అంతర్ముఖ ప్రయాణం చీకటిలో సాగుతున్నా నీవే నక్షత్రాలను వెలిగించుకో
అంతరిక్షంలో సాగే నీ ప్రయాణంలో అనేక విశ్వ రూపాలను సూక్ష్మంగా గమనించు
ప్రతి రూపాన్ని విశ్వ విజ్ఞానంగా స్వీకరించి అనేక భావాలను మేధస్సున దాచుకో
ప్రతి భావాన్ని నక్షత్రాలతో వెలిగించి చూస్తే నీ మేధస్సు అంతర్కాంతి లోకమే
అంతర్కాంతితో నీ అంతర్ముఖం విశ్వ తేజస్సుతో వెలుగుతూ నిలిచిపోతుంది
No comments:
Post a Comment