఞానాన్ని కలిగివున్నారు
ప్రతీది క్షుణ్ణంగా తెలిసియున్నదా లేదా అరకొరయేనా
విశ్వ విజ్ఞాన మేధస్సు మరణించక ముందే అన్వేషించండి
విశ్వ మేధస్సుతో ఎన్ని మహా అద్భుత విషయాలు తెలుస్తాయో

నీవు ఒక్కడివే విశ్వ విజ్ఞానివైతే

నీవు ఒక్కడివే విశ్వ విజ్ఞానివైతే నీ విజ్ఞానమునకై ఎవరెవరు ఎందరు వస్తారో
నీ విజ్ఞాన భావాలను తెలుసుకొనుటకు ఎందరో మేధావులు తరలి వస్తారు
మహాత్ములు యోగులు లోక జ్ఞానులు శాస్త్రీయులు ఎందరో కదిలి వస్తారు
నీలోని గుణ జ్ఞాన విశ్వ భావ స్వభావాలకు ముగ్ధులై అసంఖ్యాక జనులెందరో

సూర్యుని కిరణాల వెలుగులు

సూర్యుని కిరణాల వెలుగులు విశ్వమున ఎక్కడెక్కడ చేరుతున్నాయి
ఎంతటి మహా దివ్య రూపాములు సూర్యుని కిరణాలు తాకుతున్నాయి
సూర్య కిరణాలతో కొన్ని దివ్య రూపాలకు విశిష్ట పవిత్రత ఏర్పడుతుంది
సూర్య కిరణాల పవిత్రతతో విశిష్ట వలయాలు దైవత్వాన్ని స్వీకరిస్తాయి
దైవత్వం ఉన్న చోట విశ్వ భావాలు ఆత్మ శుద్దితో విశిష్టంగా ఉంటాయి
సూర్యోదయ కిరణాలతో దివ్యంగా ధ్యానిస్తూ ఆత్మను శుద్ధి చేసుకో

నీ మేధస్సుతో ఆలోచించకు విశ్వ

నీ మేధస్సుతో ఆలోచించకు విశ్వ మేధస్సుతో ఆలోచించు
నీ మేధస్సుతో ఆలోచించుటలో అన్నీ సమస్యల వలయాలే
విశ్వ మేధస్సులో విశ్వ రూప మహా జ్ఞాన విజ్ఞాన భావాలే
విశ్వ మేధస్సుతో జీవిస్తే నీ ఆత్మలో విశ్వ విజ్ఞాన ధ్యాసయే

నీ మేధస్సు కణాలలో విశ్వ విజ్ఞాన

నీ మేధస్సు కణాలలో విశ్వ విజ్ఞాన భీజములు దాగి ఉన్నాయి
ఆత్మ ధ్యాసతోనే ధ్యానమున విశ్వ ఎరుకతో భీజములు ఎదుగును
విశ్వ భీజములు విస్తరించుటలో నీలో విశ్వ విజ్ఞానము వృక్షమగును
విశ్వ వృక్షముతో నీ మేధస్సులోనే ప్రతి విశ్వ రూప విజ్ఞానములు చేరును
కేవలం లోక జ్ఞానంతో కణాలలో దాగిన విశ్వ విజ్ఞాన భీజములు ఎదగలేవు
పరమాత్మ స్వభావంచే ఆత్మ ధ్యానమున విశ్వ భీజములలో జీవం కలుగును

ఆత్మ ధ్యాసలో లోక జ్ఞానమే కాదు విశ్వ

ఆత్మ ధ్యాసలో లోక జ్ఞానమే కాదు విశ్వ విజ్ఞానం కూడా తెలియును
దివ్యమైన ఎరుక ఉంటే ఆత్మ ధ్యాసలోనే విజ్ఞానం చేరుతూ ఉంటుంది
విశ్వమున ఎక్కడున్నా ఆత్మ పరంపరలలో విజ్ఞానాన్ని అన్వేషిస్తాయి
ధ్యాస విశ్వమున ఉంచితే విజ్ఞానం మేధస్సులో చేరుతూనే ఉంటుంది
ఆత్మ ధ్యాసలేని మేధస్సు లోక జ్ఞానంతో సతమతమౌతూనే ఉంటుంది

నీ ఆత్మ విశ్వ విచక్షణ తత్వ భావ

నీ ఆత్మ విశ్వ విచక్షణ తత్వ భావ స్వభావాలతోనే నిర్మితమైనది
నీకు తెలియని భావన లేదు స్వభావమైనను లేదని తెలుసుకో
ప్రతి విశ్వ రూప భావ స్వభావ తత్వాలు నీలోనే దాగి ఉన్నాయి
మేధస్సు కణాలలో ప్రతి భావన ఉన్నట్లు ధ్యానించుటలో గ్రహిస్తావు

నీ మేధస్సు కణాలలో విశ్వ రూప

నీ మేధస్సు కణాలలో విశ్వ రూప భావాలు దాగి ఉన్నాయి
కణాలను మేల్కొల్పే స్వభావాలు నీ ఆత్మలోనే ఉన్నాయి
ఆత్మను ధ్యానింపజేసి కణాల విశ్వ రూప స్వభావాలను మేల్కొల్పు
నీ మేధస్సులోనే మహా అద్భుత విశ్వ రూపాలను ఎన్నో చూడవచ్చు

మేధస్సు ఇక్కడున్నా ఆలోచనలు

మేధస్సు ఇక్కడున్నా ఆలోచనలు సమాజంలో అన్వేషిస్తున్నాయి
ఏదో తెలుసుకోవాలని ఏదో చేయాలని ఎంతో నేర్చుకోవాలని ఎన్నో
మేధస్సులో ఎన్నో ఆలోచనలతో విజ్ఞానం కోసం సమాజంలోనే
సమాజంలోనే విజ్ఞానాన్ని గ్రహించి సమాజాన్నే బాగు చేయాలని

ఎంత చదివినా ఇంకా చదవాలనే గాని

ఎంత చదివినా ఇంకా చదవాలనే గాని కాలం కూడా ఆగటం లేదు
కాలంతో మనం విజ్ఞానంగా సాగాలని ఎంత చదివినా ఇంకా ఎంతో
ప్రతి క్షణం ఏదో ఓ కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నా ఇంకా ఎన్నో
విజ్ఞానానికి అంతం లేదు మన మేధస్సు సామర్థ్యానికి అవధులు లేవు
కాలమే విజ్ఞానంగా ఎంతో నేర్చుకుంటూ ప్రతి రోజు సాగుతూ పోతున్నది

ఎవరిలో ఏ భావాలు కలిగినా నీలో

ఎవరిలో ఏ భావాలు కలిగినా నీలో నీవు నీ భావనతోనే ఉండు
ఎదుటి వారిలో అరిషడ్వర్గాల భావాలు కలిగినా నీలో విజ్ఞాన భావన ఉండాలి
నీ విజ్ఞాన భావాలకు తగ్గట్లుగా ఎదుటివారు మారేలా నీవు నిలకడగా ఉండాలి
నిన్ను చూసి వారు నేర్చుకునేలా మారిపోయేలా నీలో సహన గుణాలు ఉండాలి
ఓర్పు నీలో ఉన్నంతవరకు ఓదార్పు ఎదుటివారిలో కలుగుతుందని భావించు

నీకు సమస్యను కలిగించే వ్యక్తిపై

నీకు సమస్యను కలిగించే వ్యక్తిపై ద్వేషాన్ని పెంచుకోకు
ఆ సమయాన నీకు సమస్యపై ద్వేష భావాలు కల్గవచ్చు
భావాలు కలిగినంత మాత్రాన ద్వేషాన్ని మేధస్సున దాచుకోవద్దు
భవిష్యత్లో నీకు తాను మరోల ఎంతో ఉపయోగపడతాడు ఆలోచించు
నీలో స్నేహ గుణం ఉంటే నీకు మంచి సలహాలు ఉజ్వల భవిష్యత్ ను కల్పిస్తాడు
నీకు ప్రతి ఒక్కరు మార్గ దర్శకులే వివిధ సమస్యలపై వివిధ రకాలుగా స్పందిస్తారు
కాల ప్రభావాల వలన సమస్యలపై ఎన్నో భావాలు మీలో వారిలో కలుగుతూనే ఉంటాయి
ద్వేష భావాలు లేవంటే శత్రు భావాలు లేనట్లే అలా ఎన్నో భావాలు లేకపోతే తేడాలే కనిపించవు
సమయానికి ఏవి జరగాలో అలా కాలంతో జరిపోతుంటాయి మనం నిమిత్తులం మాత్రమే
మనకు ద్వేష భావాలు కలిగించినంత మాత్రాన అందరికి శత్రువు కాదు
మరొకరికి మిత్రుడిలా ఎందరికో ఎన్నో విధాల ఎన్నో భావాలను కలిగిస్తాడు
ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఎన్నో భావాలను ఎందరికో కలిగిస్తూ జీవిస్తున్నారు

Monday, December 20, 2010

ఇంకా ఏయే భావాలతో జీవించవలసి

ఇంకా ఏయే భావాలతో జీవించవలసి వస్తుందో
భవిష్య కాలానికి కాల ప్రభావాలు ఎలాంటివో
ఇష్టంలేని భావాలతో జీవించడం కాల ప్రభావమే
కాల ప్రభావాలకు జీవించడం మేధస్సుకు పరీక్షయే
నేడు కాల ప్రభావాలు ఎన్నో విధాల తారుమారవుతున్నాయి

మేధస్సుకే తెలియని క్షణ భావాలతో

మేధస్సుకే తెలియని క్షణ భావాలతో జీవించడం ఎరుకకు కష్టమే
అర్థం కాని ఆలోచనలు అర్థమేలేని భావాలు విజ్ఞాన లోప స్వభావాలు
ఏం చేయాలో తోచదు ఏ నిర్ణయాన్ని తీసుకోలేం దేనిని గ్రహించలేం
కొన్ని సమయ క్షణాలు అర్థం కానివి ప్రతి వారిలో కలుగుతుంటాయి
వీలైనంత త్వరగా ఇలాంటి క్షణాల ఆలోచనలను వదులుకోవాలి
అజ్ఞానం కలగడానికి ఇలాంటి క్షణాలు అప్పుడప్పుడు కలుగుతుంటాయి

ఓ తండ్రీ! నీ రూప భాగాలు చక్కగా

ఓ తండ్రీ! నీ రూప భాగాలు చక్కగా ఉన్నాయి మరి నాకెందుకు ఈ శిక్ష
కాళ్ళు చేతులు వంకరగా దృష్టి మరో వైపు వినికిడి మరో చోట ఎందుకిలా
నా అవయవాల లోపం ఏమిటి నడవలేను ఏ పని చేయలేను ఇది కర్మేనా
జీవ కణంలో ఉన్న లోపమా బ్రంహాండంలో జరిగిన కాల గ్రహ ప్రభావాలా
జన్మించుటచే కర్మ ఆరంభమైతే జీవితమంతా విషాద విశ్వ కాల పరీక్షయే
ఇలా ఎందరో జగతిలో ఎన్నో లోపాలతో జీవించడం గత జన్మ పాప కర్మలేనా
నిత్యం ఒకరిపై ఆధారపడి జీవించడం నా మేధస్సుకు కూడా తెలియకపోతున్నది
ఆలోచన భావాలు లేక స్వభావాలు తెలియక జగతిలో అనామకుడిలా జీవిస్తున్నా

ఓ మానవా! ఈ విశ్వ జీవిని పరిచయం

ఓ మానవా! ఈ విశ్వ జీవిని పరిచయం చేసుకో
నేను నీలా స్వేచ్ఛగా జీవించాలని అనుకుంటున్నా
నాకు విశ్వాన్ని పరిచయం చేసి విశ్వ ప్రదేశాలను చూపించు
నాకు కాస్త విశ్వ విజ్ఞానాన్ని కలిగించు జీవించుటకు అవరమవుతుంది
విశ్వ రూప భావ స్వభావాలపై ఎరుక కలిగించు ఏది దేనికి అవసరమగునో
నేను జీవించడానికి కావలసిన వస్తువలను పదార్థాలను తెలుసుకుంటా
నా వారు కన్నా నీవు గొప్ప ఆత్మ జ్ఞానివని నీతో విజ్ఞానాన్ని పంచుకుంటున్నా

