నీ మేధస్సుకు తెలియకుండా నీలో ఓ కొత్త భావన చేరుతుంది
కాలం నీకు తెలియక నీలో ఎన్నో భావాలను మేధస్సున కలుగజేస్తుంది
నీకు తెలియని భావాలు నీలో ఎన్నో ఆత్మ పరంగా లోలోపల దాగి ఉన్నాయి
ఆత్మకు జన్మ జన్మల ఎన్నో రకాల భావాలు అందుతూనే ఉంటాయి
విశ్వ కాలం ప్రతి క్షణాన ఎన్నో రకాల భావాలను మేధస్సుకు తెలియకుండా కలుగజేస్తుంది
ఆత్మకు తెలియని భావన లేదు మేధస్సు మరవని ఆలోచన లేదు ఆత్మ ఓ మహా విశ్వమే
ఓ జన్మలో తెలిసినవి ఆ జన్మలోనే గుర్తు ఉండేలా మేధస్సుకు మరో జన్మకు గుర్తులేక పోతాయి
నేటి కాలమున నీకు కలిగే ఓ కొత్త భావన విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించడమే
No comments:
Post a Comment