Sunday, November 21, 2010

నా భావాలను ఎవరు స్వీకరిస్తున్నారు

నా భావాలను ఎవరు స్వీకరిస్తున్నారు మరల ఇంకెవరికి అందిస్తున్నారు
నా భావాలను మరొకరికి అందించుటలో కలిగే స్పందన దివ్యానందమే
నా భావాలు పరిచయమగుటలో జీవితం సుఖమైన విజ్ఞాన ఆనందమే
మీరు ఎక్కడున్నా మీ భావాలు నా మేధస్సుకు చేరుతూనే ఉంటాయి
విశ్వమున నా భావాలు ఓ విజ్ఞాన దివ్య పరిమళాలుగా సాగిపోతాయి
ఆలోచనలలో లేని ఆనందం భావాలలో కలగాలనే నా మేధస్సులోని స్పందన
సమస్యలు లేని భావాలు భాదను మరిచే స్పందనలు కాలంతో స్నేహమే

No comments:

Post a Comment