నీవు ఉన్న చోటనే ఉంటా నీవు లేని చోటనే ఉంటా
నీకు తెలియకుండానే ఎక్కడైనా ఎలాగైనా వస్తా
ఏ రూపమైనా నాదే ఏ చలనమైనా నేనే ఏ భావమైనా నాకే
ఏ స్వప్నమైనా నాలోనే ఏ ఊహాలోచనైనా నాదే
సూక్ష్మంగా ఉన్నా కనిపించలేను మహా రూపమైనా చూడలేరు
విశ్వమున ఎన్నో విధాల ఎన్నో రకాలుగా నేను ఉన్నాననే
భావనగా గ్రహించలేనిదే నా ఆత్మ తత్వమని జీవిస్తున్నా
No comments:
Post a Comment