నీవు సంతోషంలో ఉన్నావంటే ఎన్నో

నీవు సంతోషంలో ఉన్నావంటే ఎన్నో కార్యాలను మరచిపోయావనే
మరచిపోయిన కార్యాలు నీకు సమస్యలుగా మారుతూ వస్తాయి
సమస్యలతో సతమవుతూ మళ్ళీ మరెన్నో సమస్యలతో సాగిపోతావు
సంతోషంలో కూడా మరచిన కార్యాలను ఆలోచిస్తే మేల్కొంటావు
కార్యాలను ఆలోచించుటలో భవిష్య ప్రణాళికలు విజ్ఞానంగా ఉంటాయి
భవిష్య ప్రణాళికలతో సాగిపోతుంటే సమస్యలు తీరుతూ సాగిపోతాయి

ఆత్మ ధ్యానమంటే బాహ్య ప్రభావాలకు

ఆత్మ ధ్యానమంటే బాహ్య ప్రభావాలకు శరీరం కదలని స్థితి
ఉచ్చ్వాస నిచ్చ్వాసాలకు మాత్రమే అంతర ప్రభావాలకు చలిస్తుంది
శిల్పంలో ఉండే తటస్థ భావనతో ధ్యానిస్తూ విశ్వాన్ని ఏకీభవించడం
పంచభూతాల స్వభావ ప్రభావాలు విశ్వామృతమై ఆత్మలో చేరిపోతాయి
ఆత్మ ధ్యానంలో కలిగే విచక్షణ భావాలు మేధస్సును విజ్ఞానపరుస్తాయి

నా మేధస్సు విశ్వమై విశ్వంలో విశ్వ

నా మేధస్సు విశ్వమై విశ్వంలో విశ్వ విజ్ఞానంగా జీవిస్తుంది
మేధస్సులో విశ్వ విజ్ఞాన ఆత్మ భావాలు కలుగుతున్నాయి
ఆత్మ భావాలతోనే మేధస్సు విశ్వమై విజ్ఞానంగా జీవిస్తున్నది
ఆత్మ భావాలలో ఉన్న సంతృప్తి ఏ కార్య భావాలలో లభించవు

చల్లని సూర్యోదయ కిరణాల ప్రకృతిలో

చల్లని సూర్యోదయ కిరణాల ప్రకృతిలో ధ్యానించు
నీ శరీరంలో ఆత్మ పొందే విశ్వ తత్వ భావాలు అమృతం
ఓ వైపు శరీరం చలి కాచుకున్నట్లు ఆత్మ ఉత్తేజమైనట్లు
ఆత్మ ఉత్తేజంలో కలిగే విశ్వ రూప భావ స్వభావాలు దైవత్వమే
దైవత్వ భావాలతో దేహం హిమములా విశ్వ పర్వతమవుతుంది
విశ్వ పర్వతమే కైలాస శిఖరమై మహా ధ్యానంతో ఆత్మ ప్రకాశిస్తుంది

నేటికి ఏనాటికైనా ఒక్క భావన చాలు

నేటికి ఏనాటికైనా ఒక్క భావన చాలు 'మంచి జరగాలని'
ప్రపంచాన్ని మార్చాలనే ఒక్క విజ్ఞాన భావన చాలు
ప్రతి ఒక్కరు విశ్వ విజ్ఞానంతో జీవించాలనే భావన చాలు
ప్రతి జీవి ఆత్మ బంధువేనని జీవ హింస లేని భావన చాలు
ప్రతి ప్రదేశాన్ని శుభ్రతగా ఉంచాలనే ఒక్క భావన చాలు
ప్రతి మనిషిలో మంచి అలవాట్లే ఉండాలనే భావన చాలు
ప్రతి ప్రణాళిక క్రమ కార్య కారణ విధానంతో జారగాలనే భావన చాలు
ప్రతి మనిషిలో సత్యమేవ జయతే అనే భావన చాలు
ప్రతి జీవికి మంచి జరగాలనే భావన చాలు
ప్రతి వస్తువును సద్వినియోగం చేసుకోవాలనే భావన చాలు
మీలో ఒక్క హిత భావన ఉంటే చాలు విశ్వ సమాజం సస్యశామలమే
హిత భావనను సంకల్పంతో సమాజానికి విజ్ఞానంగా తెలియజేయండి

ఆరోగ్యానికి ఆహారమే అమృతం

ఆరోగ్యానికి ఆహారమే అమృతం అనారోగ్యానికి ఆహారమే విషం
ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ ఆహారాన్నైనా తీసుకోగలం
అనారోగ్యమైతే పలానా రోగానికి పలానా ఆహారం తీసుకోరాదంటారు
రోగాలు శరీరానికి విషపూరితమై ఆహారం కూడా రుచించవు
ఆరోగ్యంతో జీవించేందుకు ప్రయత్నించు అమృత భావాలతో జీవిస్తావు

నా శరీరంలో ఆహారం ఆత్మ పదార్థంగా

నా శరీరంలో ఆహారం ఆత్మ పదార్థంగా మారుతున్నది
ఆత్మ పదార్ధం ఆత్మ తత్వ భావాలను తెలుపుతున్నది
శరీరాన్ని నిలిపేందుకు ఆహారమైతే శ్వాసను నిలిపేందుకు ఆత్మ పదార్థమే
ఆహారమే వివిధ అవయవాలలో జీవ తత్వ శక్తి పదార్థాలుగా మారుతున్నది

నేటి సమాజంలో పరమ హంస ధ్యాస

నేటి సమాజంలో పరమ హంస ధ్యాస ఎవరికి ఉన్నది
ఎవరికి ఎంత విజ్ఞానం ఉన్నా కార్యాలలో కాస్త అజ్ఞానమే
ధ్యాన గుణము లేనిదే హంస ధ్యాస భావన రాదు కదా
ఆత్మ భావనతో ధ్యానిస్తే శ్వాసలో పరమ హంస ధ్యాసే
ఆత్మ భావాలతో జీవించే వారు సమాజంలో అరదు

పర ధ్యాస నుండి పరమ హంస ధ్యాస

పర ధ్యాస నుండి పరమ హంస ధ్యాస కలిగే వరకు నీలో అజ్ఞానమే
పర ధ్యాస ఎరుక లేనిది పరమ హంస ధ్యాస ఎరుకతో కలిగి ఉండేది
చిన్న నాటి అజ్ఞాన విజ్ఞాన కార్యాలు మనకు గుర్తు లేకనే పర ధ్యాస
విజ్ఞానంతో మనకు గుర్తుండిపోయే కార్యాలోచనలే పరమ హంస ధ్యాస
పరమ హంస ధ్యాస ఆత్మ జ్ఞానంతో కలిగే మహా విశ్వ విజ్ఞాన ఎరుక
పర ధ్యాసతో జన్మించినా పరమ హంస ధ్యాసతో విజ్ఞానివై మరణించు

ప్రతి జీవి జన్మించిన తర్వాత ఎదిగే వరకు

ప్రతి జీవి జన్మించిన తర్వాత ఎదిగే వరకు పర ధ్యాసలోనే
తమకు తాము ఆలోచించే వరకు భావార్థాలు తెలిసేవరకు
ప్రతి జీవి తనకు తానే ప్రతి కార్యాన్ని చేసుకునే వరకు పరధ్యాసే
ఓ విషయాన్ని తప్పు లేదా ఒప్పు అనే విధంగా తెలుసుకునే వరకు
విషయాన్ని భావాలతో స్వత మేధస్సుతో ఇతరులతో వివరించే వరకు
ప్రతి కార్యంపై ఓ విజ్ఞాన ఆలోచనతో భవిష్య అనుభవం కలిగే వరకు
పరధ్యాస నుండి పరమ హంస ధ్యాస కలిగే వరకు భావార్థాలు తెలియవనే

విశ్వ భాషలో పరమ హంస భావాలు

విశ్వ భాషలో పరమ హంస భావాలు ఎన్నో
విశ్వ భాష ఓ ఆత్మ భావ స్వభావ తత్వ జ్ఞానం
భావ స్వభావాలలో ఉన్న అర్థమే హంస గుణం
హంసలో విజ్ఞాన హిత భావమేనని ధర్మ శాస్త్రం

కైలాసంలో శివుడు ధ్యానిస్తూ

కైలాసంలో శివుడు ధ్యానిస్తూ విశ్వ భావాలను సేకరిస్తున్నాడు
అందులో నేను కొన్ని భావాలను నా మేధస్సులో సేకరిస్తున్నా
విశ్వ విజ్ఞాన ఆత్మ తత్వ భావ స్వభావాలు మేధస్సుకు ఉత్తేజం
మేధస్సును ఉత్తేజ పరిచేందుకే విశ్వ రూప భావాల ఆత్మ విజ్ఞానం

ఆలోచనలలో భావాన్ని గ్రహించలేకపోతే

ఆలోచనలలో భావాన్ని గ్రహించలేకపోతే ఏ కార్యాన్ని చేయలేవు
ఆలోచనల భావార్థం తెలిస్తేనే ఏ కార్యాన్ని ఎలా చేయాలో తెలుస్తుంది
భావార్థం తెలిసినా చేయలేకపోతే చేయాలనే ఆలోచన కలగలేదనే
ప్రతి సూక్ష్మ ఆలోచన మేధస్సులో కలిగి స్పందిస్తేనే కార్యాన్ని చేయగలం
ప్రతి ఆలోచనకు స్పందన భావార్థం ఉంటేనే కార్యాలు త్వరగా సాగిపోతాయి

కదిలే కాలానికి సూర్య చంద్రలే

కదిలే కాలానికి సూర్య చంద్రలే నిదర్శనం
విశ్వ కాలానికి ఆకాశమే ప్రతి రూప భావం
భూ భ్రమణమే విశ్వ కార్యాలకు నిదర్శనం
జీవుల తరతరాలే ఆనాటి కాలానికి నేటికి కాల విజ్ఞానం
ఇంకా ఎన్నో విశ్వ రూపాలు విశ్వ కాలానికి నిదర్శనమే

ప్రతి రోజు కనీసం ఓ విశ్వ భావాన్నైనా

ప్రతి రోజు కనీసం ఓ విశ్వ భావాన్నైనా ఆకాశాన సేకరిస్తా
మేధస్సులో కూడా ఓ విశ్వ భావాన్ని అన్వేషణతో సేకరిస్తా
ఆలోచనలతో భావాలను స్వభావాలను ప్రతి రోజు సేకరిస్తా
భావాలు నాలో కలగకపోతే విశ్వ కాల సమయం వృధా ఐనట్లే
విశ్వంలో కలిగే భావ స్వభావ తత్వాలు నాలో కలగానే అన్వేషణ
నా మేధస్సులో ప్రతి భావన ఆత్మ ధ్యాసతో చేరిపోతుంది

నీవు లేనప్పుడు నీ ప్రదేశంలో ఏవైనా

నీవు లేనప్పుడు నీ ప్రదేశంలో ఏవైనా అజ్ఞాన కార్యాలు జరగి ఉంటే
నీవు మరల ఆ ప్రేదేశానికి వెళ్ళేటప్పుడు మెలకువతో వేచి ఉండాలి
నీ వారు ఉన్నా పక్కింటి వారు గాని తెలియని వారు గాని ఎవరైనా
ఎవరు చూడని సమయంలో ఏదో దొంగలించడం విరగొట్టడం చేస్తారు
తప్పు జరిగేటప్పుడే చూస్తేనే మనం వారిని పట్టుకోగలం ప్రశ్నించగలం
వారి అజ్ఞాన కార్యాలకు వారి మేధస్సు ప్రభావాలు విచక్షణ రహితమే
ఎవరు ఏ అజ్ఞాన కార్యాలు చేసినా వారి కర్మ ప్రభావాలు నా మేధస్సులో
అజ్ఞాన కార్యాలతో దొరగా తిరిగినా విశ్వ కర్మతో తప్పించుకోలేరు సుమా
జన్మ జన్మలుగా కర్మ వెంటాడుతూనే ఆత్మను మేధస్సుతో కాల్చేస్తుంది

