Sunday, August 8, 2010

మనలోనే అందరు ఉన్నారు కాని

మనలోనే అందరు ఉన్నారు కాని మనమే అలా జీవించటం లేదు
మన సమస్యలే మనకు ముఖ్యమని ప్రతి రోజు ఆలోచిస్తున్నాము
మనలోనే గాంధి నెహ్రూ శాస్త్రి పటేల్ చంద్రబోస్ లా ఎందరో ఉన్నారు
ఆలోచనలతో ఎన్నో సృష్టిస్తున్న కాలంలో గాంధీలా జీవించలేక పోతున్నాం
గాంధీలా జీవించాలంటే ఏ కార్యాలు చేయాలో తెలియుటలేదా
విజ్ఞానంగా నీవు ఎలా ఎదుగుతున్నావో అలాగే గాంధీలా జీవించు
మితంగా మాట్లాడుతూ ప్రశాంతంగా జీవిస్తూ విజ్ఞానాన్ని తెలపడం
సమాజాన్ని ఓ గొప్ప బాటలో శాంతియుతంగా ఓర్పుతో నడిపించడం
ప్రతి మనిషిలో అన్ని రకాల భావాలు ఆలోచన గుణాలు ఉంటాయి
మనం ఎవరిలా కావాలన్నా అలాగా జీవించగలం గమనిస్తున్నారా
మానవుడే అన్ని రకాలుగా అన్ని విధాల గొప్పగా జీవించవచ్చు
కృష్ణుడు యేసు నానక్ రామకృష్ణ వివేకానందా బుద్దా అందరూ మానవులే
మానవుడే విశ్వ విజ్ఞానంతో మాధవుడై తమ రీతిలో జీవించినవారే
ఆలోచన విధానంలోనే అంతా ఉందని అదే మనల్ని గొప్పగా మార్చుతుంది
ఆలోచనయే మానవ విశ్వ రూపం సాధనయే మాధవ విశ్వ విజ్ఞానం

No comments:

Post a Comment