అయ్యో! జీవితం ఇంతే కదా ఏమో ఎవరికి తెలుసు
నీకు తెలుసా ఇంతేనని నేను ఇంకెంతో అనుకున్నా
తెలిసిందా ఇంతేనట మనమే ఎంతో ఉందని ఊహించాం
ఇంతే ఐతే ఇంకా ఎందుకు ఇలా జీవిస్తూనే ఉన్నాం
వృద్ధాప్యం వచ్చినా మరణించలేక వందేళ్ళు దాటేస్తున్నాం
కొందరికి ఇంతే మరి కొందరికి ఇంకెంతో ఉంటుంది
ఇంతేనని తెలిసినా ఇంకెంతో ఉందని జీవిస్తూనే ఉన్నాము
ఇంకెంతో ఉందని ఏదో ఒకదానిని తెలుసుకుంటూనే ఉన్నాం
ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎవరికి తెలియనిదే ఎంతోనని
జీవితం ఎంతైతేనేం మరణించేంతవరకు జీవించాలని
ఓ విజ్ఞాన జీవితాన్ని సాగిస్తూ విశ్వ ప్రయాణం చేయండి
No comments:
Post a Comment