The Great Writer of universe

The Great Writer of universe -
Who is having great intention of Universe -
What is the intention behind his knowledge -
The Knowledge varies in what/which way -
What he finds and which way to say’s the intention of universe -
He knows something good and had great intention than others -
The knowledge is very curiosity and keen observation of universal events -
He expresses the knowledge in new methodology system through basic procedure -
The Great Writer having intention behind the universe of his mind –

Sunday, December 19, 2010

ఆకాశంలో ఎక్కువ సమయం విహరించే

ఆకాశంలో ఎక్కువ సమయం విహరించే పక్షి గ్రద్ద యేనని నా భావన
గ్రద్ద విహరించే విధానంలో రెక్కలను చాలా తక్కువగా ఆడిస్తుంది
సరదా కలాపాలు ఆహార అన్వేషణ ఇతర కలాపాలు ఆకాశంలో విహరిస్తూనే
గ్రద్ద విహారించునట్లు ఏ పక్షి విహరించదని నేను తిలకించిన విధానం
గ్రద్దలు చాలా ఎత్తులో రెక్కలు ఆడించకుండానే తిరుగుతూ ఉంటాయి
మన మనస్సును గొప్పగా మెప్పించేలా వయ్యారాలతో విహరిస్తాయి
గ్రద్ద విహరించే విధానాన్ని తిలకిస్తే నేనూ అలా విహరించాలనే భావన
గ్రద్ధలా వివిధ రకాలుగా వివిధ విధానాలుగా ప్రయాణించాలానే నా భావన
గాలి పటంలా అలా తేలిపోతూ సమతుల్యతతో విహరిస్తూనే ఉంటుంది
గ్రద్ధ విహరించే విధాన భావ స్వభావాలన్నీ నా మేధస్సులో జ్ఞాపకంగా

Important links

Important links - What you want select for learning Subject or getting Information :
for java - http://roseindia.net/
http://codeglobe.blogspot.com
for Excel - http://chandoo.org/
for Ms office Database Unix & Other - http://www.techonthenet.com/
for Ms offce : http://www.free-training-tutorial.com/
for any - http://www.w3schools.com/
http://coolinterview.com/
for Kids videos : http://kids.nationalgeographic.com
for Sentence forming : http://sentence.yourdictionary.com/
for Universal Spiritual Knowledge(telugu and english) : http://gsystime.blogspot.com
for aptitude questions with answers : http://www.indiabix.com/

మేఘాల పొరలలో ఓ మహా పక్షి

మేఘాల పొరలలో ఓ మహా పక్షి వెళ్ళుతూ మబ్బులకు కనిపించటం లేదు
గాలులకు మేఘ రూపాల పరిణామ ప్రవాహాలలో వివిధ పొరలు మారుతూ
మళ్ళీ కొన్ని గడియలకు మరో దిక్కున నీలి ఆకాశంలో పక్షి కనిపిస్తున్నది
ఎంతో ఎత్తులో వెళ్ళిపోయి సూర్య కిరణాలకు మెరుస్తూ సాగుతున్నట్లున్నది
గమ్యం ఎలాంటిదో ఎక్కడికో ఆ రోజు కార్యాలు ఏమిటో ఆ పక్షికే మహా ఎరుక
మేఘాలలో కనిపించని పక్షుల విహార యాత్ర కలాపాలు నా మేధస్సులోని భావాలే

భావాలలో అమృత స్వభావాలు

భావాలలో అమృత స్వభావాలు మహా దివ్యంగా ఉంటాయి
విశ్వ తత్వాలలో దాగిన ప్రకృతి స్వభావాలు అమరత్వమే
గుణాలలో సూక్ష్మ విచక్షణ గమనాలు ఉంటేనే స్వభావతత్వం
స్వభావాలు తెలిస్తేనే అనంత విశ్వ తత్వాలు తెలియును
మేధస్సులో కణాలను భ్రమింపజేసే భావాలు విశ్వ తత్వాలలోనే
ధ్యాన ప్రభావమున చలించే కణాలు విశ్వ వర్ణాల భావ స్వభావాలే

గృహం కుటుంబానికి సంసారానికి

గృహం కుటుంబానికి సంసారానికి సంబంధించినది
గృహం బయట నుండి పల్లె చివరి (పొలిమేర) వరకు సమాజం
పల్లె బయట నుండి మరో పల్లె బాహ్యం వరకు ప్రకృతి సమాజం
పల్లె సమాజం నుండి మరో సమాజానికి వ్యాపార సత్సంబంధం
పల్లెల నుండి పట్టణాల వరకు జిల్లా అభివృద్ధి వ్యాపార సంబంధ సమాజం
పట్టణాల నుండి నగరాల వరకు రాష్ట్ర అభివృద్ధి వ్యాపార సంబంధ సమాజం
నగరాల నుండి మరో వ్యవస్థాపకుల నగరానికి దేశాభివృద్ధి సంబంధ సంక్షేమం
దేశాల నుండి మరో దేశాలకు అంతర్జాతీయ వాణిజ్య సంక్షేమ విశ్వ చైతన్యం

నేటి సమాజం విశ్వ విజ్ఞానంగా

నేటి సమాజం విశ్వ విజ్ఞానంగా మారాలని అనుకుంటే సరిపోదు
ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తిస్తూ ప్రతి రోజు సాగాలి
ప్రతి కార్యాన్ని విజ్ఞానంతో ప్రతి ఒక్కరు చేసుకుంటూ సాగిపోవాలి
ఏ పని ఎలా ఎప్పుడు చేయాలో విజ్ఞానంగా తెలుసుకొని చేయాలి
ప్రతి ఒక్కరు చదువుకోవాలి అజ్ఞాన అలవాట్లను మానుకోవాలి
శుభ్రతతో జీవిస్తూ ఎలాంటి వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచాలి
సమాజంలో ప్రతి ఒక్కరిని గుర్తించి జీవన విధానాన్ని కల్పించాలి
వృద్దులకు సరైన మార్గాన్ని చూపి సరైన వసతులు కల్పించాలి
శరీర లోపాలు ఉన్నవారికి ప్రాముఖ్యతనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి
ఇంకా ఎన్నో విధాల మంచి పనుల ప్రాముఖ్యతతో విజ్ఞానంగా జీవించాలి

శిరస్సుపై ఉన్న ప్రాంతమున ప్రకృతి

శిరస్సుపై ఉన్న ప్రాంతమున ప్రకృతి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది
ప్రాంతపు ఉష్ణోగ్రత తీవ్రతలు విశ్వ ప్రకృతి ప్రభావాలేవైనా చూపుతాయా
మనకు కలిగే ఆలోచనల భావ స్వభావాలకు శిరస్సుపై ప్రభావమున్నదా
మన మేధస్సుకు శిరస్సు పై ప్రాంతాన విశ్వ ప్రభావాలేవైనా కలుగుతాయా
మన మేధస్సు ఆలోచించే గుణ విచక్షణ భావాలపైననే విశ్వ ప్రభావాలుంటాయి
మేధస్సును ఎలా ఉపయోగించుకుంటే అలాంటి కార్యాల సమస్యలతో సాగుతాం
కార్యాలను సాగించుటలో విశ్వ ప్రాంతపు ఉష్ణోగ్రతలు ప్రభావాన్ని చూపగలవు
శిరస్సు పై కన్నా శిరస్సులోని జ్ఞానేంద్రియాల విచక్షణ ప్రభావాలే ఎక్కువ

ఏ స్వభావాన్ని తెలుపాలన్నా

ఏ స్వభావాన్ని తెలుపాలన్నా దాని భావనను తెలుసుకోవాలి
భావన స్వభావ అర్థాన్ని తెలిపే గుణ విధాన గమన విచక్షణత్వం
ఏ స్వభావాన్ని తెలుపాలన్నా భావనార్థాలు క్షుణ్ణంగా తెలియాలి
పదాల అర్థాలు ఆలోచనల భావాలు తెలిస్తేనే స్వభావాల గుణాలు

వేదికపై చేసుకునే కార్యాలలో

వేదికపై చేసుకునే కార్యాలలో మరణ కార్యం మాత్రం లేదు
అన్నీ శుభ కార్యాలు ప్రసంగాలు వేదికపైననే జరుగుతున్నాయి
శుభ కార్యాలు శుభ్రతగా అలంకారణాలతో ఉత్సాహంగా చేసుకునేవి
మరణం అశుభ్రతగా ఆందోళనతో స్మశానానికి తరలించే నిర్జీవ కార్యం

నా భావాలను తెలుసుకుంటూ

నా భావాలను తెలుసుకుంటూ అవగాహన చేస్తే ప్రతి సందేహం తీరగలదేమో
భావాలను క్షుణ్ణంగా పరిశీలించి సూక్ష్మంగా ఆలోచించి స్వభావాలను గమనించాలి
ప్రతి కార్యం వెనుక ఓ కారణము అలాగే జరిగే విధానంలో కలిగే తీరును తెలుసుకోవాలి
కార్య కారణము తెలిస్తే సమస్యల పరిష్కారాలెన్నో సులువుగా పద్దతిగా సాగిపోతాయి
విశ్వ కార్యాల భావ స్వభావాలను గమనిస్తూ అన్వేషణతో సందేహాలను తొలగించుకోండి

మేల్కొంటున్నాము నిద్రపోతున్నాము

మేల్కొంటున్నాము నిద్రపోతున్నాము ఆలోచిస్తున్నాము భోంచేస్తున్నాము
విశ్వం మేల్కొంటుంది నిద్రపోతుంది భావిస్తుంది శక్తిని మార్చుకుంటుంది
మనలో ఎలాంటి కార్యాలున్నాయో విశ్వంలో ఇంచుమించు అవే కార్యాలు
ప్రతి జీవిలో ఇంచుమించు ఇలాంటి కార్యాలే ప్రతి రోజు జరుగుతూపోతాయి
విశ్వ విజ్ఞానంలో విశ్వ కార్యాలు భావ స్వభావాలు రూప తత్వాలు ఎన్నో
విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకుంటే విశ్వ కార్యాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించవచ్చు

1 నుండి 20 వరకు ఎక్కాల

1 నుండి 20 వరకు ఎక్కాల గుణింతాలను నేర్చుకుంటే సగం గణిత శాస్త్రం వచ్చినట్లే
ఎక్కాలతోనే చాలా వరకు మనం ఎన్నో గణిత సమస్యలను పరిష్కారిస్తున్నాము
కారణ సూత్రాల ద్వార వివిధ సిద్ధాంతాల ద్వార ఎన్నో సమస్యలను పరిష్కారించవచ్చు
తర్క శాస్త్రము తెలిస్తే గణిత శాస్త్రాన్ని ఇంకా చాలా సులువుగా చేయవచ్చు
ఏదేమైనా 1 నుండి 20 వరకు ఎక్కాల గుణింతాలే గణిత శాస్త్రానికి ఆయువు పట్టు
ఎక్కాలు నోటిలోనే వచ్చేటట్లు నేర్చుకుంటే కొన్ని సమస్యల సమాధానాలను అట్లే చెప్పేయవచ్చు

