మేధస్సులో కలిగే ప్రతి ఆలోచనలో మూడు భావాలు ఉంటాయి
ఒక భావన విజ్ఞానాన్ని రెండో భావన అజ్ఞానాన్ని ఆలోచిస్తుంది
మూడో భావన విజ్ఞాన లేదా అజ్ఞాన భావాన్ని ఎంచుకుంటుంది
మనం ఎంచుకునే భావన విధానం ద్వార మనం పని చేయగలుగుతాము
అజ్ఞాన భావనను ఎంచుకునేలా మనస్సు ఆత్రేయంగా అన్వేషిస్తుంటుంది
మేధస్సుతో మనం విజ్ఞాన భావాన్ని ఎంచుకునేలా ఎరుక కలిగి ఉండాలి
కాలం ఎప్పుడూ అజ్ఞాన భావాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఇస్తుంది
ప్రతి కార్యమున కలిగే ఆలోచనలలో విజ్ఞాన ఆలోచన భావాన్ని గమనించాలి
విజ్ఞాన భావంతో ఆలోచిస్తూ పోతేనే ప్రతి కార్యం విజ్ఞానంగా సాగుతుంది
No comments:
Post a Comment