చతుర్కోణ కేంద్ర భుజాన్ని నిర్మించాలని ఆ మహా ఆలోచన ఎలా కలిగింది
ఎవరిలో ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలిగిందో ఆ మహా అద్భుత ఆలోచన
ఆ ఆలోచనను గ్రహించిన ఆ మనిషి విశ్వ శక్తిలో ఓ మహా యోగి తత్వవేత్తయే
ఆ ఆలోచనను అతను ఎవరికి ఎలా ఏ భావంతో తెలిపాడో ఎవరికి అర్థమైనదో
చతుర్కోణ కేంద్ర భుజాన్ని ఎలా నిర్మించాలో ప్రణాళికను ఎలా తయారు చేశారో
నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎవరిది ఎంత ఖర్చు కాగలదు ఎంత కాలం పడుతుంది
చతుర్కోణ కేంద్ర భుజం వల్ల ఉపయోగమేమిటోనని ఆనాడు గ్రహించారా
ఎవరితో ఎందరితో ఎన్ని రకాలుగా నిర్మాణాన్ని సాగించాలని పరిష్కారించారు
నిర్మాణ విధానాన్ని కొలతలతో వివిధ రకాల ముందస్తు ప్రణాళిక ఎవరు తెలిపారు
ప్రణాళికను వివరించేటప్పుడు మహా నిర్మాణమని అసాధ్యమని వారెవరికి అనిపించలేదా
నిర్మాణానికి ఉపయోగించిన వస్తు సామగ్రి ఏవేవి ఎంత ఎక్కడ నుండి ఎలా తరలిచారు
ఒక రాయి బరువు దాదాపు రెండు టన్నుల పై ఉంటే నాలుగు వందల అడుగులపైన ఎలా తరలించారు
750 అడుగుల పొడవు వెడల్పుల విస్తీరణంలో రాళ్ళను చతుర్కోణ కేంద్రంగా 400 అడుగుల పై వరకు ఎలా అమర్చారో
నిర్మించే వారికి కట్టే విధానాన్ని అర్థమయ్యేలా ఎవరు ఎలా వివరించారు
నిర్మాణ సమయంలో ఎదుర్కొన్న సమస్యలు ఏవి ఎవరైనా మరణించారా
ఆనాటి మానవుల నిర్మాణ శక్తి సామర్థ్యాలు ఆహార వంటకాలు ఎలాంటివి
రోజు పనిచేసే వేళలు ఎప్పటి నుండి ఎప్పటి దాక ఏ రోజు సెలవు తీసుకునేవారు
పనిచేసే వారికి ఎంత ఆర్థిక వేతనాన్ని ఇచ్చే వారు లేదా కేవలం వస్తువులు లేదా ఆహారమేనా
ఆనాటి వారు పూజించిన రూపాలు ఏవి ఎలా వేటితో పూజించేవారు
ఆనాటి నుండి ఇప్పటివరకు ఆ నిర్మాణం ఓ మహా అద్భుత విశేషంగా నిలిచింది
శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం అప్పట్లో అంతంత మాత్రమే నేటిలా లిపిలేని కాలమే
చతుర్కోణ కేంద్ర భుజంలో దాగిన శాస్త్రీయ విశ్వ విశేషాలు ఎన్నో ఇంకా తెలియకున్నాయి
ఆనాటి మొదటి ఆలోచన నుండి నిర్మాణం పూర్తయ్యే వరకు కలిగిన కాల భావాలన్నీ నా మేధస్సులోనే
No comments:
Post a Comment