ఏమిటో ఆ భావన శిల్పుల శిల్పకళా

ఏమిటో ఆ భావన శిల్పుల శిల్పకళా నైపుణ్యం మేధస్సులో విచక్షణ కాణాలను భ్రమింపజేస్తున్నాయి
అతుకు లేని విధంగా రాతిలో రత్న కళ భావాలు కలిగేలా అరిషడ్వర్గాలు ఆకాశాన్ని చేరుతున్నాయి
సూది మొనవలే రంధ్రం నుండి గృహ ద్వారం వరకు విశ్వ విచక్షణ కణ గుణాలు శిల్పుల నైపుణ్యంలోనే
అణువంతటి అతుకు లేని రాతి కళా నైపుణ్యం వస్తువుపై ఉన్న మోజుకన్నా వస్తువుపై ఉన్న జాగ్రత్తయే
రాతితో రత్నాల మెరుపులు గృహాలు రథాలు విగ్రహాలు ఎన్నున్నాయో మేధస్సు కణ భావాలకే అంకితం

ఆలోచనలలో విశ్వ విజ్ఞాన భావాలు

ఆలోచనలలో విశ్వ విజ్ఞాన భావాలు లేనందున ఆత్మ స్థితి ప్రభావాలతో అజ్ఞాన చేష్టలు
పరిశుద్ధ పరిపూర్ణ పరిశుభ్రత పవిత్రత భావాలు ఆత్మలో లేనందున వికృత కలాపాలు
ఆలోచనలలో భావ స్పర్శ కణ స్వభావాలు స్పందిస్తేనే ఆత్మ గుణ విచక్షణాలు విస్తరిస్తాయి
ఆత్మ తత్వంలోనే యోగ విజ్ఞాన గుణ స్వభావాలు విశ్వ సంపూర్ణ జ్ఞానాన్ని తెలుపుతాయి
ఆత్మ తత్వాన్ని ఆరా ప్రభావంతో విశ్వ విజ్ఞానంగా పొందటానికి పర ధ్యాస శ్వాస ధ్యానమే

మనిషి ఆత్మలో కర్మ జీవిత ప్రభావాలు

మనిషి ఆత్మలో కర్మ జీవిత ప్రభావాలు ఎలాంటివో వారి భావాలకే తెలుసు
విశ్వ విజ్ఞాన అన్వేషణలో ప్రతి ఆత్మ కర్మ భావాల ప్రభావాలను గ్రహిస్తున్నా
మేధస్సులోని ఆత్మ తత్వాలను పరిశీలిస్తూ ప్రతి జీవి భావాలను గమనిస్తున్నా
కర్మలు ఎటువంటివో ఆత్మ ప్రభావాలను పరిశోధించి క్షుణ్ణంగా తెలుసుకున్నా

గతమంతా పర ధ్యాసలోనే గడిచి పోయి

గతమంతా పర ధ్యాసలోనే గడిచి పోయినట్లుందేమోనని నా భావన
విశ్వ విజ్ఞానం లేక విశ్వ తత్వాలు తెలియక ఆత్మ జ్ఞానాన్ని గ్రహించక
భావ స్వభావాలు తెలియక విచక్షణ గుణాల అర్థాలను తెలుసుకోలేక
ఏ రూపాన్ని సూక్ష్మ పరిశీలన చేయక గత జీవితమంతా పరధ్యాసలోనే
ఆలోచనలతో జీవించడం జీవన కార్యాలతో జీవించడం సామాన్యమే
మేధస్సును ఉజ్వల భవిష్యత్ కై ఉపయోగించడం విశ్వ విజ్ఞానమే
నీ మేధస్సు భావాలే భవిష్య యుగాలకు సంపూర్ణ విజ్ఞానాన్ని అందించాలి

నా విశ్వ భావాలు తెలియకుండానే

నా విశ్వ భావాలు తెలియకుండానే ఎందరో అస్తమించారు
నా భావాలు తెలియాలని ఎన్నో విధాల తెలుపుతున్నాను
మరణం ఆసన్నమయ్యేలోగ విశ్వ విజ్ఞానాన్ని గ్రహించండి
విశ్వ విజ్ఞాన పదం వినపడితే చాలు తెలుకునేందుకు ప్రయత్నించండి
ఎక్కడైన చదివినా ఎవరైనా తెలుపుతున్నా విశ్వ భావాలను గ్రహించండి
విశ్వ విజ్ఞానాన్ని గ్రహించేందుకు ఎన్నో విధాల ప్రయత్నిస్తూ జీవించండి

Saturday, December 18, 2010

విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకుంటే

విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకుంటే మీ మేధస్సుకు ఉజ్వల భవిష్యత్
విశ్వ విజ్ఞానంలో ప్రతీది భావన స్వభావ ఆత్మ జ్ఞాన ఆలోచనత్వం
ఆలోచనలను విశ్వ గుణ భావాలతో గ్రహించడం విశ్వ మూలార్థమే
కార్య కారణార్థం తెలిస్తే చేసే పనిలో విజ్ఞాన విజయ భావ స్వభావాలు
విజయ భావాలు మేధస్సుకు నవ విజ్ఞాన భవిష్య ఆలోచనలుగానే
భవిష్య ఆలోచనలు మేధస్సుకు ఉజ్వలమైన విజయ సంకేతాలు

అజ్ఞాన కాలాన్ని మరచిపో విజ్ఞాన

అజ్ఞాన కాలాన్ని మరచిపో విజ్ఞాన కాలాన్ని ఇకనైనా సాగించు
మహా గొప్ప విశ్వ కార్యాలను మేధావుల విజ్ఞానంతో సాగించు
మహాత్ముల విశ్వ తత్వాలు భ్రమింప జేసేలా నీ ఆత్మను కదిలించు
ఆత్మ జ్ఞానంతో విశ్వ కార్యాలను విశ్వ కాలంతో సాగేలా నడిపించు
భూలోకాన్ని విశ్వ విజ్ఞాన కార్యాల దివ్య క్షేత్రంగా సాగేలా కొనసాగించు
నీలో ఆనాటి మేధావుల మాహాత్ముల విజ్ఞాన శాస్త్రీయములు ఉన్నాయి
ప్రతి విశ్వ కార్యానికి నీలో భవిష్య కాల ప్రణాళికలు నిర్దిష్టంగా ఉన్నాయి

విశ్వాన్ని తిలకించ లేదంటే మళ్ళీ నీవు

విశ్వాన్ని తిలకించ లేదంటే మళ్ళీ నీవు విజ్ఞానంగా చూడలేవు
మానవ మేధస్సుతో దివ్య గుణ భావాలతో విశ్వాన్ని తిలకించలేవు
మరో జన్మలో మరో జీవి మేధస్సేగాని మానవ విజ్ఞాన మేధస్సు లేదు
విశ్వాన్ని తిలకించాలనే ఆలోచన కలగని భావన జీవిగా జీవిస్తావు
నీ జీవ రూపానికి ఆకాశం కూడా కనిపించని విధంగా సూక్ష్మ జీవియేమో
ఆత్మ ధ్యాసతో ఆలోచించి విశ్వాన్ని విజ్ఞానంగా తిలకిస్తూ జీవితాన్ని సాగించు
విశ్వంలో ఆత్యంత మహోన్నతమైన దివ్య రూపాలు ఏవో ఎన్నో ఎక్కడో తెలుసుకో

సూర్య తేజస్సును చూసిన మొదటి జీవి

సూర్య తేజస్సును చూసిన మొదటి జీవి నేత్ర భావన ఎటువంటిది
కన్నులలో దాగిన కాంతి భావన మేధస్సుకు తెలియని స్వభావమే
సూక్ష్మజీవిగా సూర్య తేజస్సును ఒక్కసారిగా మొదటిసారి చూడుటలో
విశ్వాన్ని ఒక్కసారి విశ్వపు ధ్యాసలో చూసినట్లుగా భ్రమింపజేసిందేమో
ఆత్మ పరమాత్మను దర్శించటం ఇలాంటి సూర్య తేజ నేత్ర భావనయే
ఆనాడు సూక్ష్మ జీవిగా విశ్వాన్ని దర్శించుటలో ఎన్నో భావాలు నా మేధస్సులోనే
తన శరీర నిర్మాణ విశిష్టత అవయవాలు కదలికలు స్వభావాలు ఎన్నో అనంతమే
మేధస్సు ఎరుగని రీతిలో భావనకు తెలియని ధ్యాసలో ఆలోచన ఉదయించని కాలం
విశ్వాన్ని చూస్తూ ఉంటే తన చలనానికి తనకు తెలియని స్పందనగా కదులుతున్నది
ఆకలి భావాలు తక్కువ మేధస్సు స్వభావాల ఎరుక లేక ఇంకా ఏమీ తెలియని శూన్యంలా
విశ్వం ఎంత దూర ప్రయాణమో ఏది ఎక్కడ ఉందో ఎందుకు ఎలా ఎప్పుడు వెళ్ళాలో
విశ్వం ఎప్పుడు చీకటవుతుందో ఎంతకాలమో మరలా వెలుగుతో ఎందుకు సాగుతుందో
ఆహారం ఏదో కనిపిస్తున్నవన్నీ ఎందుకో ఎవరు కనిపించుటలేదే ఎంత కాలం ఇలా
మరో జీవి ఉందన్న భావన విజ్ఞానం లేదు ఆలోచనగా ఏమీ తెలుసుకోవాలని లేదు
మనస్సు మాత్రం భవిష్య కాలానికి వెళ్ళుతూ శక్తి నశిస్తున్నట్లు ఆకలి భావన ఏర్పడుతున్నది
ఆనాడు సూక్ష్మజీవిగా ఏ పదార్ధం నుండి జన్మించినదో తల్లి భావన కలిగించిన విస్వార్థం ఏదో
ఆనాడు మొదటి జీవి ఒంటరిగా జన్మించినదా తోడుగా ఇంకో జీవి కలిసిందా కనిపించిందా
ఒంటరిగా జీవించి ఒంటరిగా మరణించి ఉంటే మరో జీవి ఎప్పుడు ఎలా ఎక్కడ ఉదయించింది
మేధస్సులో ఎన్ని భావాలో విశ్వ కార్య క్రమ విధానాన్ని పరిశీలిస్తే తెలుస్తాయిలే నాలో

వైకుంఠ ఏకాదశికి కర్మలు ఆగిపోతాయే

వైకుంఠ ఏకాదశికి కర్మలు ఆగిపోతాయే గాని తొలగిపోవు
పవిత్రమైన రోజులలో కొన్ని దైవ ప్రభావాలు అల్లుకుంటాయి
దైవ ప్రభావాలకు కర్మలు శాంతిస్తూ కొన్ని కార్యాలను నడిపిస్తాయి
ఏనాటి నుండో కార్యాలు సాగలేక అడ్డంకులు కలుగుతుంటే
వైకుంఠ ఏకాదశికి కొంత వరకు జరిగేలా దైవ ప్రభావాలతో సాగుతాయి
మళ్ళీ ఆ కార్యాలను ఇంకాస్త ముందుకు నడిపించేందుకు కొత్త అడ్డంకులు
కొత్త సమస్యలతో కర్మలు సాగుతూ కార్యాలను బలహీనంగా నడిపిస్తాయి
సమస్యల కార్యాలను దైవ భావాలతో విశ్వ విజ్ఞానంతో కొనసాగించాలి
కర్మలను ఆత్మలో శూన్యం చేసుకొని దైవ ప్రభావాలతో కార్యాలను సాగించాలి
కర్మలను శూన్యం చేసుకొనుటకు విశ్వ కాల ఆత్మ భావాలను శ్వాసతో గమనించాలి

19 డిశంబర్ 2010 ఉదయం 9 :00

19 డిశంబర్ 2010 ఉదయం 9 :00 గంటలకు నా నేత్ర భావన
మేఘాలలో తేలిపోతున్నట్లున్నది నేటి సూర్య భావన రూపం
మేఘం ఊయలగా సూర్యునితో ఊగేలా వెంబడిస్తూ చలిస్తున్నది
20 మీటర్ల వ్యాసార్ధంతో మేఘం ఊయలగా సూర్యున్ని తాకినది

