Sunday, August 1, 2010

నేడు వీస్తున్న గాలికి నా నాసికము

నేడు వీస్తున్న గాలికి నా నాసికము పని చేయుటలేదు
ఉచ్చ్వాస నిచ్చ్వాసములు కూడా శరీరములోనే జరుగుతున్నాయి
కలుషితమైన గాలికి ప్రాణ వాయువు లేక శరీరము చిక్కిపోతున్నది
పరిశ్రమలలో సాంకేతిక కృత్రిమ గాలికి ఆనారోగ్యమేగాని లాభం లేదు
నిద్రపోవుటలో కూడా కృత్రిమ గాలితో ఎన్నో రకాలుగా నశించిపోతున్నాం
రాబోయే సంవత్సరాలకు నాసికమున యంత్రములే అవసరం
జన్మతో నాసిక యంత్రమాట లేదంటే మరణమట అదే జీవితమట
ఇలాంటి పరిస్థితులు వచ్చినా జన సంఖ్య మాత్రం కొన్ని వేల లక్షల కోట్లలోనే
కొందరికి తినడానికి సరైన తిండి లేకున్నా కుటుంబాలుగా ఎందరో అన్నట్లు
ముక్కుకు యంత్రమే కదా చిలుకలా కోట్లలో ఇబ్బందులైనా
అనారోగ్యమైనా పెద్ద కుటుంబాలుగా జీవిస్తామంటున్నారు
----
సహజ ప్రాణ వాయువుకై ప్రకృతిలో జీవిద్దామంటే భూమి మనది కాదే
కొందామన్నా ధరలకు ఆస్తులే పొతే తినడానికి ఏమీ ఉండదే
ఒక వేళ సంపాదించి కొన్నా పక్కవాడు పరిశ్రమను స్థాపిస్తే
ఆహారాన్ని పండించే పంటలు కూడా కలుషితమై మనిషికి శక్తి లేక
ప్రపంచమంతా కృత్రిమ గాలితోనే అనారోగ్య ఆర్థిక ఇతర ఇబ్బందులే
మంచి ఆహారాన్ని భుజించండి ప్రకృతిని ఆశ్వాదించండి

No comments:

Post a Comment