కాలం క్షణంతో ఆగదని మరో క్షణానికి తెలుసా
గడిచే క్షణానికే కాలం ఆగదని తెలుస్తున్నదా
గడిచే కాలమే మరో క్షణాన్ని సృష్టిస్తున్నదా
ఓ క్షణం పూర్తయితే మరల ఆ క్షణమే సాగుతుందా
ఓ క్షణమే ప్రతి క్షణంగా సాగుతున్నదా
కాలం పగలు చీకటి మాత్రమే క్షణం మనం నిర్ణయించినది
క్షణం పూర్తయితే కొత్త క్షణమేనని నా భావన
అదే క్షణమైతే భూత కాలమంతా ఓ క్షణమే
No comments:
Post a Comment