Sunday, November 21, 2010

మనిషికి మేలుచేసే సాంకేతిక యంత్రాలు

మనిషికి మేలు చేసే సాంకేతిక యంత్రాలు ఎన్ని వచ్చినా
కాల కృత్యములు తీర్చుకునేందుకు జీవితమంతా అవస్థలే
ఎన్నో విధాల మనకు ఉపయోగపడేలా యంత్రాలను సృస్టిస్తున్నా
జీవితంలో ఇంకా సమస్యలు తీరని విధంగానే ఉన్నాయి
మర మనుషుల్లా యంత్రాలతో పని చేపిస్తున్నా
మన పనులు మనకు చాలా భారమై పోతున్నాయి
శరీరంలో శక్తి సామర్థ్యాలు తగ్గి మేధస్సులో సోమరితనం ఏర్పడుతున్నది
ఇంకా ఎన్ని యంత్రాలు వచ్చినా మనిషిలో ఎన్నో సమస్యలు మిగిలిపోతాయి
సరైన సౌష్టవ ఆకారంతో సరైన శక్తి సామర్థ్యాలతో పని చేసుకుంటూ జీవించండి
జీవితం భారమైతే జీవనం సాగలేక మరో మనిషికి ఉపయోగం లేక పోతాము

No comments:

Post a Comment