మేధస్సులో సూర్య కిరణ తేజస్సు భావన లేకపోతే ఆలోచనలు ఉత్తేజంగా ఉండవు
కాలం గడవకపోయినా మేధస్సులో ఆలోచనలు ఉత్తేజాన్ని కోల్పోయి ఏ కార్యాన్ని చేయనీయవు
మేధస్సులో ఉత్తేజాన్ని కలిగించుట కోసం మనస్సును సూర్య తేజస్సు భావనలతో ఏకీభవించాలి
కొత్తదనం కోసం అన్వేషిస్తూ జీవితాన్ని వివిధ కార్యాలతో సమయచితంగా ఆలోచిస్తూ సాగనించాలి
సూర్య కిరణ తేజస్సును తిలకిస్తూ కొత్త భావాలతో మేధస్సును ఉత్తేజ పరుస్తూ విజ్ఞానంగా జీవించాలి
వాతావరణ ప్రభావాలు సూర్య తేజస్సును మేఘాలతో కప్పి ఉంటే ఓ సూర్య కిరణాన్ని తలుచుకోండి
మహా దివ్యమైన వెలుగులు జిమ్మె సూర్య కిరణం మీ మేధస్సును కొంత వరకు ఉత్తేజ పరచగలదు
మహా కాంతి భావాలను మేధస్సున నక్షత్రాల వలె దర్శించి ఆలోచనలతో మహా కార్యాలను సాగించండి
No comments:
Post a Comment