Wednesday, November 10, 2010

దృష్టి దేనిపై పెడితే దానిపై మనస్సు

దృష్టి దేనిపై పెడితే దానిపై మనస్సు ఆలోచిస్తుందంటే మనస్సులో ఏదో భవిష్య అన్వేషణ గుణం ఉన్నట్లే
మనస్సు మరల మారుతుందంటే కొత్త భావాన్ని అన్వేషిస్తున్నట్లే
మనస్సు మారుతున్నా గత భావన గుర్తు ఉందంటే మనలో మేధస్సు నిక్షేపం ఉందనే తెలుస్తుంది
భావాలు అర్థమవుతున్నాయంటే ఆలోచన మనలో కలుగుతున్నాయనే
ఆలోచనగా అర్థాన్ని గ్రహించుటలో మేధస్సున ఎరుక ఏర్పడుతుంది
ఎరుకతో మనస్సును కేంద్రీకరిస్తూ ఆలోచన అర్థాన్ని గ్రహిస్తూ మేధస్సున దాచుకుంటున్నాము
అర్థంగా దాచుకున్నదంతా మేధస్సున జ్ఞాపకంగా ఉంటుందని తెలుస్తుంది
అర్థం కానివి కూడా అర్థం కానట్లే మేధస్సులో నిక్షేపమై ఉంటాయి
జ్ఞానేంద్రియాలతో మనస్సును కేంద్రీకరిస్తూ వివిధ రకాలుగా ఆలోచనలతో అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నాము
ఇంకా ఎన్నో కీలకమైన విషయాలను తెలుపగలను అలాగే మీకు అర్థం చేసుకునే విచక్షణ భావాలు ఉండాలి

No comments:

Post a Comment