నీలో ఏ భావన లేదో చెప్పగలిగితే నే తెలుపగలను దాని కారణము
నీవు వద్దనుకున్న భావన నీలో లేదని చెప్పగలవేమో గాని నీలో లేని భావనంటు ఉండదు
ప్రతి భావన ప్రతి మనిషిలో ఉంటుంది కొన్ని కాల ప్రభావాల వల్ల మనలో అవి ఉద్భవించవు
మేధస్సులో ప్రతి భావన ఉంటుంది గాని దాని ప్రభావం వివిధ కాల పరిస్థితులవల్ల కల్గుతాయి
కొన్ని భావాలను కొన్ని సాధనాల ద్వారా మన శక్తి సామర్థ్యాల ద్వారా కలుగజేసుకోవచ్చు
మనం జీవించుటలో అన్ని భావాలు అవసరం లేదు విజ్ఞాన సమయాలోచిత భావాలుంటే చాలు
No comments:
Post a Comment