Saturday, August 7, 2010

ఆది భిక్షువు విశ్వమున విజ్ఞానముకై

ఆది భిక్షువు విశ్వమున విజ్ఞానముకై వేచియున్నా బూడిదయే రాలుతున్నదట
విశ్వమున యుగాలుగా వేచియున్నా విజ్ఞానాన్ని ఎవరూ ఇవ్వలేకపోతున్నారు
విశ్వాత్మ యోగులందరూ మౌనంతో ధ్యానిస్తూనే ఉన్నారుగాని సూక్ష్మ కదలికలేదు
ఆది భిక్షువే కైలాసమున ధ్యానిస్తూ విశ్వ విజ్ఞానమును తెలుసుకుంటూనే ఉన్నాడు -
విశ్వమున తెలియని విజ్ఞానం అనంతముగా దాగి ఉన్నట్లు ఎవరికి తెలియకపోతున్నది -
విశ్వ విజ్ఞానాన్ని తరలించే మానవ మూర్తి ఇంకా జన్మించలేదా మనకు ఆ శక్తి లేదా -
మన మేధస్సుకు విశ్వ విజ్ఞానాన్ని తరలించే ఆత్మ జ్ఞానం ఉందని గ్రహించి అన్వేషించండి -
మేధస్సులో మరో విశ్వం ఉందని ఆత్మ అన్వేషణతో తెలుసుకుంటే విశ్వ విజ్ఞానం తెలిసినట్లే -

No comments:

Post a Comment