ఏ అద్భుత భావాలైనా ఒక రోజులో అంతమైపోతాయి
మళ్ళీ మరుసటి రోజు కొత్త భావాలను అన్వేషిస్తాము
ప్రతి రోజు మనకు కావలసిన భావాలకై ఆలోచనల ప్రయాణమే
గొప్ప భావాలు మేధస్సుకు అందకపోతే ఆలోచనలలో ఏదో అన్వేషణ
మేధస్సులో మహా భావాలు లేకపోతే జీవిచడం భారమైపోతుంది
ఎంతటి మహా భావాలైన ఓ సారి నిద్రపోతే మేల్కొనుటలో సాధారణంగా తోస్తాయి
గత భావాలు ఎంత గొప్పవైన భూత కాల సాధారణంగా అనిపిస్తాయి
అద్భుతాలను తిలకించేటప్పుడే మహా గొప్పవిగా అనిపిస్తాయి తర్వాత మరల మామూలే
ప్రతి రోజు ఏవో కొత్త అన్వేషణ మేధస్సులో కలగాలని కొత్త భావాలతో ఎదురుచూస్తుంటాము
మేధస్సులో కొత్త భావాలు కలగాలంటే ఉత్తేజమైన సూర్య తేజస్సు కిరణాలను తిలకించడమే
No comments:
Post a Comment