భూలోకాన్ని దాటించే విశ్వ లోక ప్రదేశం ఎక్కడున్నది
ఏ ఆకాశపు పొరలలో ద్వారపు అంచులు కలిసియున్నాయి
ఎప్పుడు ఎలా విశ్వంలో అడుగు వేసి ప్రయాణించగలం
విశ్వ రూపాల విజ్ఞానాన్ని ఎప్పుడు గ్రహించగలం
ఎలాంటి భావాలు విశ్వంలో కలుగుతాయి ఎలా జీవిస్తాం
జీవితం ఎలా సాగుతుందో ఏ భావన ఎందుకో తెలుసుకోగలమా
విశ్వంలో మరణించిన తర్వాతనే ఆత్మగా ప్రవేశించగలమా
నా భావాలు విశ్వలోక ద్వారాన్ని దాటి వెళ్ళిపోతున్నాయి
No comments:
Post a Comment