మీరు జీవించుటలో దేనిని ఆత్మ పరంగా గమనించారు
మీ ఆత్మ వయసు మీకు తెలుసా మీ ఆత్మ అనుభవం మీకు తెలుసా
మీ జీవితం విజ్ఞానంగా సాగుతున్నదా విశ్వ విజ్ఞానం మీకు గుర్తుందా
ఆత్మ అనుభవం గుర్తులేని విధంగా జీవితాన్ని మరో వైపు సాగిస్తున్నారు
విశ్వ విజ్ఞానంతో సాగించలేని జీవితం ఆత్మ జ్ఞానం లేని సాధారణ జీవనమే
యుగాలుగా ఎన్నో శరీరాలు వదిలినా ఆత్మకు కర్మ ఫలమే గాని మోక్ష జ్ఞానం లేదు
మోక్షం లేని ఆత్మ మరల మరో శరీరంతో కర్మతో జన్మిస్తుందేగాని విశ్వ చైతన్యం పొందదు
శ్వాసను గమనిస్తే ఆత్మ పరంగా నీవు ధ్యానిస్తూ విశ్వ విజ్ఞానంతో ఆధ్యాత్మకంగా జీవించగలవు
No comments:
Post a Comment