నీవు కూర్చున్నప్పుడు చేతులు పాదాలను తాకుతుంటే నీవు అజ్ఞానివే
నీవు కూర్చున్నప్పుడు చేతులు పాద రక్షాలను తాకుతుంటే నీలో అశుభ్రతయే
ఇది పొరపాటు కాదు అలవాటుగా చేసుకున్న అజ్ఞాన అశుభ్రత మతిలేని గుణం
ఇలాంటి వారు పాద రక్షాలను తాకినా అలాగే భోంచేస్తారు ఏవైనా అలాగే తింటారు
వేటినంటే వాటిని తాకుతూ ఉంటారు వస్తువుల యొక్క పవిత్రతను ఆలోచించరు
కొత్త వస్తువులను అశుభ్రతగా మంచి గుణాలు లేక ఎలాగంటే అలా వాడుతారు
ఇలాంటి వారు భగవంతునికి పూజలు ఎలా చేస్తారో నమస్కరిస్తారో అర్థం కావటం లేదు
తమ ఇంటిలో ఎలా ఉన్నా కనీసం మరొకరి ఇంటిలో కూడా అశుభ్రతగా జీవిస్తే ఎలా
"మేధస్సులో మహా దివ్య గుణాలు సూర్య కిరణ తేజస్సు లేకపోవడమే అజ్ఞాన అశుభ్రత "
ఎంత విద్య నేర్చినా అశుభ్రతగా అజ్ఞానంతో జీవించుట మానవ మేధస్సుకే శోచనీయం
కనీసం పిల్లలకు తల్లి తండ్రులు కూడా చెప్పకపోతే దివ్య గుణాలు ఎలా తెలుస్తాయి
తల్లి తండ్రులే అశుభ్రతగా జీవిస్తున్నప్పుడు పిల్లలకు ఏమని తెలుపగలరు
ఎవరో పలికిన అజ్ఞాన మాటలను ఇంటిలో తమ పిల్లలు పలికినా ఏమనటం లేదు
సమాజంలో శుభ్రత జ్ఞానం చాల తక్కువగా కొందరి యోగుల జీవితాలలో మాత్రమే
No comments:
Post a Comment