Sunday, November 28, 2010

నేను అర్ద రాత్రి వేళ నక్షత్రాన్ని

నేను అర్ద రాత్రి వేళ నక్షత్రాన్ని తిలకిస్తున్నప్పుడు ఓ పక్షి ఎక్కడికో ప్రయాణిస్తున్నది
చాల ఎత్తులో ఎన్నో వందల మైళ్ళు ఓ నివాస స్థావరానికై అన్వేషిస్తూ ప్రయాణిస్తున్నది
ఈ విశ్వంలో తనకు ఓ జీవన అన్వేషణగా జీవితం స్వయంకృషి అనుభవంతో సాగుతున్నది
రాబోయే సమస్యలకు కాల పరిస్థితులకు ఓ నిర్దిష్ట ప్రణాళిక కోసం రాత్రి వేళలో ప్రయాణిస్తున్నట్లున్నది
తమ మహా కుటుంబానికి ఓ అనుభవ దిక్కుగా కర్తవ్య కర్తగా సూచన దారిలా కృషిస్తున్నది
ఏ చిన్న పక్షి తప్పి పోయినా చనిపోయినా ఆరోగ్యం చెడినా ఆకలి వేసినా సరైన జాగ్రత్తలు తీసుకుంటుంది
మనకు ముఖ్యమంత్రి ఎలాగో అలా ఆ పక్షి తన అనుభవ విజ్ఞానాన్ని విశ్వ గుణంతో పంచుతున్నది
పక్షులలో చూశాను ఎన్నో జీవితాలు ఎన్నో ఆలోచించాను నా మేధస్సు విజ్ఞానంతో పక్షుల భావనతో
విశ్వమున పక్షి ఐనా జంతువైనా క్రిమికీటకమైనా సూక్ష్మ జీవైనా ప్రతి జీవి జీవిత భావాలు నా మేధస్సులలో

No comments:

Post a Comment