మహా దర్శన భాగ్యం అంటే ఏమిటి ఎలా కలుగుతుంది
మహా దర్శన భాగ్యం ఓ దివ్య తేజస్సుతో కూడినది
ఓ రూపాన్ని దర్శిస్తే మనస్సు దివ్య జ్ఞాన తేజస్సుతో వెలిగిపోతుంది
మనస్సులో ఎటువంటి కల్మషం లేక అజ్ఞాన విజ్ఞాన భావాలు శూన్యమే
ఓ రూపాన్ని తిలకించుటలో కూడా మహా దర్శన భాగ్యం కలుగుతుంది
సూర్యోదయ సూర్యాస్తమయ భావాలను తిలకించేటప్పుడు మహా దర్శనమే
సూర్యుని కిరణాలలో ఒక్కొక్క కిరణ తేజస్సును దర్శించుటలో మహా భాగ్యమే
సూర్య మేఘాలలో కనిపించే కిరణాలు మహా దివ్య దర్శనమే
మేఘాలలో కనిపించే సూర్య తేజస్సు ఆకార వర్ణాలు మహా భావ దర్శనమే
వర్ష ప్రభావమున కలిగే ఇంద్ర ధనుస్సు దర్శన భాగ్యము వర్ణ తేజోదయమే
కొండల నడుమ ఉదయించే సూర్యోదయ దర్శనం గ్రామాన్ని మేల్కొలిపే భాగ్యం
నది సముద్ర తీరాలలో ఉదయించే సూర్యోదయ భావాలు మహా దివ్య దర్శనాలే
నిండు వెన్నెల పున్నమి చంద్రున్ని సంధ్య వేళ తూర్పున దర్శించుటలో మహా భాగ్యమే
వలయాకారంలో పడమర దిక్కున కనిపించే లేత చంద్ర దర్శనం అద్భుత భాగ్యమే
చంద్రుడు వివిధ ఆకృతులతో వివిధ వర్ణాలతో వివిధ సమయాలలో ఉదయించే దర్శనం నేత్ర భాగ్యమే
చంద్రునికి దగ్గరలో కనిపించే నక్షత్ర దర్శనం మహా దివ్య కాల భాగ్యమే
బ్రంహ ముహూర్తంలో తూర్పున ఉదయించే నక్షత్రాన్ని దర్శించుటలో మహా జ్ఞాన భాగ్యమే
పడమర దిక్కున సంధ్య వేళ తేట తెల్లని మేఘంలో ఉదయించే నక్షత్ర దర్శనం అపురూపమే
విశ్వమున విద్యుత్ వెలుగులు లేక కనిపించే అనేక కాంతి తత్వ నక్షత్రాల దర్శనం అమోఘమే
క్షణాలలో ఎన్నో రకాలుగా వివిధ వర్ణాలను విరజిల్లే నక్షత్ర దర్శనం మహా దివ్యత్వమే
విశ్వమున ప్రకృతిని ఏ సమయంలో ఎక్కడ ఎలా చూసినా ఎన్నో అద్భుతాలతో దర్శనమే
సూర్య చంద్రులు ఒకే సారి ఆకాశాన కనిపించే దర్శనం మహా భావ భాగ్య దర్శనమే
ఆకాశంలో విహరించే పక్షుల వరుసలు వివిధ ఆకృతులు మహానంద దర్శనమే
మేఘాలలో మెరిసే మెరుపులు ఉరుముల రేఖల కాంతి భావాలు మహోదయ దర్శనమే
భవనాలలో కిటికీల ద్వారమున తలుపుల ద్వారమున పడే సూర్య చంద్రుల కాంతి ఆరోగ్య భాగ్యమే
వివిధ ప్రదేశాలలో చిన్న రంధ్రాల ద్వారమున పడే సూర్య చంద్రల కాంతి వెలుగులు నుదుటి భాగ్య దర్శనమే
చెట్లలో మొక్కలలో చొచ్చుకునిపోయేలా సూర్య చంద్ర కిరణ కాంతులు మహా ప్రాంత దర్శనమే
ఆలయ గోపురాలపై మసీదుల పై అంచులలో చర్చి పై భాగాలలో మహా కట్టడాల పై అంచులలో పడే సూర్య కిరణం దివ్య దర్శనమే
మహా చతుర్కోణ కేంద్ర భుజాల పై అంచులలో పడే విశ్వ సూర్య చంద్ర కాంతి భావాలు మహా విజ్ఞాన దర్శన భాగ్యమే
విశ్వమున ఏ దివ్య దర్శన భాగ్యమైనా ఏ సమయమైనా ప్రతి క్షణం నా మేధస్సులో కలుగుతూనే ఉంటాయి
No comments:
Post a Comment