Thursday, August 19, 2010

2010 ఆగస్టు 19 న - సాయంత్రం

2010 ఆగస్టు 19 న - సాయంత్రం 6 గం 20 ని కు (కర్నాటక - బెంగళూరులో)
సూర్యాస్తమున పడమర దిక్కున మేఘాల పొరలలో బంగారు లోకం వెలిసింది
సూర్య కిరణాలకు మేఘాలు సువర్ణాలతో మెరుస్తూ దివ్య కాంతిని సృష్టించాయి
15 నిమిషాల కాల వ్యవధిలో వెలిగిన కాంతులు నేత్రాలకు మహా విశ్వ అద్భుతాలే
మహాత్ముల రూపం కన్నా మహా స్వచ్ఛమైన తేజోదయంతో నన్ను దర్శించాయి
నా నేత్ర కాంతులు మేధస్సును చేరి విశ్వ తత్వ భావాలను తెలుపుతున్నాయి
ఇలాంటి విశ్వ భావ సూర్యాస్త మేఘ కిరణ లోకాలను విశ్వంలో ఎన్నో దర్శించాను
కుంకుమ తిలక నేత్ర రూప లోకాన్ని ఎన్నో విధాల ఆకాశాన దివ్యత్వంతో దర్శించాను
ఆకాశాన్ని తిలకించడం నేర్చుకుంటే విశ్వ భావాలు మీలో ఆధ్యాత్మతో కలుగుతాయి

No comments:

Post a Comment