నవంబరు 12, 2010 ఉదయం 5 గం|| 25 ని|| లకు నేను ఆకాశాన్ని తిలకించిన విధానము
అప్పుడప్పుడే తెల్లవారుతున్న వేళ తూర్పున ఓ దివ్య నక్షత్రాన్ని మహా ప్రకాశంతో దర్శించాను
5 సె|| మీ|| ల వ్యాసార్ధంతో మహా కాంతి ప్రకాశములతో కనిపిస్తూ నా మేధస్సును మెప్పించినది
ఆకాశమంతా అలా చూస్తుంటే ఎన్నో నక్షత్రాలు మహా దివ్యంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి
ఎన్నో రోజులు ఎన్నో విధాల ఎన్నో నక్షత్రాల దివ్య కాంతి ప్రకాశములను ఎన్నో రకాలుగా తిలకించాను
మేధస్సును మెప్పించే నక్షత్ర భావాలతో నా అంతరాత్మ దివ్య వర్ణాల కాంతులతో మెరుస్తున్నది
No comments:
Post a Comment