ఇహ లోక పర లోక జ్ఞానాన్ని అన్వేషిస్తే జీవితమే ఆగిపోతుంది గాని ప్రయాణం ఆగదు
ఇహలోక జ్ఞానం జీవించుటతో ఆగిపోయినా ఆత్మ భావనతో పరలోక ప్రయాణం సాగుతుంది
ఇహలోక జ్ఞానం శరీరం ఉన్నంత వరకే శరీరం ఓర్చుకునే భావ స్వభావ గుణ విజ్ఞానమే
పరలోక జ్ఞానం విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించుట దేహాన్ని చాలించినా ఆత్మ ప్రయాణాన్ని సాగిస్తుంది
విశ్వ విజ్ఞాన అన్వేషణలో ఆత్మ ప్రయాణిస్తే అంతం ఏనాటికి ఉండదు కాలంతో సాగిపోతూనే ఉంటుంది
ఇహలోక జ్ఞానంతో పరలోక జ్ఞానాన్ని అన్వేషించే ఆలోచన ఆత్మ ఎరుకకు కలిగే జీవిత విమోచన
పరలోక ప్రయాణం యోగ తత్వంతో విశ్వ భావాలతో సూక్ష్మ శూన్య విచక్షణతో సాగే అన్వేషణ
No comments:
Post a Comment