మనలోని గుణ స్వభావాల వలనే ప్రమాదాలు జరుగుతాయి
అతి వేగంగా వాహనాన్ని నడుపుటలో గుణ భావాలు యదా స్థితిని త్వరగా చేరుకోవు
యదా స్థితిని త్వరగా చేరుకోలేక అతి వేగాన్ని తగ్గించలేక ప్రమాదాలు జరుగుతాయి
ఒకరు సాధారణ వేగంతో వెళ్ళుతున్నా మరొకరు అతి వేగంగా వచ్చినా ప్రమాదమే
ఎప్పుడైతే మనకు ప్రక్కలా గాని ఎదురుగా గాని అతి వేగంగా వస్తున్నట్లయితే మనమైనా నిదానంగా
ఎవరి గుణ భావాలు ఎప్పుడు ఏ కార్యాలోచనలతో ఎలా ఉంటాయో వారి వేగం ఎలా ఉంటుందో
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు మేల్కోండి
ఎప్పుడూ ప్రశాంతంగా మేధస్సున ఓ దివ్య ఆలోచనతో వెళ్లితేనే గుణ స్వభావాలు శాంతిస్తాయి
బ్రంహ ముహూర్తంలో కూడా ఎన్నో ఘోర ప్రమాదాలు జరుగుటలో మానవ విధి రాతల స్వభావమేనా
ఎటువంటి రహదారులలో ఎలా వాహనాన్ని నడపాలో జాగ్రత్తగా ఆలోచించి ప్రశాంతంగా వెళ్ళండి
నేటి కాలమున ఎన్నో జీవరాసులు వాహనాలకు బలి అవుతూనే ఉన్నాయి తెలుసుకోండి
గుణ స్వభావాల ప్రశాంతతకై ధ్యానిస్తూ జీవించండి ప్రతి కార్యం ఓ అర్థంగా సాగుతుంది
No comments:
Post a Comment