Tuesday, November 23, 2010

మేధస్సుకు భావన ఎలా

మేధస్సుకు భావన ఎలా కలుగుతుందోగాని ఆలోచనలతో పరిగెత్తేస్తుంది
అజ్ఞానం విజ్ఞానం గ్రహచారం సంతోషం దుఃఖం ఎన్నో విధాల క్షణాలలో మార్చేస్తుంది
మేధస్సు చెప్పినట్లు మనస్సు వినదు మనస్సు చెప్పినట్లు మేధస్సు వినదు
ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైన భావాలను మేధస్సు మనస్సు కలిపిస్తూ ఉంటాయి
మనకు నచ్చకున్నా కొన్ని కార్యాలు మన మేధస్సు లేదా మనస్సు చేయనిస్తుంది
కొన్ని సందర్భాలలో నిదానంగా కొన్ని సందర్భాలలో వేగంగా నిర్ణయం తీసుకోవలసి వస్తుంది
జీవితం ఎలా వెళ్ళిపోతుందో గాని కొన్న సమయాలలో గత దుఃఖ భావాలను తలిస్తే భాదనిపిస్తుంది
విశ్వ విజ్ఞానంగా మన జీవితం కాలానికి తెలుసనీ ప్రతీది విశ్వ కార్యమేనని అనుకుంటే కాస్త ప్రశాంతత
ఆర్థికంగా ఆరోగ్యకంగా కలిగే నష్టాలే దుఃఖంగా జీవితాన్ని చాలా భాధగా కాలం సాగిస్తున్నది
మేధస్సులో ఎన్నో భావాలు ఎన్నో రకాలుగా చేరిపోతూనే జీవితాన్ని సాగిస్తున్నాయి
అన్నీ అనుభవ జీవితం కోసమే నని భావిస్తూ సాగిపోవాలనే నా విజ్ఞాన సందేశం

No comments:

Post a Comment