Monday, August 23, 2010

ప్రతి జీవి మేధస్సు ఓ విశ్వ లోకముగా

ప్రతి జీవి మేధస్సు ఓ విశ్వ లోకముగా జన్మించినప్పటి నుండి ఎదుగుతుంది
ఎప్పుడైతే స్వతహాగా జీవించగలదో ఇక ఆ లోకం ప్రయాణిస్తూనే ఉంటుంది
ఎక్కడైనా వెళ్ళగలదు ఏదైనా చేయగలదు అజ్ఞానం లేదా విజ్ఞానం కావచ్చు
తల్లిదండ్రులను వదిలిపోవచ్చు ఎలాంటి కొత్త జీవితాన్నైనా ప్రారంభించవచ్చు
ప్రపంచములో ఎక్కడికైనా వెళ్లి ఎలాగైనా ఎవరితోనైనా జీవిస్తూ ఎదగవచ్చు
ఒక్క సారి మరణిస్తే ఆ చిన్న విశ్వ లోకం జగతిలో శూన్యమై పోతుంది
శూన్యమయ్యే విశ్వ మేధస్సు లోకాలు మహా విశ్వమున అజ్ఞాన లోకమైతే
ఎన్నో లోకాలన్నీ అజ్ఞానమై మహా విశ్వమంతా అజ్ఞానంతో గడిచిపోతుంది
నీ మేధస్సు లోకాన్ని మహా విశ్వ లోకానికి విజ్ఞానం అందిచేలా ఆలోచించాలి

No comments:

Post a Comment