ఒకరు తెలిపెంత వరకు మనలో అన్వేషణ లేకపోతే
మనలో దుఖ్ఖ విచక్షణ లేదని క్షుణ్ణంగా తెలుస్తుంది
దుఖ్ఖము నుండే ఆత్మ అన్వేషణ మొదలు కావాలి
సూక్ష్మ సంతోషంతో మహా దుఖ్ఖాన్ని మరచిపోతున్నాం
మన దుఖ్ఖాన్ని మరచిపోయినా మన వాళ్లకు దుఖ్ఖము కలగరాదని
మనలో అన్వేషణ లేకపోతే ఆత్మ జ్ఞానం తెలియక చింతిస్తూనే ఉంటాం
మన దుఖ్ఖానికి మనమే భాధ్యులం మనమే వదిలించుకోవాలి
విశ్వ విజ్ఞాన ధ్యానమే మన ఆత్మ జ్ఞాన సంతోషము
No comments:
Post a Comment