సూర్య కిరణంలో సువర్ణ భావమై విశ్వ

సూర్య కిరణంలో సువర్ణ భావమై విశ్వ ధ్యాసతో ధ్యానిస్తున్నా
ఆత్మగా విశ్వ కిరణాలతో అనంత వర్ణ తేజస్సునై ప్రకాశిస్తున్నా
విశ్వ భావాలతో ఆత్మ ను శూన్యమువలే చైతన్య పరుస్తున్నా
సూర్యునిలో ఆది మూల కేంద్రమై కిరణాలతో వెలుగునిస్తున్నా
శూన్య భావన కలిగించడం కొత్త శక్తితో నిరంతరం ప్రకాశించడమే

ఆత్మ ధ్యాసలో గత జన్మల శరీర తత్వ

ఆత్మ ధ్యాసలో గత జన్మల శరీర తత్వ భావాలెన్నో
మేధస్సులో ఉండే కణ భావాలకు శరీర గుణాలెన్నో
మేధస్సులో కలిగే ఆలోచనలలో శరీరతత్వ భావాలెన్నో
పంచభూతాల విశ్వ భావాలు శరీర తత్వాలుగా ఆత్మలోనే

మీ మేధస్సు భావాలతోనే మీ కర్మ

మీ మేధస్సు భావాలతోనే మీ కర్మ ప్రభావాలను గ్రహించాను
మీ మేధస్సులలోని ఆత్మ తత్వాల భావాలను తెలుసుకున్నాను
జన్మ ఎక్కడో మరణం మరెక్కడో జీవితం ఎంతటిదో అన్వేషించా
అజ్ఞాన భావమా కాల ప్రభావమా కర్మ చలనమా గమనిస్తున్నా
మేధస్సు లోపించినది ఆత్మ భావాలు విశ్వాన్ని చేరుకున్నాయి
జీవితం లేని జీవన ప్రయాణంలో ఆకలి తీరితే చాలనే ఆలోచన
శరీరం అశుభ్రతతో ఎక్కడంటే అక్కడ ఎలాగంటే అలాగే జీవిస్తున్నది
వర్షమైనా చలైనా వేడైనా గాలైనా నేను అలాగే అలాంటి వాటితోనే
సమాజంలో అరుదుగా కనిపించే జీవితాలైనా మేధస్సును క్షణంలో భ్రమింపజేస్తాయి

కాలం ఆగదు కనుకనే ఎన్నో కార్యాలను

కాలం ఆగదు కనుకనే ఎన్నో కార్యాలను ఆనాటి నుండి సాగిస్తున్నాము
కాలం ఆగుతుందని తెలిస్తే కార్యాలు నిలిచిపోతాయనే నిరుత్సాహ భావాలు
మనలో సంకల్ప భావాలు ధృడంగా లేకనే ఎన్నో కార్యాలు ఆగిపోతున్నాయి
మనలో విశ్వ కార్యాలు ఉంటే మహా దృఢమైన సంకల్ప భావాలు అవసరం
ఏ గొప్ప కార్యాన్నైనా సాగించడానికి తగిన సామర్థ్యం మన మేధస్సులో ఉండాలి
ఆలోచనలు ధృడంగా ఉంటేనే కాల కర్మ అనారోగ్య గ్రహ ప్రభావాలను ఎదుర్కోగలం
దైవ శక్తి మనలో ఉన్న గుణ స్వభావమే విశ్వ భావ ఆత్మ తత్వమే అదే సంకల్పం
కాలం ఆగదని సమస్యలు పరిష్కారంతో తొలగిపోతాయని మన మేధస్సుకు తెలుసు
అన్నీ తెలిసినా మనలో ఎన్నో లోపాలు ఉన్నాయంటే కార్య ప్రభావాలు ముడిపడటమే
ముడిని విప్పుతూ కార్యాన్ని దివ్య గుణంతో సాగించండి మహా మార్గం ఏర్పడుతుంది

విశ్వ భావాలతో జీవించడం నేర్చుకుంటే

విశ్వ భావాలతో జీవించడం నేర్చుకుంటే విశ్వ సమాజం సస్యశామలమే
సస్యశామలమైన విశ్వ సమాజం నవ భావాల జీవితానికి ఊరట కలిగిస్తుంది
ప్రతి జీవిలో మహా దివ్య గుణ భావ ఆత్మతత్వ స్వభావాలు కలిగితేనే సస్యశామలం
ఆత్మ జ్ఞానంతో కొన్ని సంవత్సరాలు జీవిస్తూ ఉంటేనే విశ్వ భావాలు మేధస్సులో కలుగుతాయి
శ్వాసను దివ్య ధ్యాసతో గమనించుటలో కలిగే ఆధ్యాత్మ భావాలే విశ్వ స్వభావాల ఆత్మ జ్ఞానం
ఆత్మ ధ్యాస లేని భావాలు సామాన్య మానవ జీవిత ఆర్భాటాలే గాని విశ్వ స్వభావాలు కాదు

సజీవ జీవరాసుల కార్యాలన్నీ మేధస్సు

సజీవ జీవరాసుల కార్యాలన్నీ మేధస్సు నుండే జరుగుతున్నాయి
ప్రతి కార్యం మేధస్సు నుండే భావాల ఆలోచనలతో కలుగుతున్నది
విశ్వ కాల కార్య ప్రభావాలు సజీవ నిర్జీవ భావాలతో సాగుతున్నాయి
ప్రతి జీవరాసికి మేధస్సు భావన ఉన్నందునే జీవించగలుగుతుంది
మేధస్సులలోనే ఆహార భావాలు వివిధ జీవిత అవసరాల కార్య కలాపాలు
ప్రతీది మేధస్సులో కలిగే భావనతోనే జీవ రాసుల కార్యాలు సాగిపోతాయి
శరీరంలో కలిగే ప్రతి ప్రక్రియ మేధస్సు భావాలతోనే కలుగుతున్నది
భావన లేకుండా విశ్వం లేదు మేధస్సు లేకుండా జీవరాసులు లేవు

మీ మేధస్సులలో నా భావాలు

మీ మేధస్సులలో నా భావాలు ఎప్పుడైతే ప్రవేశిస్తాయో ఆనాటి నుండి మీలో విశ్వ చక్రమే
విశ్వ చక్రం విశ్వవిజ్ఞాన భావాలతో మేధస్సులో విశ్వ రూప దివ్య స్వభావాలను కలిగిస్తుంది
దివ్య స్వభావాలతో విశ్వాన్ని తిలకించేలా మీలో మహా జ్ఞాన గుణ భావాలు సాగుతుంటాయి
మేధస్సులో విశ్వ స్వభావాలు విశ్వ చక్రంలా ఆత్మ జ్ఞాన ధ్యాసతో కలుగుతూనే ఉంటాయి
మేధస్సులో విశ్వ భావాలు ప్రవేశించేందుకు ఆత్మ ధ్యాసతో పరమ హంసతో ధ్యానించడమే

మీలో ఇంకా ఆనాటి చిన్న నాటి

మీలో ఇంకా ఆనాటి చిన్న నాటి స్వభావాలు దాగి ఉన్నాయి
మానుకోలేక మరొకరికి ఎన్నో సమస్యలుగా ఎంతో నష్టంగా
మీ అజ్ఞాన అలవాట్లకు ఆలోచనల తీరులో ఏ మార్పు లేక
అజ్ఞానాన్ని ఆత్మ జ్ఞానంతో ఆలోచించినా కూడా అలాగే చేయటం
ఎంత విజ్ఞానం తెలిసినా అజ్ఞాన అలవాట్లను మానటం లేదు
మీ అజ్ఞాన అలవాట్లు మేధస్సులో కలిగే ఉన్మాద ఆత్మ ప్రభావమే
మీకు దక్కలేదనే మీ దగ్గర లేదనే అజ్ఞాన అహింస గుణ స్వభావాలు
మీ అజ్ఞాన అహింస ఆత్మ స్వభావాలకు కర్మ ప్రభావాలు కఠినమే
మీకు దక్కలేకున్నా మీ దగ్గర లేకున్నా మీకు కావలసినవన్నీ
మీ మేధస్సులోనే అన్నీ ఉన్నాయనే గొప్ప భావాలతో ఆలోచించండి

విశ్వ భావాలను ఆలోచనలతో

విశ్వ భావాలను ఆలోచనలతో గమనిస్తూ తెలుసుకో విశ్వ మిత్ర
ప్రతి ఆలోచన స్వభావాన్ని పరమ హంస భావనతో పరిశీలించు
విశ్వ భావాలతో విశ్వ విజ్ఞానాన్ని మేధస్సున ఏకాగ్రతతో గ్రహించు
విశ్వ విజ్ఞాన ఆత్మ భావ తత్వాలతో జీవితాన్ని దివ్యంగా మార్చుకో
విశ్వ తత్వమున విశ్వ భావాలు హంస స్వభావ గుణ జ్ఞాన విజ్ఞానమే

Thursday, December 16, 2010

ప్రతి రోజు దుర్వాసన అశుభ్రత

ప్రతి రోజు దుర్వాసన అశుభ్రత అపవిజయ అజ్ఞాన భావాలెన్నో
సువాసన శుభ్రత విజయ విజ్ఞాన భావాలెన్నో కలుగుతుంటాయి
ఎన్నో ఆలోచనలు ఎన్నెన్నో కార్యాలు మరెన్నో భావ స్వభావాలు
అజ్ఞాన భావాలను త్వరగా వదిలించుకొని విజ్ఞాన భావాలతో జీవించు
ప్రతి రోజు సద్గుణ భావాలతో సంతోషంగా ఆలోచిస్తూ కార్యాలెన్నో సాగించు
అజ్ఞాన భావ ప్రాంతాలను వీడి విజ్ఞాన భావ ప్రాంతాలలో దివ్యంగా జీవించు

మనిషిని ఉరి తీయుట భాధ్యతనా

మనిషిని ఉరి తీయుట భాధ్యతనా కర్తవ్యమా చట్ట కార్యమా
మనిషిని మార్చే గుణాలు మనలో లేకున్నా జీవింపజేయండి
చెరసాలలోనే జీవితమంతా గడిపేలా అతనికి శిక్ష విధించండి
మనిషిలో మార్పు కోసం వివిధ సద్గుణ కార్యాలను చేపట్టండి
మనిషి అజ్ఞాని ఐతే విజ్ఞానాన్ని కలిగించేలా ప్రయత్నించండి
కఠినత్వంతో సమాచారాన్ని రాబట్టడం కన్నా స్వేచ్ఛగా వదిలేయండి
తన జీవితం తనకెందుకు అనే భావనతో తన తప్పు తనకు తెలియాలి
ఉరి తీయుట మానవ ధర్మం కాదు చట్టం క్రూరంగా ఉండకూడదు
ఒక్కసారి ఉరి తీస్తే మరలా అతను జీవించలేడు కుటుంభాన్ని పోషించలేడు
ఓ మనిషి ఖైదీగా మారడానికి అతను ఎదిగే ప్రాంత ప్రభావమా కుటుంబమా
సమాజమా సమస్యల విధానమా స్నేహ శత్రువుల అలావాట్ల ప్రభావమా
విధి వికృత గ్రహచార కాల ప్రభావాల అజ్ఞాన ఆవేదన ప్రభావమా
నేటి వరకు ఉరి తీసిన వారిలో మంచివారు లేరా ఆలోచించండి

ఓ మనిషి ఇంకో మనిషిని చంపాలని

ఓ మనిషి ఇంకో మనిషిని చంపాలని అనుకోడు
మనిషిలో ఉన్న భావాలను చంపాలనుకుంటాడు
తనకు కావలసిన భావాలు లేకపోవటంతో చంపేస్తాడు
తనలో లేని గుణాల కోసం ఆర్ధిక ఆశల కోసం చంపేస్తాడు
భావాలను హత మార్చడానికి మనిషినే హత్య చేస్తాడు
ఎన్నో భావాల కోసం ఎందరో ఎందరినో హత్య చేశారు
ఓ మనిషిని హత్య చేసే భావన అర్థం అతనికి తెలియదు
అజ్ఞాన ఆలోచనగా ఆవేదన భావాలతో హత్య చేస్తున్నారు

