మన దగ్గర లేని వస్తువు ఇంకొకరి దగ్గర ఉండుటలో మనలో కలిగే భావన ఏది
మనకు కావలసిన వస్తువు మన దగ్గర లేక ఇంకొకరి దగ్గర ఆ వస్తువున్నది
అలాంటి వస్తువును కొనగలిగే శక్తి సంపద మన దగ్గర లేదు ఎందుకు ఈ వ్యత్యాసం
ఒకరికి అవసరం లేకున్నా ఎన్నో సదుపాయాలూ ఎంతో సంపద ఉంటుంది
కనీసం కావలసిన ఆహారం కూడా తినలేకపోతే అలాంటి జీవితం ఎందుకో
పెద్దవారిగా మనకు సమాజ విధానం తెలిసినా చిన్న వారికి ఎలా అర్థమవుతుంది
ఎదుగుటలో దక్కనివి ఎదిగిన తర్వాత దక్కించుకోవాలనే భావాలు ఎలాంటివి
ఓ మనిషికి కావలసినవి జీవితంలో ఎంత శ్రమించినా దక్కకపోతే జన్మించుట కూడా ఆశించుటయేనా
మనిషి ప్రతీది ఆశిస్తూ ఆశయాలతో జీవిస్తున్నాడే గాని ఏవి దక్కవని తెలిసినా జీవితాన్ని సాగిస్తున్నాడు
ఆశయం లేకపోయినా మనిషిలో ఆశా భావాలు లేకపోతే జీవించుట భారమైపోతుంది
ప్రతి మనిషికి పిల్లలకు ఓ సమానత్వ భావాలను కలిగించేలా జీవిత నిర్మాణ విధానాన్ని ఆలోచించండి
నాలో కొన్ని భావాలు కొన్ని విధానాలను తెలుపగలవు ఐతే అవి స్వేచ్ఛా జీవితాన్ని ఎంతవరకు అందించగలవో
No comments:
Post a Comment