నాలో కలిగే భావాలు మహా అద్భుత రూపాలకై కలిగినవే
ప్రతి విశ్వ ప్రపంచ రూపాలలో నా భావాలు జీవిస్తుంటాయి
ప్రకృతి రూపాలైనా ప్రపంచపు కృత్రిమ నిర్మాణాలైనా నా భావాలే
అద్భుత రూపాలలో అద్భుతంగా నిలిచే భావనను నేనే
మెరిసే ప్రతి అద్భుత రూపంలో నా భావన ఉదయిస్తుంటుంది
విశ్వమున ఏ రూపం ఎక్కడున్నా నా భావన జీవితం అక్కడే
మహా భావాలతో మహా విశ్వ విజ్ఞానంతో విశ్వ ప్రపంచంలో జీవించండి
No comments:
Post a Comment