విశ్వమే కర్మ సిద్ధాంతం కాలమే అజ్ఞాన ప్రవాహం
విశ్వ కాలమున మానవుడు అజ్ఞానాన్ని తొలిగిస్తూ విజ్ఞానంగా సాగుతున్నాడు
విజ్ఞానముతో అజ్ఞానాన్ని కూడా మానవుడు కలిగి ఉండుటయే కర్మ సిద్ధాంతం
విశ్వమున జరిగే ప్రతి కార్యములో కారణము సరి కాకపోతే కర్మ సంభవిస్తుంది
విశ్వమున కలిగేవన్నీ సమస్యలే కనుక విశ్వం కర్మ సిద్ధాంతంతో సాగుతుంది
మానవుడు అజ్ఞాన ప్రవాహాన్ని మేధస్సున తొలగించుకుంటూ ముందుకు సాగాలి
ప్రతి జీవిలో ప్రతి కార్యములో ఉన్న లోపమే కర్మ సిద్ధాంతంగా తెలుపబడుతున్నది
కాలం ఎప్పుడూ మనిషిలో విజ్ఞానాన్ని మరిపించి అజ్ఞానాన్ని కలిగిస్తుంటుంది
అజ్ఞానాన్ని కార్యానికి ముందుగానే గ్రహించి కార్య కారణముతో సాగితేనే విజ్ఞాన కార్యమవుతుంది -
ప్రతి జీవి విజ్ఞాన కార్యాలు మాత్రమే చేయదు కాలం ఎప్పుడు విజ్ఞానాన్నే తెలుపదు
అజ్ఞాన విజ్ఞాన కార్యాలతో ప్రతి జీవి కర్మతో జీవిస్తూ విశ్వమున ప్రతీది కర్మ సిద్ధాంతంతో జరుగుతుంది -
No comments:
Post a Comment