Friday, August 20, 2010

విగ్రహాలను ఎంతగా వజ్ర వైడూర్య

విగ్రహాలను ఎంతగా వజ్ర వైడూర్య సువర్ణాలతో అలంకరించినా
ఆకాశాన కనిపించే విశ్వ రూప భావన నాలో కలగటం లేదు
విగ్రహాలను నిర్మించడం అలంకరించడం పూజించడం కన్నా
ఆకాశాన్ని కొన్ని క్షణాలు భావనతో తిలికించడం శ్రేష్టమైనది
సూర్యోదయ సూర్యాస్తములను తిలకించడం మహా శ్రేష్టమైనది
ధ్యానించడం మహా అద్భుతమైన శ్రేష్టతగల దివ్య కార్యము
చరిత్ర విధానాన్ని తెలిపేందుకు విగ్రహాలను శుభ్ర పరచండి

No comments:

Post a Comment