Thursday, August 12, 2010

విశ్వమున పదహారు దిక్కులలో

విశ్వమున పదహారు దిక్కులలో అన్వేషిస్తున్నా కర్మ స్థితి పెరుగుతున్నది
క్షణములో పదహారు దిక్కులలో నిఘా ఉన్నా కర్మ మరో దిక్కున ఉదయిస్తున్నది
కర్మ కలుగుటకు దిక్కు లేదు క్షణమే అజ్ఞాన కాలంగా గడిచిపోతుంది
పొరపాటైనా ఆత్రేయమైనా అజ్ఞానమైనా సోమరి ఐనా ఆవేదనైనా కర్మ సంభవిస్తుంది
కొన్ని క్షణాలు విజ్ఞానంగా గడిచినా మరో క్షణం కర్మకే సంభవిస్తుంది
కర్మ మేధస్సులో ఉంది అలాగే జీవన స్థితిలో ఉంది అలాగే కాలంతో సాగుతుంది
అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు నశించే విధంగా కలిగే అజ్ఞానమే కర్మ
మనకు నచ్చనిదే కర్మ అనుభవించ లేనిదే కర్మ తెలియక జరిగేదే కర్మ
కర్మ జరుగుతుందని తెలిసినా జాగ్రత్త వహించలేని సూక్ష్మ కాలమే అజ్ఞాన మేధస్సు -
మనకు తెలియని కాలమున మరో విధంగా జరిగిపోయి మరో సమయానికి తెలిసేది కర్మయే -
మరొకరి ద్వారా కలిగేది కర్మయే విజ్ఞానమైనా అందులో దాగినది కర్మ సిద్ధాంతమే
జీవితమంతా కర్మ సిద్ధాంతమే జరిగిపోవుటలో గ్రహిస్తేనే కర్మగా లేదంటే సమస్యల జీవితం -
సమస్యలను తొలగించుకుంటూ వెళ్ళిపోతే విజ్ఞానంగా జీవితం సాగిపోతుంది
మనిషిలోని బలహీనతే కర్మగా భావించవలసి వస్తుంది విజయం లేకపోయినా కర్మేనని తెలుస్తుంది -

No comments:

Post a Comment