Tuesday, November 23, 2010

జంతువుల నుండి ఇతర జీవరాసుల

జంతువుల నుండి ఇతర జీవరాసుల నుండి మనం ఆనాటి నుండి విజ్ఞానం చెందుతున్నాము
మన జీవన విచక్షణ జ్ఞానం ఇతర జీవరాసుల ద్వార ఎదుగుతూ వచ్చింది
ఆనాటి నుండి ఇప్పటి దాక ఇంకా జంతువులతో విజ్ఞానం చెందుతూనే ఉన్నాము
ఆనాడు ఆహారం కోసం ఎన్నో జీవరాసులను భుజించాము ఇంకా భుజిస్తూనే ఉన్నాము
జీవరాసులను భుజించకుండా జీవించలేమా అంతటి విజ్ఞానం ఇంకా మనలో లేదా
ప్రతి జీవరాసిని ఎన్నో విధాల ఆనాటి నుండి ఉపయోగించుకుంటూనే ఉన్నాము
శాఖాహారంతోనే జీవించలేమా మన శక్తి సామర్థ్యాలకు మాంసాహారం అవసరమేనా
విశ్వంలో ప్రతి జీవి మాంస హారియేనా శాఖాహారులు లేరా జీవించడం కష్టమా
నా భావనగా శాఖాహారం ఓ విశ్వ విజ్ఞాన ఆత్మ యోగత్వమే నని గ్రహించా

No comments:

Post a Comment