Sunday, November 21, 2010

ఆహారం శరీరానికి అవయవాలకు

ఆహారం శరీరానికి అవయవాలకు శక్తిని మాత్రమే ఇవ్వగలదు
వివేకానికి విజ్ఞానానికి ఆలోచనకు ఆహార శక్తిలోని ఉత్తేజం కావాలి
ఎప్పుడైతే మనలో ఉత్తేజం ఉంటుందో అప్పుడే ఆలోచనలు చురుకుగా ఉంటాయి
ఆలోచనల తీవ్రత ఉన్నప్పుడే గొప్ప భావాలు మనలో ఉద్భవిస్తాయి
ఎప్పుడు ఎటువంటి ఆలోచనలు ఎలా కలుగుతాయో కాలానికే ఎరుక
ఆలోచనలపై గమనం ఉంటేనే సూక్ష్మ భావాల గొప్ప ఆలోచనలను గ్రహించగలం
శరీర ఉత్తేజానికే మంచి ఆహారాన్ని తీసుకోవలసిన అవసరం ఉంటుంది
శరీర ఉత్తేజం వల్ల ఆలచనల తీవ్రత వేగంగా అలాగే ఆరోగ్యంగా ఉంటాము
మేధస్సులో ఉత్తేజం కలగాలంటే సూర్య తేజస్సు కిరణాలను గ్రహించాలి
సూర్యోదయ సూర్యాస్తమయ గడియలలో సూర్య తేజస్సును తిలకించాలి
తిలకించుటలో కిరణాలు మేధస్సులో గొప్ప ఆలోచనలను కలిగిస్తాయి
మనిషి శుభ్రతగా ఉండి శుభ్రతమైన ఆహారాన్ని భుజిస్తే మహా గొప్ప ఆలోచనలు కలుగుతాయి
మనకు కనిపించే ప్రాంతమంతా శుభ్రతగా ఉంటే అద్భుతమైన ఆలోచనలు ఎన్నో కలుగుతాయి
కనిపించే ప్రాంతమంతా శుభ్రతగా ఉంటే సమాజంలో చాలా సమస్యలు ఉండవు
శుభ్రత లేకపోవడం వలనే మేధస్సు సరిగా ఆలోచించక మతి స్థిమితం కలుగుతుంది

No comments:

Post a Comment