14 ఆగస్టు 2010 నాకు అనిపించింది ఇలా
చీకటవుతున్న వేళలో 7 గంటల సమయాన
పడమర దిక్కున కనిపించిన మహా తేజస్సు నక్షత్రం
9 గంటల సమయంలో అస్తమించింది
మరల 10 గంటలకు తూర్పున చూస్తుంటే
అదే తేజస్సు గల మహా నక్షత్రం కనిపించింది
ఒకే నక్షత్రం పడమర అస్తమించి తూర్పున ఉదయించిందేమో
నక్షత్రాలను కొన్ని నిమిషాలు తిలకించడం నా అలవాటు
నా అనుభవ పూర్వకంగా నాకు అనిపించింది ఇలా
పరిణామం ఆకార రూపం దివ్య తేజస్సు ప్రకాశించే విధానం
భావ స్వభావం సమయ కాంతి కిరణ దిశలు అన్నీ అలాగే
ఆ అనుభూతి విశ్వమున నా ఒక్కడిదే
No comments:
Post a Comment