నిద్రించని భావాలు ఆకలి కలగనప్పుడు యుగాలుగా కొనసాగితే
జీవితంలో ఆహార నిద్రలు ఇక ఎన్నడూ కలగవని మేలుకొంటాం
ప్రయాణమున అలసట లేక విశ్వమంతా విజ్ఞానంతో తిరగగలిగితే
మరో విశ్వంలో ధ్యానిస్తూ అనంత విశ్వ లోకాలను తిలకించవచ్చు
శూన్యాన్ని కూడా అన్వేషించి మర్మ లోకానికి వెళ్లి జీవించవచ్చు
అపారమైన సాధన ఆత్మ జ్ఞానముచే సాగిస్తే శ్వాసే విశ్వమవుతుంది
విశ్వమునకు కాల భావాలే కాని ఆహార నిద్రలు ఉండవని తెలుస్తుంది
No comments:
Post a Comment