ఆకాశం నీ శిరస్సుపై ఉన్నంతవరకు నీతో ప్రకృతి ఎప్పుడూ ఉంటుంది
ప్రకృతి నీతో ఉన్నంతవరకు నీ మేధస్సులో కాల అనుభవం ఉంటుంది
అనుభవంతో జీవిస్తున్నంత కాలం కాల ప్రభావాలు తెలుస్తూనే ఉంటాయి
నీకు తెలియని విషయాలను మరల అర్థమగుటకు ఆకాశాన్ని తిలకించు
ఆకాశంలో విజ్ఞానాన్ని గ్రహించగలిగితే ఆత్మ జ్ఞానం మేధస్సున కలుగును
ఆత్మ జ్ఞానంతో ఆకాశ నిర్మల తత్వ విశ్వ భావ విజ్ఞాన కమలాన్ని మేధస్సున ధరించగలవు
No comments:
Post a Comment