ఆకాశాన్ని గమనిస్తున్నంత వరకు నీలో విజ్ఞానం చేరుతూనే ఉంటుంది
నీకు నీవే నీలో నీవే ఆలోచిస్తూ నీకు కలిగే భావాలను అర్థం చేసుకోవాలి
ఆకాశాన ఏర్పడే వర్ణ చిత్రాలను మనం అలాగే చిత్రీకరించవచ్చు చూడవచ్చు
ఆకాశాన ఏర్పడే చిత్రాలకు భావాలను మాత్రం ఖచ్చితంగా గ్రహించలేము
మేఘ మబ్బుల వలన వర్షాలు వస్తాయని తెలుస్తుందే తప్ప వేరే భావాలను గ్రహించలేము -
అనుభవం ఉంటే తప్ప కొన్ని భావాలను తెలుసుకోగలం గ్రహించగలం
విశ్వ భావాలను గ్రహించే ఆత్మ జ్ఞాన ధ్యాన మేధస్సు గల వారికే భావార్థాలు తెలుస్తాయి -
ఆత్మ జ్ఞానంతో ఆకాశాన్ని తిలకిస్తే నీలో విశ్వ విజ్ఞానం చేరుతూనే ఉంటుంది
No comments:
Post a Comment