Wednesday, December 15, 2010

మీ మరణాన్ని ఆపుకోండి విజ్ఞానంగా

మీ మరణాన్ని ఆపుకోండి విజ్ఞానంగా ఆలోచిస్తూ ముందడుగు వేయండి
ఆత్మ హత్యలకు ఆవేశ అజ్ఞాన అనారోగ్యాలకు బలి కాకుండా జీవించండి
ఉన్న దాంట్లోనే సర్దుకొని జీవిస్తూ ఆశలకు వెళ్ళకుండ సంతృప్తి చెందండి
భవిష్య కాల ప్రభావాలకు అధిక నష్టాలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి

ఎవరికి ఎప్పుడు ఏ భావన ఎందుకు

ఎవరికి ఎప్పుడు ఏ భావన ఎందుకు అవసరమగునో
ఏ భావన ఎవరిలో ఎప్పుడు ఎలా కలుగుతుందో
భావన కలిగే రూప స్వభావాలు ఎవరికి ఎందుకో
భావాలతో జీవితాన్ని గడిపే జీవుల రూపాలమే మనం

గుంపులు ఉన్న చోట భేదాభి ప్రాయం

గుంపులు ఉన్న చోట భేదాభి ప్రాయం ఏర్పడితే రాళ్ళ వర్షాలు
వివిధ వస్తువుల పగుళ్ళు రక్తపు ధారలు గందర గోల చేష్టలు
ఆవేశాలకు దుర్గుణాలన్నీ చేష్టలుగా బయటకు వచ్చేస్తాయి
మానవత్వం లేకపోతే సహనం ఓర్పు కీర్తి ఖ్యాతిని మరిచేస్తారు
ఆవేశాలలో కలిగే గుణాలన్నీ మానవత్వం లేని మృగుణాలే

41 రోజులు - చాలా ప్రత్యేకమైనవి

41 రోజులు - చాలా ప్రత్యేకమైనవి
ఓ దీక్ష ఓ మహా కార్యం ఓ మహా విజయానికి 41 రోజుల సాధన అవసరం
అజ్ఞానులు విజ్ఞానులుగా మారాలన్నా 41 రోజుల సాధన దీక్ష అవసరం
కొన్ని రోగాలు నయం కావాలన్నా రోగానికి కట్టిన కట్లు విప్పాలన్నా 41
మహా అపాయమైన పచ్చ కామెర్ల రోగానికి పత్యం ఉండవలసి వస్తే 41
భగవంతుని మాలలు ధరించిన వారు 41 రోజుల తరువాతే దీక్ష విరమణ
దీక్ష విరమణ చేసిన వారు మరల వారి అలవాట్లను సాగిస్తారు ఎందుకో
మన దేహం పంచభూతాల విశ్వ తత్వాన్ని పొందాలన్నా 41 రోజుల సాధన
దురలవాట్లను పూర్తిగా మానుకోవాలన్నా 41 రోజుల కఠిన దీక్ష అవసరం
ఈ అలవాట్లను మానుకున్న వారు మరల మొదలు పెడతారు ఎందుకో
41 రోజులు యోగ తత్వ ఆత్మ భావాలతో జీవిస్తే మీలో విశ్వ విజ్ఞానమే
"మాల ధరించి భగవంతునిలా జీవించి మరలా దీక్ష విరమణతో దురలవాట్లను అలవాటు చేసుకోవడం తన దేహాన్ని కాల్చుకోవడమే"

విశ్వంలో సుజయ భావన మహా గుణ

విశ్వంలో సుజయ భావన మహా గుణ విజయమే
మహా గుణ కార్యాలలో జయ విజయాలు సుజయమే
సుజయ విజయాలు సద్గుణాన్ని తెలిపే వీర సామర్థ్యమే
ప్రాణ హాని లేని జయ విజయాలు విశ్వంలో సుజయమే

జీవన యోగివి నీవే జీవిత ఆత్మ

జీవన యోగివి నీవే జీవిత ఆత్మ భావానివి నీవే
జీవించుటలో ఆత్మ యోగ తత్వ భావానివి నీవే
జీవితమంతా ఆత్మ భావాలతో యోగిలా జీవించు
జీవనమే యోగమని విశ్వ భావాలతో జీవించు

లక్షల కోట్ల భావాలను తెలిపేవారు

లక్షల కోట్ల భావాలను తెలిపేవారు ఉన్నారంటే వారు ఆనాటి మహాత్ములే
లక్షల కోట్ల భావాలతో ఆనాటి విశ్వ విజ్ఞానాన్నే ఆత్మ తత్వంతో తెలుపగలరు
భావాలను ఆత్మ ధ్యాసలో మేధస్సున గ్రహించి అర్థ వివరణతో తెలుపుతారు
భావాల విజ్ఞానమే విశ్వ భాష పంచ భూత పరమ తత్వ జీవ రహస్యము

పది వేల భావాలు చాలు పది దశాబ్దాలు

పది వేల భావాలు చాలు పది దశాబ్దాలు జీవించడానికి
పది వేల భావాలను సూక్ష్మార్థంగా తెలుసుకోవడానికి దశ దశాబ్దాలే
దశ దశాబ్దపు భావాలే ఓ శాతాబ్ధమంతా తెలుసుకోగల జ్ఞాన విజ్ఞానం
శతాబ్ద విజ్ఞానంతో వేల భావాలను లక్షల స్వభావాలుగా గుర్తించవచ్చు
శతాబ్దపు భావాలే యుగాలుగా అనంతమైన భావ స్వభావాలుగా తోస్తాయి
భావ స్వభావాలతో ఆనాటి నుండి నేటి వరకు విశ్వ కాలం సాగుతున్నది
విశ్వ కాలాన్ని ఇంకా కొత్త భావాలతో సాగించడానికే నా పది వేల భావాలు

ఏనాటి భావాలు ఎక్కడెక్కడ నుండి

ఏనాటి భావాలు ఎక్కడెక్కడ నుండి నా మేధస్సులో ఎక్కడెక్కడ చేరాయి
ఎక్కడెక్కడో కలిగిన భావాలు ఎలాంటివో ఆనాడు నాకెందుకో తెలియవు
నాడు కలుగుతున్న భావాలు ఆనాటి భావాల అర్థాలను తెలుపుతున్నాయి
ఏమైనా ఆనాటి భావాలు నాలో ఉన్నందుకు నేడు విశ్వ విజ్ఞానం తెలుస్తున్నది
ఆనాటి భావాలు నాలో లేకపోతే మరల తెలుసుకునే వీలు ఏనాటికి కలగదు
గత కాలంలో వెళ్ళలేము ఆనాటి వారు భావాలను తెలుపుటకు నేటికీ జీవించలేరు
ఆనాటి నుండి నాలో ఉన్న భావాల అన్వేషణతో విశ్వ విజ్ఞానం నా మేధస్సులో చేరింది

అనుభవం ఉన్నా జీవితాన్ని

అనుభవం ఉన్నా జీవితాన్ని మార్చుకోలేకపోతే ఆలోచనల ప్రభావమా కాల భావమా
సామర్థ్యం లేక సాధన లేకపోవుటయా అనారోగ్యమా ఆర్ధిక లోపమా జీవన విధానమా
సమాజ స్థితులా కుటుంబ సమస్యలా స్నేహ సంబంధాల జీవిత బాధ్యతల పోరాటమా
సాధన ఉన్నా కాలం సహకరించక ఒడిదుడుకులతో అనుభవాన్ని అధిగమిస్తున్నావా

నీవు ఉన్నచోట నీకు విజ్ఞానం కలగదు

నీవు ఉన్నచోట నీకు విజ్ఞానం కలగదు ఎవరు నీకు తెలుపరు
ప్రయాణించుటతోనే ఎన్నో ప్రాంతాల స్థితులతో విజ్ఞానం కలుగును
మరో మనిషితో వారి భావ స్వభావాల జీవన స్థితిని తెలుసుకో
ప్రయాణించలేకపోతే సాంకేతిక యంత్రాలతో విజ్ఞానాన్ని తెలుసుకో

గతంలో ఎన్నో జరిగిన ఘోర ప్రమాదాలు

గతంలో ఎన్నో జరిగిన ఘోర ప్రమాదాలు తెలిసినా మళ్ళీ అలాగే అక్కడే ప్రమాదాలు
ప్రమాదాలు జరిగినప్పుడు ప్రశాంతత కావాలని వెళ్ళేటప్పుడు త్వరగా వెళ్లాలని వేగమే
వేగంలో మన భావాలకు గత అనుభవాలు శూన్యమై వేగాన్ని త్వరగా తగ్గించుకోలేకపోతాం
ఒక్క సారి సామర్థ్య స్థితి వెళ్ళిపోతే ఎన్ని ప్రాణాలు వెల్లిపోతాయో ఆ క్షణాన తెలుసుకోలేవు
రహదారులలో లోపాలున్నా నడిపే వాహనాల సామర్థ్య విధానం లోపించుట ఆలోచించవలసిందే

Tuesday, December 14, 2010

భావాలు ఆగి పోయాయని ఏనాడు

భావాలు ఆగి పోయాయని ఏనాడు అనుకోవద్దు
ఆలోచనలు ఉన్నంతవరకు భావాలు కలుగుతుంటాయి
భావాలే లేకపోతే ఆలోచనలు లేక దేహ కదలికలు ఆగిపోవును
చలనం లేని శరీరం భావన లేని పంచభూతాల నిర్జీవ క్షీణ స్థితియే

ఏమిటో చరిత్ర ఆనాటి నాగరికత

ఏమిటో చరిత్ర ఆనాటి నాగరికత వెళ్ళిపోయింది
రాజ్యాలే కూలిపోయి రోజులెన్నో గడిచి పోయాయి
పర దేశీయులే వచ్చి దేశాలను పాలించి వెళ్ళారు
రాజకీయ నాయకులే ప్రజా పాలన చేస్తున్నారు
ఆనాటి నుండి నేటి వరకు జీవించుటలో అర్థమేది
ఏనాడు ఎవరు జీవించినా ఎవరి విజ్ఞానం ఎవరికి
తరతరాలుగా మారే జీవన విధానంలో మార్పు దేనికి
ఎన్నో విషయాలు తెలుసుకున్నా అనుభవం కొంతేనా
మన కాలం వెళ్ళిపోయి సాంకేతిక విజ్ఞాన జీవితమేనా

మీలో ఉన్న భావాలకు స్వభావం

మీలో ఉన్న భావాలకు స్వభావం తెలిస్తేనే భావార్థం తెలియును
స్వభావాలు తెలియకపోతే భావాల ఆలోచనలైనా అర్థం కావు
ఆలోచనలు అర్థం కాకపోతే విషయ విజ్ఞానం లేక అజ్ఞానమే
అజ్ఞానంతో జీవిస్తే జీవితమంతా తీరని సమస్యల సందేహాలే

ఆలోచనలతో కలిగే ఆకలికి ప్రకృతి

ఆలోచనలతో కలిగే ఆకలికి ప్రకృతి భావాలతో ఆహార శక్తిని అందించాలనుకున్నా
ప్రకృతి భావాలు విశ్వ తత్వ ఆత్మ స్వభావాలతో నా శ్వాసలో చేరిపోవాలనుకున్నా
మేధస్సులో ఆకలి అనే భావనలోనే ఆహార శక్తి సమర్దవంతంగా కలగాలనుకున్నా
విశ్వ భావాల ధ్యాసలో విశ్వ శక్తి ఆత్మకు కలగాలని ప్రకృతితో నిర్ణయించుకున్నా

జీవ కణంలో మేధస్సు భావన ఉంటే

జీవ కణంలో మేధస్సు భావన ఉంటే ఎలాంటిది
ఎదుగుటలో కలిగే చర్యలకు కలిగే భావాలు ఏవి
మేధస్సు భావన ఉంటే కణంలో మేధస్సు పరిమాణం ఎంత
మేధస్సు భావాలకే ఎదిగే చర్యల భావ స్వభావాలు తెలియునా
జీవ కణం లోనే జీవ రూపాలు విశ్వ భావాలు దాగి ఉన్నాయి
జీవ కణానికి కలిగే భావాలన్నీ మేధస్సులోనే చేరిపోతాయి

