ఎన్ని లోకాలు తిరిగినా కర్మ మేధస్సున వెంటాడుతూనే ఉంటుంది
ఎంత విజ్ఞానం ఉన్నా కాలం జీవితాన్ని విచారకరంగా మార్చేస్తుంది
సమయాలోచనకు సమయస్పూర్తికి సరైన ఎన్నిక కలగటం లేదు
ఆశతో ఆలోచిస్తే అజ్ఞానం వెంటాడినట్టే జీవితాన్ని విచారంగా మారుస్తుంది
భవిష్యత్ పై సరైన విజ్ఞాన నిర్ణయం లేకపోతే మేధస్సున అజ్ఞానమే కలుగుతుంది
ఎరుకలేని క్షణమున ఆలోచన భావన అజ్ఞానమై జీవితం కర్మగా మారుతుంది
ఎన్ని లోకాలు తిరిగినా మేధస్సున విజ్ఞాన ఎరుక లేకపోతే కాల ప్రభావమైనా విచారమే
No comments:
Post a Comment