జీవితాన్ని విశ్వధాతలా మార్చుకోలేకపోతే మానవ జీవితమే
మరలరాని జీవితం తెలుసుకోవాలన్నా మరో జన్మలో గుర్తు రాదే
నేటి జన్మలో మారకపోతే ఇక ఏ జన్మకైనా సామాన్యమైన జీవితమే
విశ్వ ధాతలా వివేకానందుడివై విశ్వ విజ్ఞానాన్ని ఎందరికో విశదీకరించు
నీవు శూన్యమైపోయేలోగా దివ్య కాంతిని మేధస్సున వెలిగించు
ఈ జీవితమే మహాత్ముని ఆత్మ దశ దివ్య జ్ఞాన కాల సమయము
మరల రాని మహా అవకాశం వృధా ఐతే మాధవుడివి ఇక కాలేవు
No comments:
Post a Comment