విశ్వ కాలానికి యుగమేది

విశ్వ కాలానికి యుగమేది మన కలి యుగానికి అర్థమేది
ఏ యుగమైనా విశ్వ కాలములో ఉన్నా సమయాలే కదా
ఆనాటి కృత త్రేతా ద్వాపర యుగాలు విశ్వ కాలములోనివే
ఆనాడు గడిచిన యుగాలకు కాల సమయమెంతో తెలియునా
నేటి కాలాన్ని కలియుగమని ఎంతో కాలం సాగిస్తున్నాము

నేను నిద్రించుటలో ఓ వైపు పర ధ్యాసలో

నేను నిద్రించుటలో ఓ వైపు పర ధ్యాసలో ప్రయాణిస్తున్నా
మరో వైపు నుండి మరెందరో భావాలతో లాగేస్తున్నారు
వారి భావాలకై నా యుగాల నాటి ప్రయాణ దూరం
ఓ క్షణంలో మెలకువతో మరల యదా విధి స్థానమే
నా శూన్య స్థానాన్ని దర్శించుటకు నిద్రలో వేగమై ప్రయాణిస్తున్నా
పర ధ్యాసలోని వేగాన్ని మరలా యదా స్థితికి చేరుస్తున్నారు
మెలకువతో చేరుకోలేకనే నిద్రించుటలో వేగ యుగాలుగా
విశ్వ కాలమై నిద్రిస్తూ పర ధ్యాసలో సూక్ష్మంగా ప్రయాణిస్తున్నా

మనిషిలో ఉన్న భావాలే

మనిషిలో ఉన్న భావాలే ప్రతి యంత్రమున కలుగుతున్నాయి
ప్రతి యంత్ర కదలికల విధాన తీరులో మన భావాలే అద్భుతము
యంత్ర కదలికల పని తీరును చూస్తే మేధస్సులో ఉత్తేజ భావాలే
భావాలతో మేధస్సులో నవ భావాలు కలిగి మరో యంత్రాన్ని సృష్టించును

దేహము పంచ భూతాలతో నిర్మితమైనా

దేహము పంచ భూతాలతో నిర్మితమైనా విశ్వ భావ తత్వాలే
విశ్వ తత్వాలతో కలిగి ఉన్నందున విశ్వ భావాలే మేధస్సున
మేధస్సులోని భావనలే ఆలోచనలుగా మానవ విజ్ఞానము
విజ్ఞాన అన్వేషణలో విశ్వ విజ్ఞానమే ఆలోచనల పరంపరలు

ఏ తంత్రములో ఏ మంత్రమున్నదో

ఏ తంత్రములో ఏ మంత్రమున్నదో ఏ మేధస్సుకు తెలుసు
మేధస్సులోని మంత్రమునే తంత్రములో మర్మముగా వ్రాయబడినది
వ్రాసిన వారికే తెలుసా తంత్ర మంత్రముల మర్మముల రహస్యము
రహస్య విజ్ఞానమే మంత్రమని తంత్ర మేధావులకే మర్మము తెలుసా
మరో మనిషికి అర్థం కాని భాషయే మంత్రమని తంత్రములో వ్రాసేదరా
మంత్రము అర్థమైతే తంత్రము లేదే మర్మ రహస్యమైనా లేనే లేదే

ఆకాశమంతా మేఘాలు

ఆకాశమంతా మేఘాలు కమ్ముకున్నందున సూర్య కిరణాలన్నీ ఆకాశానికే
భూమిని తాకలేని కిరణాలు ఆకాశాన్ని వివిధ వర్ణాలతో మెప్పిస్తున్నాయి
మనకు కనిపించని ఆ కిరణ వర్ణాల తేజస్సులు నా మేధస్సులో దివ్యత్వమే
ఎవరికి లేని వర్ణాల భావాలు నా మేధస్సులో కిరణాలుగా ఉదయిస్తున్నాయి

సూర్యోదయ సువర్ణ కిరణాలు

సూర్యోదయ సువర్ణ కిరణాలు నా దేహాన్ని తాకుతున్నాయి
సువర్ణ గుణ తేజస్సు భావాలు నా మేధస్సులో చేరుతున్నాయి
సువర్ణ కిరణాలు విశ్వ తత్వాల సూక్ష్మ శక్తి భావాల తేజస్సులు
దేహాన్ని శుద్ధి చేసే భావాలు సువర్ణ సూర్య కిరణాలలో ఉన్నాయి

నా మేధస్సు నుండి మరో విశ్వ

నా మేధస్సు నుండి మరో విశ్వ మేధస్సు మరణంతో జన్మిస్తుంది
నా ఆత్మ ఎరుకతో జన్మించే మేధస్సే విశ్వ మేధస్సుగా ఉదయిస్తుంది
విశ్వ భావాలతో ఎదిగే మేధస్సు విశ్వ తత్వాలతోనే జీవిస్తుంది
విశ్వ భావన ఉన్నంత వరకు విశ్వ మేధస్సుకు మరణమే లేదు

నా దేహము పంచ భూతాలలో

నా దేహము పంచ భూతాలలో ఏ భావనతో కలిసిపోతుంది
మరణించిన నాకు తెలియని ఆ భావన ఎలా తెలుస్తుంది
శరీర అస్థికములతో సహా మేధస్సు శూన్యమై పోతున్నది
ప్రతి దేహ కణము శూన్యంగా నశించి పోవుటలో భావన ఏది
ప్రతి కణ భావనను ఆత్మతో పంపించిన పిదపనే నేను మరణిస్తాను

నీలో నేను ఉన్నందుకే నాలో నీవు

నీలో నేను ఉన్నందుకే నాలో నీవు ఉన్నావు
నీలో ఉన్న భావమే నా భావాన్ని తెలుపుతున్నది
భావనగా నేను ప్రతి జీవిలో ఉన్నానని తెలిసినప్పుడే
నాలో ప్రతి జీవి ఉందని ప్రతి భావన నాకు తెలుపుతుంది

Monday, December 13, 2010

ఓ అజ్ఞాన విజ్ఞాని! నా భావాలతో విశ్వ

ఓ అజ్ఞాన విజ్ఞాని! నా భావాలతో విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకో
అజ్ఞానంతో జీవించాలని నీకు లేకపోయినా కాల పరిస్థితులు అలాంటివి
విజ్ఞానంతో జీవిస్తున్నా కాల ప్రభావాలు నిన్ను మరోలా మార్చేస్తుంటాయి
ఏ ప్రభావాలు పరిస్థితులు ఎలా ఉన్నా నీలోని ఆత్మను విజ్ఞాన పరచు
ఆత్మ జ్ఞానంతో విశ్వ విజ్ఞానిగా విశ్వ విధాతగా యోగ తత్వంచే జీవిస్తావు

విశ్వమున నేనొక భావమై మరో

విశ్వమున నేనొక భావమై మరో లోకంలో జీవిస్తానని ఓ ఆలోచన
నా ఆలోచనలలో ఓ స్వభావం ఆత్మ తత్వంతో నాకు తెలుపుతున్నది
మరణంతో ఆత్మ చైతన్యమై శూన్యమైతే నా భావాలు వెళ్లి పోతాయని
నేనొక భావమై ఓ దివ్య కాంతి తేజస్సు స్వభావంతో ఓ లోకాన జీవిస్తాను

ఈ భావాలు ఏ గమ్యాన్ని

ఈ భావాలు ఏ గమ్యాన్ని చేరుకుంటాయో విశ్వ భాషకే తెలుసు
విశ్వంలో ఏ అంచులను తాకుతూ ఏ రూపాలలో ఉండిపోతాయో
విశ్వమంతా నా భావాలు అణువులుగా వివిధ స్వభావాలతో తిరుగుతూనే
ఏ భావం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో నా మేధస్సునకే మహా ఎరుక
జీవుల మేధస్సులలో కలిగే భావాలు నా స్వభావాలేనని విశ్వానికే ఎరుక
భావాలను నా భావనతో సృష్టించి వివిధ స్వభావాలుగా విశ్వమున కలిగించా
ఈ భావాలే నాకు జీవమై శ్వాసలో చేరి విశ్వ స్వభావాలను తెలుపుతున్నాయి

విశ్వ భావాలను ఆత్మ గ్రహించేలా

విశ్వ భావాలను ఆత్మ గ్రహించేలా మేధస్సుకు తెలియాలి
మేధస్సే భావ స్వభావాలను ఆత్మ తత్వానికి కలిగించాలి
విశిష్ట సాధనతో శ్వాస ధ్యాసతో అపారంగా ధ్యానం చేయాలి
కపాలనికి రంధ్రాలు జల్లెడలా ఏర్పడి విశ్వ శక్తిని ఆత్మ గ్రహించాలి
ఆత్మలో ఉన్న విశ్వ గుణ భావాలు నక్షత్రాల కాంతి కన్నా మెరుగైనవి

కలియుగాంతం వరకు నా కర్మలు

కలియుగాంతం వరకు నా కర్మలు సాగుతాయని మేధస్సు గ్రహించినది
ఏ కార్యాలైనా కఠినమై ఎన్నో సమస్యలుగా నష్టాలతో సాగుతూ పోతాయి
ఈనాటి కర్మలు ఆనాటి కార్మలే కార్యాలు ఆనాటివే ఐనా ఇనాటి విధంగా
ఏ కార్యాలకు ఏ కర్మలు అనుభవించాలో మేధస్సుకు దైవ నిర్ణయ పరీక్షయే
ఏ యుగానికి ఏ కర్మలు అనుభవించాలో జీవిత ఆశయాలకే అర్థం కావు
మరణంతో కర్మలు తొలగిపోవు ఆత్మతో జన్మ జన్మలుగా తోడై వస్తుంటాయి
ఆత్మ జ్ఞానంతో ఆత్మకు వదిలిన కర్మలను విశ్వ విజ్ఞాన ధ్యానంతో తొలగించుకోవాలి

విశ్వ కేంద్రకాలు నన్ను వివిధ కక్ష్యలలో

విశ్వ కేంద్రకాలు నన్ను వివిధ కక్ష్యలలో ఆకర్షిస్తున్నాయి
విశ్వ భావ అంతరిక్ష తరంగాలు నాలో స్పందిస్తున్నాయి
విశ్వ రూప ఆకాశ స్వభావాలు నన్ను స్పర్శిస్తున్నాయి
విశ్వ లోక స్థానాలు నన్ను దివ్య కాంతితో దర్శిస్తున్నాయి

Sunday, December 12, 2010

నా భావాలను తెలుపుటకు విశ్వ కాలం

నా భావాలను తెలుపుటకు విశ్వ కాలం సరిపోదేమో
జీవిస్తూ ఉన్నా భావాలు ఊటలా ఊరుతూనే ఉన్నాయి
జన్మలెన్నో పొందుతున్నా భావాలెన్నో కలుగుతున్నాయి
నా మేధస్సుకే ఎన్నో తెలుసనుకున్నా నా ఆత్మకు మరెన్నో
విశ్వమున ఒక క్షణమున కలిగే భావాలను తెలిపేందుకే విశ్వ కాలం సరిపోదేమో
ప్రతి అణువుకు ఏ స్వభావం ఎప్పుడు ఏ క్షణాన ఏం కలుగుతుందో ఎవరికి తెలుసు
ప్రతి అణువు భావాలను మేధస్సులో దాచుకున్నా తెలిపేందుకు విశ్వ కాలమే సరి

మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ పదే పదే

మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ పదే పదే తలచుకుంటూ అజ్ఞానిలా జీవించకు
విజ్ఞానాన్ని ఆలోచిస్తూ జ్ఞాపకంగా తలచుకుంటూ మేధావిలా జీవించు
కార్యాలపై విషయ అర్థాన్ని గ్రహిస్తూ ఏకాసంతాగ్రహిలా ఎదుగుతూ జీవించు
భవిష్య నిర్ణయాలకు ప్రణాళికలకు అమూల్యమైన అనుభవ విజ్ఞానాన్ని అందించు

