Sunday, August 15, 2010

విశ్వమున ఒక్కసారి మానవుడిగా

విశ్వమున ఒక్కసారి మానవుడిగా జన్మించి ఆత్మ విజ్ఞానంగా జీవిస్తే చాలు
మరో జన్మైనా మరో అవతారమైనా మనకు అవసరం లేదనే తెలుపుతున్నా
మరో జన్మలలో మరల మానవుడిగా జన్మిస్తామో లేదో మనకు తెలియదు
ఒక్కసారి మరణించినామంటే మరల ఇలాంటి విజ్ఞాన ధ్యాస ఏనాటికి కలగదు
ఇంతటి విజ్ఞానాన్ని మరల ఏ జన్మలో తెలుసుకోవడానికి అవకాశం రాదు
మిగతా జన్మలలో మనకు ఆహారం జాతి తరాల ధ్యాస తప్ప మరొకటి లేదు
మహా భావాలు వస్తువులు ధనం సాంకేతిక విజ్ఞానం వాహనాలు ఏవీ ఉండవు
నేటి మానవ జన్మనే సార్థకం చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నించాలి
ఆత్మ జ్ఞానంతో ఒకే ఒక మానవ జన్మను సమర్దవంతంగా ముగించుకోండి

No comments:

Post a Comment