ఒక్కసారి ఆత్మకు వెల్లిపోవాలనే భావన కలిగితే శరీరాన్ని అక్కడికక్కడే వదిలేస్తుంది
ఓ క్షణ ఆలస్యం లేకుండా శ్వాసతో యదావిధిగా విశ్వ లోక ప్రయాణాన్ని సాగిస్తుంది
మనిషి మేధస్సులో ఎన్ని ఆశయాలున్నా ఎంత విజ్ఞానం ఉన్నా ప్రయాణంలో తిరుగులేదు
భావనను మార్చుకునే తత్వం మరణ భావనకు లేదు ఆత్మ ధ్యాసే వేరు
శరీరం ఏ స్థితిలో ఉన్నా ఆత్మ నిర్ణయంలో మార్పులేదు
శరీరం కూలిపోతున్నా ఆత్మకు మరణ భావన లేకపోతే అష్ట కష్టాలతో నైనా జీవిస్తుంది
అనారోగ్యమైనా మహా రోగమైనా మరణ భావన లేకపోతే శరీరం భారమైనా జీవించాల్సిందే
శ్వాసపై ధ్యాస పెడితే శ్వాసనే గమనిస్తే చాలా కాలం జీవించవచ్చని నా ప్రఘాడ ఆత్మ విశ్వాసం
No comments:
Post a Comment