గాంధీజి గెలిచాడు - ఓడిపోయాడు
దేశాన ఎక్కడో ఉదయించి అహింసా అనే సిద్ధాంతాన్ని జీర్ణం చేసుకుకొని
దేశమంతా ఒకటి కావాలని మన దేశమే మన రాజ్యమని మనమంతా ఒక్కటై
మనమే మన భూమిని దిద్దుకుందాం బానిసత్వాన్ని వదిలేద్దామని
ఆంగ్లేయులను తమ దేశానికి వెళ్ళగొట్టి స్వాతంత్ర్యాన్ని దక్కించుకున్నాడు
భారత దేశ స్వాతంత్ర్యంతో అందరిలో గాంధీజి గెలిచాడు
అందరిలో నుండే ఒక్కరైన నాథూరం గాడ్సే తనదైన శైలిలో గాంధీని ఓడించాడు
గాడ్సేతో యుద్ధం చేయకుండానే ఓడిపోయాడు
అవకాశముంటే గాడ్సేను కూడా గెలిపించేవాడు
యుద్ద వీరునికి వెన్నుపోటు పొడిచిన వీరుడు కాలేడు ఓడినవాడే కాగలడు
No comments:
Post a Comment