30 సంవత్సరాలు వచ్చినా నాసిక

30 సంవత్సరాలు వచ్చినా నాసిక పదార్థాన్ని రుచిస్తున్నావు
60 సంవత్సరాలు దాటి వెళ్ళుతున్నా అలాగే రుచిస్తున్నావు
మనిషి అనే భావనకు ఆలోచనకు విజ్ఞాన మేధస్సుకు అర్థం తెలియుట లేదా
అర్థం కాని అజ్ఞాన ఆలోచనల మేధస్సుతో అశుభ్రతతో దురలవాట్లతో జీవిస్తున్నావు
ఏకాగ్రత విజ్ఞానం భగవంతుని అర్థం ఆహార శుభ్రత వస్త్ర పద్దతి ఏవీ నీకు తెలియవు
పరిశుద్ద పరిపూర్ణ పవిత్రతల సూక్ష్మ సంపూర్ణ శుభ్రతా విశ్వ విజ్ఞానం నీకు తెలియదు
అణువును చూడలేని నేత్రాలు మేధస్సున గ్రహించని భావాలు ఏవీ నీకు తెలియవు
జ్ఞానేంద్రియ లోపాలతో విచక్షణ రహితుడవై సమాజంలో అజ్ఞాన శోకంతో జీవిస్తున్నావు
ఎందరో ఎన్నో విధాల తెలిపినా ఎందరి మహాత్ములను చూసినా మానుకోవటం లేదు
తల్లితండ్రుల పెంపక లోపమా ఆత్మ భావాల లోపమా అశుభ్రత జీవిత విధానమా

కలియుగమే కాని కలియుగాంతం కాదని

కలియుగమే కాని కలియుగాంతం కాదని నా మేధస్సులో ఓ కాల ఆలోచన
కలియుగాన ప్రళయాలు సంభవించినా విశ్వమంతా అంతం కాదనే నా భావన
ప్రళయానికి జీవరాసులు ఎక్కువ సంఖ్యలో నశించినా మిగిలిన జీవులు ఎన్నో
మిగిలిన జీవులే కలియుగానికి జీవించే విశ్వ కాల రూపానికి ప్రతి రూపాలు
ఆత్మ జ్ఞానంతో వినాశనం లేకుండా జీవిస్తే ప్రళయ ప్రభావాలు శాంతిస్తాయి

ఏకాగ్రతతో జీవించరా విశ్వ భావాలు

ఏకాగ్రతతో జీవించరా విశ్వ భావాలు కలుగునురా
భావాలతో తెలుసుకోరా విశ్వ విజ్ఞానం తెలియునురా
ఆత్మ జ్ఞాన ధ్యాసతో వేద భావాలను గమనించరా
విశ్వ విజ్ఞాన అర్థాలు వివిధ కార్యాలలో తెలియునురా

మేధస్సులో ఇంకెన్ని ఆలోచనలు

మేధస్సులో ఇంకెన్ని ఆలోచనలు దాచుకోవాలో విశ్వం కన్నా విశాలమైనదా
ఆనాటి యుగాల నుండి నేటి వరకు జరిగిన కార్యాలన్నీ మేధస్సులో చేరుతున్నాయి
ఇంకా ఎన్నో వేల లక్షల కోట్ల యుగాలు జన్మించినా ఎన్నో ఆలోచనలు మేధస్సులో
మేధస్సులో ఉన్న జ్ఞాపక శక్తి అనంతమైన ప్రదేశంగా మేధస్సు కణాలలోనే ఉంది
ఆత్మ భావాలు ఉన్నంత కాలం మేధస్సులో ఎన్నో ఆలోచనలు జ్ఞాపకంగా చేరుతూనే

నీవు నా భావాలను చదువుటలో నీకు

నీవు నా భావాలను చదువుటలో నీకు కలిగిన భావాలను ఓ పుస్తకంలో వ్రాసుకో
మళ్ళీ అప్పుడప్పుడు వాటిని చదువుతుంటే మరెన్నో కొత్త భావాలు కలుగుతాయి
అలా భావాలను నీకు నీవుగా తెలుసుకొనుటలో విశ్వ భావాలు నీ మేధస్సున చేరుతాయి
విశ్వ భావాలతో నీ మేధస్సు అన్వేషిస్తూ విశ్వ విజ్ఞానాన్ని సేకరిస్తూ ఉంటుంది
విశ్వ విజ్ఞానంతో నీవు విశ్వ విధాతగా యోగత్వ ఆత్మ భావాలతో జీవిస్తావు

ఎక్కడైనా కూర్చున్నప్పుడు అజ్ఞాన

ఎక్కడైనా కూర్చున్నప్పుడు అజ్ఞాన మలిన భావాలతో పాదాలను ఎందుకు తాకెదరో
మళ్ళీ అవే చేతులతో ఆహార పదార్థాలను తీసుకోవడం తినడం ఎలాగంటే అలాగ
అనవసరంగా విచిత్ర అలవాట్లతో పాదాలు పాద రక్షాలను తాకడం అలాగే భుజించడం
అమూల్యమైన పవిత్రమైన వస్తువులను అపవిత్రం చేయుట ఇలాగేనేమో అనిపిస్తుంది
మంచి అలవాట్లతో సూక్ష్మ శుభ్రతతో విశ్వ భావాలతో జీవించేందుకు ప్రయత్నించండి

కథలు చదివే కాలాలు వెళ్ళిపోతే

కథలు చదివే కాలాలు వెళ్ళిపోతే భావాలను తెలుసుకునే కాలమే వస్తుంది
కథలలో ఏది ఎంత వరకు నిజమో ఎవరు ఎలా ఎందుకు అల్లారో తెలియదు
భావాలను సూక్ష్మంగా పరిశీలిస్తే మనకు స్వభావాలు స్పష్టంగా తెలుస్తాయి
చరిత్రలలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు ఎన్నో విధాల ఉండవచ్చు
చరిత్రలలో నైనా కథలలో నైనా విజ్ఞానాన్ని మాత్రమే గ్రహించేది భావనయే
భావాలను అర్థం చేసుకోవడానికి మీలో గుణ స్వభావాలు దివ్యంగా ఉండాలి
ఏ విషయంలోనైనా అజ్ఞాన విజ్ఞానాన్ని గుర్తించేది భావన స్వభావమే
విజ్ఞాన భావాలతో జీవించండి విశ్వ భావాలతో విజ్ఞానాన్ని తెలుసుకోండి

లాలాజలం అమృతమే దురలవాట్లతో

లాలాజలం అమృతమే దురలవాట్లతో విష పదార్థాలతో వృధా చేయకు
నీ నోటిలోని నాలుకను దంతాలను శుభ్ర పరిచేది లాలాజలమే
నోటిలో దాగిన సూక్ష్మ పదార్థాన్ని కరిగించి దంతాలను రక్షిస్తుంది
ఆహార ఘన పదార్థాలను కాస్త ద్రవ పదార్థంగా మారుస్తుంది
లాలాజలం ఎక్కడ లభించని దివ్య ఔషదమైన ద్రవ పదార్ధం
లాలాజలంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి గ్రహించి తెలుసుకో

చుక్కల్లే దాచానే నా ఆత్మను ఆకాశాన

చుక్కల్లే దాచానే నా ఆత్మను ఆకాశాన ఎవరికి అందరాదని
కనిపించేది నా ఆత్మే ఇనా చుక్కగానే మీకు కనిపిస్తుంది
ఎన్నో వేల చుక్కల్లో నా ఆత్మను అదేనని వేలుతో చూపలేరు
యోగి కాని యోగిగా జీవించుటలో శరీరం నశించి ఆత్మగా మిగిలాను
ఆత్మను కూడా యోగత్వంచే జీవింపజేయాలని చుక్కల్లే దాగాను

నీ నుదిటి రాతను విశ్వ భావనతో

నీ నుదిటి రాతను విశ్వ భావనతో మార్చుకో
నుదిటిపై త్రి నేత్ర దృష్టిని విజ్ఞానంగా చూసుకో
భవిష్య కార్యాలేవో విశ్వ భావాలతో తెలుసుకో
విశ్వ కార్యాలతో నీ నుదిటి రాత విశ్వ విజ్ఞానమే

నీ మేధస్సులోనే దాచానులే ఆనాటి

నీ మేధస్సులోనే దాచానులే ఆనాటి విశ్వ భావ విజ్ఞాన రహస్యాలను
నీవు ఆత్మ ధ్యాసతో ధ్యానించుటలో నీ మేధస్సులోనే తెలియునులే
యోగి తత్వములు నీలో ఉదయిస్తేనే విశ్వ భావాలు విజ్ఞానమవుతాయి
నేడు నీకు తెలియకపోతే కాలం వృధా చేయక ధ్యానించి తెలుసుకో
విశ్వ విజ్ఞానం నీ జీవితాన్ని విశ్వ కార్యాలతో అద్భుతంగా సాగిస్తుంది

ఇది విశ్వ భావ విజ్ఞాన చరిత్రగా నా

ఇది విశ్వ భావ విజ్ఞాన చరిత్రగా నా మేధస్సులో ఆరంభమైనది
భావ స్వభావాల విజ్ఞానం ఆత్మ జ్ఞానమై మేధస్సులో చేరినది
ఏ భావన కలిగినా ఆత్మ స్వభావం మేధస్సున విజ్ఞానమవుతుంది
ఎన్నో భావాల స్వభావాలను తెలుసుకుంటూ మేధస్సున దాచుకున్నా

ఆకలి నిద్ర భావాలను నీ ఆత్మ

ఆకలి నిద్ర భావాలను నీ ఆత్మ మరచిపోయి ఉంటేనే జీవిగా జన్మించు
జీవిత ఆశయ కార్యాలు లేకుంటేనే విశ్వ కార్యాలకై కారణంతో జన్మించు
నేటి లోకం ఆర్థిక సదుపాయాల సమస్యలతో విలవిలలాడుతున్నది
ఆకలి నిద్ర భావాలు ఉంటే నీకు కూడా ఆర్థిక సదుపాయాల సమస్యలే
విశ్వ కార్యాలకై జన్మించు లోకాన్ని విశ్వ విజ్ఞానంగా మార్చి అస్తమించు

నా మేఘ రూప తేజస్సును చూస్తే మీ

నా మేఘ రూప తేజస్సును చూస్తే మీ మేధస్సు దివ్యంగా ప్రకాశిస్తుంది
నా మేఘ రూపంలో విశ్వ విజ్ఞాన కాంతి వర్ణ భావాలు మెరుస్తున్నాయి
ఆత్మ స్వభావ శాంతి స్వరూప విశ్వ రూప చైతన్యములు మేఘాలలోనే
మేఘాలను తిలకించుటలో ఆకాశం తెలిపే వర్ణ తేజస్సు మీ మేధస్సులలో

కనిపించేవన్నింటిని మేధస్సులోనే

కనిపించేవన్నింటిని మేధస్సులోనే సూక్ష్మాతి సూక్ష్మంగా కణాలుగా దాచుకున్నా
ఆహార పదార్థాలైనా వస్తువులైనా యంత్రములైనా విశ్వ రూపములైనా మేధస్సుననే
ఏ రూపం ఎలా ఉందో నా నేత్రానికి తెలుసు ఎక్కడ ఏది ఉందో నా మేధస్సుకు తెలుసు
ఏది ఎలాంటిదో ఎలా పని చేస్తుందో ప్రతి కార్యాలు నా విజ్ఞానానికి సంపూర్ణంగా తెలుసు
ప్రతీది నాలో ఉంది ప్రతి అణువు రూప వర్ణ స్వభావ కార్యాలు నా మేధస్సులో జ్ఞాపకంగా
కనిపించేవన్నీ నా సొంతం కావు నేను కొనలేను వాటి దగ్గర వెళ్ళలేను అందుకే మేధస్సులో