Saturday, November 20, 2010

ప్రపంచాన్ని చూడరా ఆత్మ జ్ఞానంతో

ప్రపంచాన్ని చూడరా ఆత్మ జ్ఞానంతో అద్భుతాలనే పరిశోధించరా నీ మేధస్సుతో
ప్రపంచంలోని అద్భుత రూపాల శాస్త్రీయ నిర్మాణ విధానాన్ని నీవే తెలుసుకోరా
ప్రపంచంలోని విజ్ఞానాన్ని తెలుసుకుంటేనే విశ్వ రూపాలను పరిశోధించగలవు
విశ్వ రూపాలను నీకు చూపిస్తా విశ్వ విజ్ఞానాన్ని నీకు కల్పిస్తా లెక్కించరా
అంతులేని ఆశ్చర్యమైన విశ్వ రూప విన్యాసం అఖండమైన అద్భుత విజ్ఞానమే
నక్షత్రాన్ని సృష్టించిన విధానం నీకు తెలుసా అందులో వర్ణ భావాలు ఎలా ఉదయిస్తాయో గమనించావా
ఎన్నెన్నో లోకాలు ఎన్నెన్నో అద్భుత రూపాలు విశ్వంలోనే ఎన్నో భావాలతో వెలిశాయి
సూర్య చంద్ర గ్రహాలు వెలిసిన భావాలు నా మేధస్సులో అంతులేని విశ్వ విజ్ఞానంగానే
విశ్వం వెలిసిన విధానాన్ని నీవు గ్రహించగలిగితే విశ్వమే నీవై నిలిచిపోతావు
ప్రపంచంలో వెలిసిన "చతుర్కోణ కేంద్ర భుజం" నిర్మాణం ఓ విజ్ఞాన విశ్వ విన్యాసమే
ఎన్నో అద్భుతాలను ఆనాటి మానవులు సాధారణ శాస్త్రీయ విజ్ఞానంతో నిర్మించినవే
ఒక ఆలోచన ఎప్పుడు కలిగినా అది నిర్మాణంగా పూర్తి కావడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది
సంవత్సరాలుగా ఓ ఆలోచనను ఆశయంగా ధృడ సంకల్పంతో నెరవేర్చుటయే మహా విషయం
ఓ ఆలోచనకు అనుకున్నట్లుగా రూప నిర్మాణాన్ని ఇవ్వటం మహా గొప్ప విషయమే
ప్రపంచంలోనే గొప్పగా చతుర్కోణ కేంద్ర భుజాన్ని సంవత్సరాలుగా నిర్మించుట ఆలోచనకే అద్భుతం

No comments:

Post a Comment