Friday, August 13, 2010

గాలిలా వస్తున్న భావనను గమనిస్తే

గాలిలా వస్తున్న భావనను గమనిస్తే ఆలోచనగా మనలో కలుగుతుంది
ఆలోచనను కొంత సమయం సంపూర్ణంగా గమనిస్తే అర్థమే తెలుస్తుంది
ఆలోచనలో దాగిన అర్థాన్ని గమనిస్తే విజ్ఞానంగా పరమార్థమే తెలుస్తుంది
పరమార్థంతో కూడిన విజ్ఞాన ఆలోచనను గమనిస్తే సత్యమేదో తెలుస్తుంది
సత్యాన్ని తెలుసుకునే వరకు ఏ అజ్ఞాన కార్యాన్ని చేయకని ఆలోచనే తెలుపును
విజ్ఞానంగా సాగిపోవాలని మన మేధస్సులో ఆలోచనలు తెలుపుతున్నాయి
గాలిలా వచ్చే ఆలోచనలను మేధస్సులో సేకరిస్తే విజ్ఞానంగా ఎదుగుతాము
ఆలోచనలను వదిలేస్తే విజ్ఞానంలేని అల్ప జ్ఞానులుగా మిగిలిపోతాము
గాలి ఎప్పుడూ ఎక్కడెక్కడో వీస్తున్నట్లు ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి
ఆలోచనలను ఎంత విజ్ఞానంగా మార్చుకుంటే అంత గొప్పవారవుతాము

No comments:

Post a Comment