Sunday, August 1, 2010

ఎవరింటి గోల వారిదే - ఎవడి గోల

ఎవరింటి గోల వారిదే - ఎవడి గోల వాడిదే
ప్రతి ఇంటిలో ఒక్కొక్క విధమైన గొడవ
ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క పరిస్థితి
ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా
ఏదో ఒక ఇంటి నుండి ఏదో ఒక గొడవ ప్రతి రోజు వినిపిస్తూనే ఉంటుంది
మనకు తెలియకున్నా జరిగిపోతూనే ఉంటాయి
మనిషి మారలేడు మార్చుకోలేడు
మన భావాలే మనకు ఇతరుల మధ్య తగాదగా ఏర్పడుతుంది
మన ఇంటిలో మనవాళ్ళతోనే చిరాకు చెందుతాం
పెద్ద వారైతే పక్కన వారిని చూసి నేనెప్పుడు అలా కావాలి
నా పిల్లలు ఎప్పుడు అలా సంపాదించాలి ఇతర విషయాలు ఎన్నో
మనిషికి ఆశ ఉన్నంత వరకు అంతే ఎవరూ మార్చలేరు
ఉన్న దానితో తృప్తిగా ఆరోగ్యంగా జీవించండి ఎవరి ఇష్టం వారిదే
మీకు ఏదైనా మార్పు కావాలనుకుంటే కాలమే సహకరిస్తుంది అనుకోండి
ప్రతి విషయాన్నీ గోల చేస్తే ఎవరూ సరిగా పని చేయలేరు
దీని ద్వారా ఇంకొకరి జీవితం కూడా అదోగతి - ప్రశాంతంగా ఆలోచించండి

No comments:

Post a Comment