ఒక రూపం నీకు గుర్తొచ్చిందంటే మేధస్సులో ఆనాటి ఆలోచన నీలో ఉందనే
ఏది నీకు గుర్తొచ్చినా ఆనాటి ఆలోచనలు నీ మేధస్సులో దాగి ఉన్నాయనే
ప్రతీది ఆలోచనగా మేధస్సులో చేరిన తర్వాతనే మరో విధంగా చేరుతుంది
ఆలోచనగా మేధస్సులో చేరకపోతే నీకు గుర్తుండదు ఎలాంటివి గుర్తుకు రావు
ఆలోచనగా చేరిన తర్వాతనే నీవు మరల వేరే విధంగా జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు
రూపాన్నే కాదు ఏ విషయాన్నైనా ఆలోచనగా చేరితేనే జ్ఞాపకంగా ఉంటుంది
No comments:
Post a Comment