Sunday, August 1, 2010

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు

మహా గాలికి విశ్వనాధుడు పిడుగులతో నడిచి వస్తుంటే
భూమి చీలికలతో అంచులు కూడా కనపడని విధంగా
అదురుటలో వర్షాలు మొదలై సముద్రంలో కెరటాలు ఉప్పొంగి ప్రవహిస్తుంటే
తన బొటనవేలుకు సూక్ష్మ స్పర్శైనా కలగలేదంటే
అతని ధ్యాస మర్మమై ధ్యాన ధ్యాస వదలని కఠోర దీక్షలో ఉన్నాడనే
ఎక్కడినుండో అతని శిరస్సున ఓ చీమ చేరి తన త్రీనేత్రాన్ని చేరుతుంటే
అప్పుడు కలగిందట స్పర్శగా ఓ జీవి నన్ను కదిలిస్తున్నదని
చీమ తెలుపుటలో ఇలా అంటున్నది
ఘోర ప్రళయానికి నా సూక్ష్మ రూపము నిలవకపోతే నీవే దిక్కని అనుకున్నా
అందుకే " శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు "

No comments:

Post a Comment